'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం | olympic day run celebrations in telugu states | Sakshi
Sakshi News home page

'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం

Published Tue, Jun 23 2015 10:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం

'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒలింపిక్ డే రన్ మంగళవారం విజయవంతంగా ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ కార్యక్రమాలను జిల్లాల వారీగా చూస్తే..

అనంతపురం: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఒలింపిక్ డే రన్ ప్రారంభించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో సినీనటులు రానా దగ్గుపాటి, ఛార్మీ, రెజీనా, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

విజయనగరం: జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ నిర్వహించారు. క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ రన్‌ను స్థానిక ఎమ్మెల్యే ఎం.గీత క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పీ ఛైర్మన్ స్వాతిరాణి పాల్గొన్నారు.

నెల్లూరు: పట్టణంలోని ఏసీ స్టేడీయంలోని వీఆర్‌సీ గ్రౌండ్‌లో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్స్‌లర్ వీరయ్య జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement