టెకీ కుమారుడు అపహరణ.. ఆపై హత్య | one year boy murder | Sakshi
Sakshi News home page

టెకీ కుమారుడు అపహరణ.. ఆపై హత్య

Published Thu, Dec 25 2014 12:16 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

one year boy murder

గుంటూరు: రెండేళ్ల వయసున్న బాలుణ్ని అపహరించి.. ఆపై కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని తాడేపల్లి మండలం కనదుర్గమ్మ వారధి వద్ద గురువారం వెలుగుచూసింది. తెనాలికి చెందిన మోక్షజ్క్ష అనే బాలుడ్ని సొంత చిన్నానే కిడ్నాప్ చేసి హత్య  చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ వివాదాల కారణంగా ఆ బాలుణ్నిహత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య గావించబడ్డ మోక్షజ్ఞ తండ్రి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా,  తాత రాంబాబు పొన్నూరు పీఎస్ లో ఏఎస్ఐగా విధులు నిర్వరిస్తున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి చిన్నాన పరారీలో ఉన్నాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement