
ట్రిబ్యునల్ ఆదేశాలు గౌరవించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గౌరవించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాలు గౌరవించాలన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టాలనే దురుద్దేశం ప్రభుత్వాలకు లేకుంటే రెండు రాష్ట్రాల పోలీసులు అక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. గవర్నర్‌కు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, ఈ విషయంలో ఆయన కఠినంగా ఉండాలని అన్నారు.