ఒలింపిక్ పతకమే లక్ష్యం | Olympic medal my target : matsa santoshi | Sakshi
Sakshi News home page

ఒలింపిక్ పతకమే లక్ష్యం

Published Thu, Nov 13 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఒలింపిక్ పతకమే లక్ష్యం

ఒలింపిక్ పతకమే లక్ష్యం

అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, అంతులేని అంకితభావం... ఈ మూడింటికీ చిరునామా మత్స సంతోషి. వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ, పతకాలు కొల్లగొడుతూ జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. మామూలు పల్లె నుంచి వచ్చినా తనదైన కృషితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగి దేశానికి పతకాలు అందిస్తోంది. ఇప్పుడామె రైల్వేలో సీనియర్ టీసీగా విధులు నిర్వహిస్తోంది. సంతోషి ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన కానుక ఇది. ఉద్యోగం రావడం సంతోషమే అయినా, ఒలింపిక్స్‌లో పతకం సాధించినపుడే తన లక్ష్యం నెరవేరుతుందని సంతోషి తెలిపారు. ప్రస్తుతం విజయనగరం రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సంతోషి ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ వివరాలు... - విజయనగరం టౌన్
 
*  వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి
* రైల్వే సీనియర్ టీసీగా విధుల నిర్వహణ

 
ప్ర: రైల్వేశాఖలో విధులు నిర్వహించడం ఎలా ఉంది?
జవాబు : విజయనగరం రైల్వేస్టేషన్‌లో సీనియర్ టీసీగా విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు కామన్‌వెల్త్‌లో పాల్గొన్న నలుగురికి రైల్వేశాఖ అవకాశం ఇచ్చింది. వారు ఆయా ప్రాంతాల్లో విధుల్లో చేరారు. ఆంధ్రప్రదేశ్ తరఫున నేను విజయనగరం కోరుకున్నాను. ఆరోగ్యం సహకరించక కొన్ని రోజులు లీవులో ఉన్నాను.  గత కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తున్నాను.
 
ప్ర: ఈతరం క్రీడాకారులకు మీరిచ్చే సలహా?
జవాబు : క్రీడాకారులు తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాలి. కృషితోనే  ఫలి తం ఉంటుంది. శ్రమయేవ జయతే అన్నది అక్షర సత్యం. తల్లిదండ్రులు ప్రోత్సాహం పూర్తిస్థాయిలో ఉండాలి. ఎవరికి ఏ రంగాల్లో ఇంట్రస్ట్ ఉంటుందో అటువైపు వెళ్లేందుకు కు టుంబ సభ్యులు తగిన రీతిలో సహకరించాలి. అప్పుడే క్రీడాకారులు మరిం తగా రాణించగలుగుతారు.  నిరుత్సాహం వీడాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.
 
ప్ర:  ప్రస్తుతం మీ ప్రాక్టీస్ ఎలా ఉంది?
జవాబు : ఉద్యోగ రీత్యా కొంత  ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ మాత్రం విడువలేదు. నిరంతరం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా  ప్రాక్టీస్ చేస్తున్నాను. రైల్వే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలందిస్తున్నారు. వారి ప్రోత్సాహంతోనే మరింతగా ముందుకు వెళ్లగలుగుతున్నాను. మార్చిలో సీనియర్ నేషనల్స్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉంటాయి. వాటికోసం ప్రిపేర్ అవుతున్నాను.


 
ప్ర:  మీ తదుపరి లక్ష్యం?
జవాబు : 2016లో జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకం పతకం తీసుకురావడమే నా లక్ష్యం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అహర్నిశలూ శ్రమించి పతకం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. కోచ్ చల్లారాము ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాను.  
 
 

రైల్వేకు గర్వకారణం
విజయనగరం రైల్వేస్టేషన్‌లో సీని యర్ టీసీగా మత్స సంతోషి  రా వడం రైల్వేశాఖకు గర్వకారణం. భారతదేశానికి మరిన్ని పతకాలు తీసుకువచ్చి, రైల్వేశాఖకు, విజ యనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని ఆశిస్తున్నాం. మా డిపార్ట్‌మెంట్ తరఫున పూర్తి సహాయ,సహకారాలు ఆమెకు అందిస్తున్నాం.
 - డీవీఎన్.రావు, సీనియర్ కమర్షియల్ మేనేజర్
 
శుభ పరిణామం
క్రీడాకారులకు సముచిత రీతిలో సత్కారం చేయడం ఆనందంగా ఉంది.  కేంద్రప్రభుత్వం గుర్తించి సంతోషికి సీనియర్ టీసీగా జి ల్లాలో ఉద్యోగం ఇవ్వడం అభినందనీయం. దీంతో ఎంతో మంది క్రీడాకారులకు ఓ నమ్మకం కలుగుతుంది. సంతోషి భవిష్యత్‌లో మరింతగా రాణించాలి. రైల్వేశాఖ తరుపున పూర్తి సహకారం అందజేస్తాం.
 - బి.చంద్రశేఖరరాజు, స్టేషన్ మేనేజర్, విజయనగరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement