శ్రీకాకుళం : లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వివరాలు..జిల్లాలోని పాలకొండ నగరపంచాయతీ కమిషనర్ పీ. కనకరాజు రూ.12,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రజలను లంచం ఇవ్వాలని నిరంతరం వేధిస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని అవినీతి అధికారిని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.