487 బార్లకు నోటిఫికేషన్‌ | Notification for 487 bars In AP | Sakshi
Sakshi News home page

487 బార్లకు నోటిఫికేషన్‌

Published Sat, Nov 30 2019 4:37 AM | Last Updated on Sat, Nov 30 2019 4:37 AM

Notification for 487 bars In AP - Sakshi

సాక్షి, అమరావతి: నూతన బార్ల విధానం 2020–21కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిసెంబర్‌ 6వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు లాటరీ తీసి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి బార్లను కేటాయించనున్నట్లు ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

దరఖాస్తు ఇలా
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 29 నుంచి మొదలైంది.
డిసెంబర్‌ 6వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆఫ్‌లైన్‌లోనూ డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తుకు అవకాశం. 
​​​​​​​- జిల్లా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు.
​​​​​​​- డిసెంబర్‌ 7వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి అదే రోజు రాత్రి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు.

రెండేళ్ల పాటు కొత్త విధానం
​​​​​​​- నూతన విధానం కింద బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
​​​​​​​- జనవరి 1వతేదీ నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. 
​​​​​​​- బార్‌ లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా దరఖాస్తు ఫీజు రూ.10 లక్షల్ని తిరిగి చెల్లించరు. 

40% బార్ల తొలగింపు
జనవరి 1వతేదీ నుంచి నూతన బార్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం తొలగించి 487 బార్లకు మాత్రమే లైసెన్సులు జారీ చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement