తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామి వారిని 65,236 మంది భక్తులు దర్శించుకోగా, 22,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.