తప్పనిసరైతే.. మూడు నెలలకు సీఎం ఆమోదం తీసుకోవాలి
సాక్షి, అమరావతి: ఇంకా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు సెప్టెంబర్ నెల నుంచి జీతాలు బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తిగల సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ నుంచి పనిచేస్తుంటే వారికి సెప్టెంబర్ నెల నుంచి వేతనాల చెల్లింపును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి శ్రీకాంత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తప్పనిసరిగా హైదరాబాద్‌లో ఉండే పనిచేయాల్సి వస్తే అందుకు మూడు నెలలకు మించకుండా ఆర్థిక శాఖ ఆమోదంతో పాటు ముఖ్యమంత్రి ఆమోదం పొందాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.