భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం పట్టణంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరస దీక్షలు, కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ సెంటర్‌లో మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీలు శుక్రవారానికి నాలుగోరోజుకు చేరాయి. నాల్గవ రోజు దీక్షలను టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు.
ముంపు గ్రామాలను వేరు చేయటం వలన గిరిజనులతో పాటు అనేక మంది గూడు లేక చెల్లాచెదురవుతారని అన్నారు. సాయంత్రం ఈ దీక్షలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సుబ్బారావు, టీఆర్‌ఎల్‌డీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహిసాక్షి రామాచారి, టీఎన్‌జీవోస్ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, రావులపల్లి ఈశ్వరయ్యలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. నాల్గొరోజు దీక్షల్లో ఎంఎస్‌పీ బూర్గంపాడు మండల కమిటీ నాయకులు దేపంగి రమణయ్య, ముసలయ్య, ఈశ్వరయ్య, వెంకయ్య, నర్సయ్య, మురళీ కృష్ణ, శ్రీకాంత్, రాగా నరేష్ తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు గొడ్ల మోహన్‌రావు, అలవాల రాజా, అవులూరి రాము, మందల రవిబాబు, టీజీఓ డివిజన్ అధ్యక్షులు సీతారాములు, గిరిజన సంఘ అధ్యక్షులు రమేష్ నాయక్, ఇర్పా రాజు, టీఆర్‌ఎస్‌వీ పుల్లారావు, ఎండి బషీర్‌లు ఉన్నారు.
మూడో రోజుకు చేరిన కాంగ్రెస్ దీక్షలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను పార్టీ సీనియర్ నాయకులు పలివెల మాధవరావు ప్రారంభించి మాట్లాడారు. ఏజెన్సీలోని ఆదివాసీలు, ప్రతీ ఒక్కరు తెలంగాణలోనే నివసించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని అభిప్రాయపడ్డారు. సాయంత్రం ఈ దీక్షలను పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, ఏ, బీ బ్లాకు అధ్యక్షులు నల్లపు దుర్గాప్రసాద్, తాళ్లపల్లి రమేష్ గౌడ్‌లు నిమ్మరసం విరమింపజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు ప్రాంతాలు తెలంగాణలో కొనసాగుతాయని ప్రకటన వెలువడే వరకు దీక్షలు కొనసాగుతాయని అన్నారు. ఈ దీక్షల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్‌కే వసీమా, ఎస్‌కే హసీనా, నాయకులు అసుగోజు శ్రీను, బండోతు శ్రీను, పున్నం సూర్య, గాయత్రి, దొంతు వరలక్ష్మి, తుమ్మల కమల, రావులపల్లి పుష్ప, నాగమణి, పద్మావతి, అత్తిలి ఆదినారాయణ, మహిబీ కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు కుంజా ధర్మ, గొంది బాలయ్య, దొంతు మంగేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వి కృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ వై గోపి, పౌరసమితి నాయకులు ఎల్‌ఐసీ సత్యనారాయణ, సరేళ్ల నరేష్, భీమనాధం కృష్ణమూర్తి, ఎస్ రామరాజు, కోటగిరి సత్యనారాయణ, డేగల నాగేశ్వరరావు ఉన్నారు.
సంతకాలు సేకరించిన సీపీఎం నాయకులు...
భద్రాచలం డివిజన్‌లోని 94 ముంపు గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్, సభ్యులు డాక్టర్‌లు సీతారామరాజు, సురేష్‌కుమార్‌లు తొలి సంతకాలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. శ్యాంప్రసాద్, పట్టణ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీఎస్ శంకర్‌రావు, స్వామి, బి.శరత్‌బాబు, ప్రతాప్, వెంకటరెడ్డి, రామారావు, సత్యాలు, గిరిప్రసాద్, ప్రభావతి, మాధవరావు, సంతోష్, రామకృష్ణ, నాగరాజు, సతీష్, లీలావతి, గంగ, జ్యోతి, సక్కుభాయి పాల్గొన్నారు.
ఆగని నిరసనలు
Published Sat, Feb 15 2014 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement