రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Published Thu, Oct 17 2013 4:20 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
తానూరు, న్యూస్‌లైన్ : మండలంలోని హిప్నెల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం వ్యాన్ బెల్‌తరోడా వైపు వెళ్తుండగా.. ఆటో బెల్‌తరోడా నుంచి తానూరు వైపు వెళ్తోంది. హిప్నెల్లి గ్రామ సమీపంలో డీసీఎం, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎల్వి గ్రామస్తుడు శంకర్ పటేల్ తీవ్రంగా, తానూర్‌కు చెందిన నాగేశ్, సాయినాథ్, పోశెట్టి, సంతోష్ స్వల్పంగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకర్‌పటేల్(45)కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
ఆరుగురికి గాయాలు
బంధం(నేరడిగొండ) : మండలంలోని బంధం క్రాస్ రోడ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. నేరడిగొండ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారు, నిర్మల్ నుంచి ఇచ్చోడ వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బంధం క్రాస్ రోడ్డు వద్ద ఢీకొన్నాయి. దీంతో బోథ్ మండలం కండేపల్లికి చెందిన రాథోడ్ చందు, సంతోషి, బాల్కొండ మండలం వెల్గటూర్‌కు చెందిన నర్సయ్య, భూమేశ్, నరేశ్, మహేందర్ గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement