
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ జింఖానా గ్రౌండ్‌లో
సాక్షి, విజయవాడ: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ జింఖానా గ్రౌండ్‌లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్‌లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది.
దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే రోజు అదే గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తామని, అనుమతించాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున‍్నది. ఇరువర్గాల దరఖాస్తులను నగర పోలీసులు పరిశీలిస్తుండగా శాంతిభధ్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇరువర్గాల సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద నిషేధాజ్ఞలు విధించారు.