‘ఓం’కాయ | om letter in Aubergine omkaram | Sakshi
Sakshi News home page

‘ఓం’కాయ

Published Sat, Nov 22 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

‘ఓం’కాయ

‘ఓం’కాయ

ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు
జియ్యమ్మవలస: ఓం కారంలోనే సమస్త ప్రపంచం ఇమిడి ఉందంటారు. అటువంటి ఓంకారం ఓ వంకాయలో ఇమిడి ఉంది. ప్రపంచం అంతా ఇమిడి ఉండే ఓంకారం వంకాయలో ఇమిడి ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే జిల్లాలో మారుమూల జియ్యమ్మవలస మండలానికి వెళ్లాల్సిందే. మండలంలోని శిఖబడి గ్రామంలో వంకాయలో ‘ఓం’ అక్షరం ఉండడంతో గ్రామస్తులు తండోపతండాలుగా చూడడానికి వస్తున్నారు.

గ్రామానికి చెందిన చెన్నాపురం విజయలక్ష్మి కూర వండడానికి వంకాయను కోస్తుండగా అందులో ‘ఓం’ అనే అక్షర రూపం కనబడింది. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి గ్రామస్తులు ఆసక్తిగా ఆమె ఇంటికి వస్తున్నారు. కార్తీక మాసంలో ఇలా కనబడడం అదృష్టమని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement