విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నగర కార్పొరేషన్ ఎదుట వృద్ధురాలు పిల్లా లక్ష్మీ గుండెపోటుతో మృతి చెందింది. ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న పెన్షన్ జాబితాలో తన పేరు లేదని అధికారులు చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో ఇంటికి తిరిగి వెళ్తు కార్పొరేషన్ గేటు వద్ద కుప్పకూలి మరణించింది. దాంతో ఆమె మృతదేహంతో కార్పొరేషన్ ఎదుట పలు రాజకీయ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ క్రమంలో రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత రెండేళ్లుగా పిల్లా లక్ష్మీ పెన్షన్ తీసుకుంటుంది. అయితే పెన్షన్ ఇక రాదన్న విషయం తెలుసుకుని ఆమె తీవ్ర వేదనకు గురై మరణించింది.