శిద్దా రాఘవరావు, కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లోనే విజయభేరి మోగించింది. ఈసారి కూడా ఆ పార్టీనే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ మూడుసార్లు గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ బలంగా ఉండటం, మాగుంట కుటుంబానికి ఉన్న సేవాభావం, ప్రజల్లో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో ఆయన విజయం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో టీడీపీ నుంచి బరిలో ఉన్న శిద్దా రాఘవరావు గడిచిన ఐదేళ్లుగా మంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లాకు చేసేందేమీ లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించి గెలిచిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్ల అవకతవకలు, అరాచకాలకు అండగా ఉన్నారు. దొనకొండలో పరిశ్రమల పేరుతో ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా దోచుకోవడం, కనీసం రైతులకు సాగర్‌నీరు కూడా ఇవ్వలేకపోవడంతో ప్రజల్లో ఆయన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
15,49,979 - నియోజకవర్గంలోని ఓటర్లు
7,74,908 - పురుషులు
7,74,918 - స్త్రీలు
153 - థర్డ్ జెండర్
1,931 - నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లు
ఎక్కువసార్లు కాంగ్రెస్‌దే విజయం...
ఒంగోలు పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే ఒంగోలు పార్లమెంట్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. పశ్చిమ ప్రకాశంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.
1952లో ద్విసభ్య పార్లమెంట్‌గా ఏర్పాటు...
ఒంగోలు ద్విసభ్య పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 ఎన్నికల్లో ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. మొదటి ఎంపీలుగా మంగళగిరి నానాదాస్, పీసుపాటి వెంకటరాఘవయ్యలు ఎన్నికయ్యారు. తొలి ఏకసభ్య ఎంపీగా రొండా నారపరెడ్డి ఎన్నికయ్యారు. 2009 పునర్విభజన సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని దర్శి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని గిద్దలూరు అసెంబ్లీలను ఒంగోలు పార్లమెంట్‌లో కలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీతో పాటు యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపితో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. వీటిలో కొండపి, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాల వివరాలు...
ఎన్నికలు జరిగిన సంవత్సరం | గెలిచిన అభ్యర్థి, పార్టీ | పోలైన ఓట్లు | ప్రత్యర్థి, పార్టీ | పోలైన ఓట్లు | మెజార్టీ |
2014 | వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ | 5,89,960 | మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ | 5,74,302 | 15,658 |
2009 | మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ | 4,50,442 | ఎంఎం కొండయ్య యాదవ్, టీడీపీ | 3,71,919 | 78,523 |
2004 | మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ | 4,46,584 | బత్తుల విజయకుమారి, టీడీపీ | 3,40,563 | 1,06,021 |
1999 | కరణం బలరామకృష్ణమూర్తి, టీడీపీ | 3,92,840 | మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ | 3,70,892 | 21,948 |
1998 | మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ | 3,51,390 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ | 3,30,524 | 20,866 |
1996 | మాగుంట పార్వతమ్మ, కాంగ్రెస్ | 3,81,475 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ | 3,31,415 | 50,060 |
1991 | మాగుంట సుబ్బరామిరెడ్డి, కాంగ్రెస్ | 3,29,913 | డేగా నరసింహారెడ్డి, టీడీపీ | 2,90,583 | 39,330 |
1989 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ | 3,96,282 | కాటూరి నారాయణస్వామి, టీడీపీ | 2,98,912 | 97,370 |
1984 | బెజవాడ పాపిరెడ్డి, టీడీపీ | 2,87,662 | పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ | 2,69,519 | 18,143 |
1980 | పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ | 2,66,831 | ఎ.భక్తవత్సలరెడ్డి, జనతా | 1,15,656 | 1,51,175 |
1977 | పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ | 2,52,206 | ముప్పవరపు వెంకయ్యనాయుడు, బీఎల్‌డీ | 1,62,881 | 89,325 |
1971 | పి.అంకినీడు ప్రసాదరావు, కాంగ్రెస్ | 2,84,597 | గోగినేని భారతీదేవి, ఇండిపెండెంట్ | 1,04,703 | 1,79,894 |
1967 | కొంగర జగ్గయ్య, కాంగ్రెస్ | 2,12,071 | మాదాల నారాయణస్వామి, సీపీఎం | 1,31,613 | 80,458 |
1962 | మాదాల నారాయణస్వామి, సీపీఐ | 1,27,120 | టీఎస్ పాలస్, కాంగ్రెస్ | 1,24,777 | 2,343 |
1957 | రొండా నారపరెడ్డి, కాంగ్రెస్ | 1,36,582 | మాదాల నారాయణస్వామి, సీపీఐ | 1,11,963 | 24,619 |
1952 (ద్విసభ్య) | పీసుపాటి వెంకట రాఘవయ్య మంగళగిరి నానాదాస్, ఇండిపెండెంట్లు |
– – |
– – |
– – |
24,949 76,747 |
Comments
Please login to add a commentAdd a comment