చిత్తూరు: జిల్లాలోని బి. కొత్తకోట మండలం మొగసాలమర్రి వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.