Omkaram
-
వైభవంగా జ్యోతి ఆరాధనోత్సవాలు
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో తొలిసారిగా నిర్వహిస్తున్న కాశిరెడ్డి నాయన 21వ ఆరాధన ఉత్సవాలకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆశ్రమ నిర్వాహకులు పదిరోజులుగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. కాశిరెడ్డినాయనకు పీతిపాత్రమైన జొన్న రొట్టెలను బండిఆత్మకూరు మండలంలో పాటు వెలుగోడు, నందాయలతో పాటు ప్రకాశం జిల్లా నుంచి కూడా భక్తులు తయారు చేసి తీసుకొచ్చారు. రాత్రి 12గంటల సమయంలో ఆశ్రమంలో ఉన్న గాయత్రి దేవి వద్ద, కూర్మగిరి క్షేత్రంలోను జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే జ్ఞాన జ్యోతిని చూసి తరించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సోమవారం ఉదయం నుంచే తరలి వచ్చారు. సాయంత్రం సమయంలో భక్తులరద్దీ మరింత పెరిగింది. -
కలకలం రేపిన పొట్టు బస్తాలు
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వలో సుమారు పొట్టుతో కూడిన 50 బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడంతో కలకలం రేగింది. ఈ బస్తాలో ఉన్న పొట్టు ఒక రకమైన వాసన వస్తుండటంతో ఎందుకు ఉపయోగిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సింగవరం, సోమయాజులపల్లె గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ విధంగా సంచుల్లో ఉన్న పొట్టును మసాలా తయారీలో కల్తీ చేయడానికి తీసుకెళ్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. -
భక్తుల మనోభావాలు కాపాడుతాం
- ·పూజలు, ప్రసాదం, తాగునీటికి అనుమతి - కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బండి ఆత్మకూరు: భక్తుల మనోభావాలు కాపాడతామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ఓంకార క్షేత్రం సమీపంలోని నల్లమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారి ఆలయం వద్ద కాశిరెడ్డినాయన ఆశ్రమ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం భోజనాలను అందించేవారు. ఇటీవల అటవీ అధికారులు కొండపైకి వాహనాలు వెళ్లకుండా, భోజనాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంతో భక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ బుధవారం డీఎఫ్ఓ శివప్రసాద్‌తో కలిసి కాలినడకన కొండపైకి వెళ్లారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలోకి వస్తుందని, ఇది నిషిద్ధప్రాంతమని ఇక్కడకు ఎవరు రావడానికి వీలు లేదని డీఎఫ్ఓ శివప్రసాద్ కలెక్టర్‌కు వివరించారు. కాగా ఐదారేళ్లుగా కొండపైకి వచ్చే భక్తులకు అన్న దానం చేస్తున్నామని, అటవీశాఖ అధికారులు ఉన్నఫలంగా నిషేధం విధిస్తే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆశ్రమ నిర్వాహకుడు పెప్సీ నాగేశ్వరరెడి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండుమూడు రోజుల్లో అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించి వాహనాల ద్వారా అన్నదానం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక భక్తులు నిర్వహించుకునే పూజలు, తాగునీటి సరఫరా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. దేవాదాయశాఖ ఆధీనంలోకి ఆలయాల నిర్వహణ నల్లమల కొండపై నిర్మించిన వెంకటేశ్వరస్వామి, అమ్మవారి ఆలయాల నిర్వహణ దేవాదాయశాఖ ఆధీనంలోకి వచ్చే విధంగా దేవాదాయశాఖ అధికారులతో చర్చిస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ఈ ఆలయాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల కంటే దేవాదాయశాఖ ఆధీనంలో ఉండడం మంచిదన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి ఉన్నారు. -
ఓం కారం... శబ్దాలకు ప్రధాన ద్వారం
అకార ఉకార మకారాలలో అకారం... భూమి, చె ట్లు లేదా ఇతర వస్తువులకు, ఉ కారం... ఆకారం, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు, మకారం... ఆకృతి ఉండీ లేనటువంటివానికి ప్రతీకగా ఉండటం, అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండటం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడూ కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూండటం వల్ల, శాశ్వతప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరవాత మోక్షం పొందగలుగుతాడు. అలౌకికం దేనిగురించయినా అదే మొదటిది అని చెప్పేటప్పుడు ఓం ప్రథమంగా అని చెబుతారు.ఎందుకంటే ఓంకారం అన్నింటికన్నా ముందుండేది. ఓంకారానికి మతపరంగా ఎనలే ని ప్రాధాన్యముంది. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతినామానికీ మొదటగా ఓంకారాన్ని చేర్చిన తర్వాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన మొట్టమొదటి అక్షరం ఓంకారమని వే దోక్తి. ఓంకారం నుంచి వెలువడే ప్రతిధ్వనులు భగవంతుడు సర్వవ్యాపకుడని వివరిస్తాయి. బౌద్ధం, జైనం, హిందూ... ఏ మతంలోనైనా దీనికి ప్రాధాన్యత ఎక్కువ. దీనికే ప్రణవ నాదమని కూడా పేరు. ఓంకారాన్ని నాసికతో సుదీర్ఘంగా పలుకుతారు. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రధానద్వారం. ఓం అనేది ఏకాక్షరం. పంచ పరమేష్ఠుల నుంచి తయారుచేయబడిందనేది వారి విశ్వాసం. ఓం నమః అనేది నమక మంత్రానికి సూక్ష్మరూపం. ఓంకారాన్ని మొట్టమొదటగా ఉపనిషత్తులు వర్ణించాయి. ఇది ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు,నేపాల్‌లో కూడా ఓం అనే అక్షరం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఓం అనేది భగవంతుడి పేరు. ఆయనకు సంబంధించిన ప్రతిధ్వని. ఒక్కొక్క అక్షరాన్నీ వరసగా పరిశీలిస్తే అకార ఉకార మకారాలు. ఇది ఆధ్యాత్మికశక్తిని ఈ మూడు శబ్దాలలో చూపుతుంది. ఓంకారం చేత మనలో శక్తి ప్రజ్జ్వరిల్లి ఆ శబ్దోచ్చారణ వల్ల సమాధిస్థితి కలిగి అంత్యాన అపరిమితానందం కలుగుతుంది. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది. అక్షరాలన్నీ ఏర్పడి సగుణబ్రహ్మగా మారుతుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది.. శరీరంలో ఉన్న నాడీవ్యవస్థలో ఇడ (కుడివైపున ఉన్నవి) అ కారంతోను, పింగళ (ఎడమవైపున ఉన్నవి) ఉ కారంతోను, సుషుమ్న (మధ్యలో ఉన్నవి) నాడీ వ్యవస్థ మ కారంతోనూ ఉత్తేజం చెంది, స్వస్థత పొందుతాయి. ఆర్యసమాజం ఓంకారాన్ని దైవస్వరూపంగా భావించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో, ‘నేను ఈ సృష్టికి తండ్రిని. నేనే తల్లిని, ఆధారాన్ని కూడా నేనే. జ్ఞానాన్ని ప్రసాదించే ఓంకారాన్ని నేనే అని ఓంకారం గురించి వివరించాడు. బ్రహ్మశక్తి (సృష్టి), విష్ణుశక్తి (స్థితి), శివశక్తి (లయ) ఓం అనేది ఒక ప్రతీకాత్మక చిహ్నం. విశ్వమంతా ఇదే. మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక, మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్ద మాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నిటినీ కోల్పోయినట్టే. - డి.వి.ఆర్ -
ఓంకారం కల్యాణ మండపాల వద్ద ఉద్రిక్తత
కర్నూలు : కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓంకారం కల్యాణ మండపాలను కూల్చేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నించారు. అయితే అక్కడే ఉన్న వేలాదిమంది భక్తులు అధికారులను అడ్డుకోవడానకి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహించిన మరికొంత మంది భక్తులు బేస్ క్యాంపుకు నిప్పుపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఓం’కాయ
ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు జియ్యమ్మవలస: ఓం కారంలోనే సమస్త ప్రపంచం ఇమిడి ఉందంటారు. అటువంటి ఓంకారం ఓ వంకాయలో ఇమిడి ఉంది. ప్రపంచం అంతా ఇమిడి ఉండే ఓంకారం వంకాయలో ఇమిడి ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే జిల్లాలో మారుమూల జియ్యమ్మవలస మండలానికి వెళ్లాల్సిందే. మండలంలోని శిఖబడి గ్రామంలో వంకాయలో ‘ఓం’ అక్షరం ఉండడంతో గ్రామస్తులు తండోపతండాలుగా చూడడానికి వస్తున్నారు. గ్రామానికి చెందిన చెన్నాపురం విజయలక్ష్మి కూర వండడానికి వంకాయను కోస్తుండగా అందులో ‘ఓం’ అనే అక్షర రూపం కనబడింది. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి గ్రామస్తులు ఆసక్తిగా ఆమె ఇంటికి వస్తున్నారు. కార్తీక మాసంలో ఇలా కనబడడం అదృష్టమని గ్రామస్తులు అంటున్నారు. -
బుల్లితెర మీద ప్రేమపావురం!
‘కబూతర్ జా జా జా కబూతర్ జా’ అంటూ వెండితెర మీద ఆమె కదులుతుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అప్పట్లో. ఆ ఒక్క సినిమా ఆమెని అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలబెట్టేసింది. ఆమె ఎవరో అర్థమైపోయింది కదూ... అవును, భాగ్యశ్రీనే. ‘మైనే ప్యార్ కియా’ని ఆమె కోసమే మళ్లీ మళ్లీ చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగువారి మనసులనూ దోచేసింది శ్రీ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఇరవై సినిమాలు కూడా చేయకుండానే సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో చేసిన ‘ఓంకారం’ చిత్రమే ఆమె చివరి సినిమా. ఆ తరువాత కాపురం, పిల్లలు అంటూ ఓ సాధారణ మహిళలా బతకసాగింది. అయితే ఆమె లోని నటీమణి అలానే ఉండిపోలేకపోయింది. హిందీ సీరియళ్లతో పునఃప్రవేశం చేసింది. ఇంతవరకూ ఓ అయిదు సీరియళ్లు చేసింది. ఇప్పుడు ఆరో సీరియల్ ‘లౌట్ ఆవో త్రిష’తో రాబోతోంది. పద్దెనిమిదేళ్ల కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన, ఆతృత ఎలా ఉంటాయన్నదే ఈ సీరియల్. త్రిష అనే అమ్మాయికి తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది. దాదాపు సీరియల్ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిష అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో విచిత్రమైన అనుభవాలు ఎదురు కావడం, వాటిని సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని ఊరిస్తున్నారు... ఈ సీరియల్‌ని ప్రసారం చేయనున్న లైఫ్ ఓకే చానెల్ వారు. ఏబీసీ చానెల్లో ప్రసారమైన ‘మిస్సింగ్’ ఆధారంగా ఈ సీరియల్‌ని రూపొందించారు. ‘మిస్సింగ్‌ను కేవలం పదే పది ఎపిసోడ్లతో ముగించారు. మరి హిందీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి!