ఎజెండాలో లేకున్నా ఆమోదమా... : భూమా నాగిరెడ్డి | No agenda before bifurcation, says Bhuma Nagi Reddy | Sakshi
Sakshi News home page

ఎజెండాలో లేకున్నా ఆమోదమా... : భూమా నాగిరెడ్డి

Published Fri, Oct 4 2013 3:20 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

No agenda before bifurcation, says Bhuma Nagi Reddy

నంద్యాల(కర్నూలుజిల్లా), న్యూస్‌లైన్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు  రాజీనామా చేసి అప్పుడే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి ఉండాల్సిందని వైఎస్సార్‌సీపీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. టీ-నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత రాజీనామా చేయడంలో అంతర్యం ఏమిటని, ఇది కూడా ఒక డ్రామా అని ఆరోపించారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర సమరాంధ్రగా మారిందన్నారు. అసలు క్యాబినెట్ అజెండాలోనే లేకుండా ఈ అంశాన్ని ఆమోదించారంటే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం తగలబడి పోతుంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ నాయకుడు సీఎం రమేష్‌లు రహస్యంగా సమావేశం కావడం ఆ పార్టీ అక్రమ మైత్రికి మరో తార్కాణమని భూమా నాగిరెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement