shiddha raghavarao
-
ఒంగోలు పార్లమెంటులో వార్ వన్‌సైడ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లోనే విజయభేరి మోగించింది. ఈసారి కూడా ఆ పార్టీనే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ మూడుసార్లు గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ బలంగా ఉండటం, మాగుంట కుటుంబానికి ఉన్న సేవాభావం, ప్రజల్లో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో ఆయన విజయం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నుంచి బరిలో ఉన్న శిద్దా రాఘవరావు గడిచిన ఐదేళ్లుగా మంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లాకు చేసేందేమీ లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించి గెలిచిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్ల అవకతవకలు, అరాచకాలకు అండగా ఉన్నారు. దొనకొండలో పరిశ్రమల పేరుతో ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా దోచుకోవడం, కనీసం రైతులకు సాగర్‌నీరు కూడా ఇవ్వలేకపోవడంతో ప్రజల్లో ఆయన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 15,49,979 - నియోజకవర్గంలోని ఓటర్లు 7,74,908 - పురుషులు 7,74,918 - స్త్రీలు 153 - థర్డ్ జెండర్ 1,931 - నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లు ఎక్కువసార్లు కాంగ్రెస్‌దే విజయం... ఒంగోలు పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే ఒంగోలు పార్లమెంట్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. పశ్చిమ ప్రకాశంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 1952లో ద్విసభ్య పార్లమెంట్‌గా ఏర్పాటు... ఒంగోలు ద్విసభ్య పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 ఎన్నికల్లో ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. మొదటి ఎంపీలుగా మంగళగిరి నానాదాస్, పీసుపాటి వెంకటరాఘవయ్యలు ఎన్నికయ్యారు. తొలి ఏకసభ్య ఎంపీగా రొండా నారపరెడ్డి ఎన్నికయ్యారు. 2009 పునర్విభజన సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని దర్శి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని గిద్దలూరు అసెంబ్లీలను ఒంగోలు పార్లమెంట్లో కలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీతో పాటు యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపితో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. వీటిలో కొండపి, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాల వివరాలు... ఎన్నికలు జరిగిన సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి, పార్టీ పోలైన ఓట్లు మెజార్టీ 2014 వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ 5,89,960 మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ 5,74,302 15,658 2009 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 4,50,442 ఎంఎం కొండయ్య యాదవ్, టీడీపీ 3,71,919 78,523 2004 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 4,46,584 బత్తుల విజయకుమారి, టీడీపీ 3,40,563 1,06,021 1999 కరణం బలరామకృష్ణమూర్తి, టీడీపీ 3,92,840 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 3,70,892 21,948 1998 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 3,51,390 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ 3,30,524 20,866 1996 మాగుంట పార్వతమ్మ, కాంగ్రెస్ 3,81,475 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ 3,31,415 50,060 1991 మాగుంట సుబ్బరామిరెడ్డి, కాంగ్రెస్ 3,29,913 డేగా నరసింహారెడ్డి, టీడీపీ 2,90,583 39,330 1989 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ 3,96,282 కాటూరి నారాయణస్వామి, టీడీపీ 2,98,912 97,370 1984 బెజవాడ పాపిరెడ్డి, టీడీపీ 2,87,662 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,69,519 18,143 1980 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,66,831 ఎ.భక్తవత్సలరెడ్డి, జనతా 1,15,656 1,51,175 1977 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,52,206 ముప్పవరపు వెంకయ్యనాయుడు, బీఎల్డీ 1,62,881 89,325 1971 పి.అంకినీడు ప్రసాదరావు, కాంగ్రెస్ 2,84,597 గోగినేని భారతీదేవి, ఇండిపెండెంట్ 1,04,703 1,79,894 1967 కొంగర జగ్గయ్య, కాంగ్రెస్ 2,12,071 మాదాల నారాయణస్వామి, సీపీఎం 1,31,613 80,458 1962 మాదాల నారాయణస్వామి, సీపీఐ 1,27,120 టీఎస్ పాలస్, కాంగ్రెస్ 1,24,777 2,343 1957 రొండా నారపరెడ్డి, కాంగ్రెస్ 1,36,582 మాదాల నారాయణస్వామి, సీపీఐ 1,11,963 24,619 1952 (ద్విసభ్య) పీసుపాటి వెంకట రాఘవయ్య మంగళగిరి నానాదాస్, ఇండిపెండెంట్లు – – – – – – 24,949 76,747 -
అటకెక్కిన అమాత్యుల హామీలు
సాక్షి, మార్టూరు: అధికారం హస్తగతం చేసుకోవడానికి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలవికాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏమాత్రం తీసిపోకుండా పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు నియోజకవర్గానికి భారీ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు గత 5 సంవత్సరాలుగా ప్రచార ఆర్భాటాలు చేసిన సంగతి కూడా విదితమే. మార్టూరు మండలంలో మంజూరైనట్లు చెప్పిన ఒక్క పథకం ఆచరణలో ఎక్కడా కనిపించపోవటాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. నాగరాజుపల్లి ఫుడ్‌పార్క్ ఏమైంది ? మండల పరిధిలోని నాగరాజుపల్లి గ్రామ కొండ సమీపంలో సర్వే నెంబరు 575 లో ఫుడ్పార్కుతో పాటు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు నేతలు 2015లో హడావిడిగా ప్రకటించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు 50 ఎకరాల కొండ పోరంబోకును జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి అప్పట్లోనే అప్పగించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేపట్టకపోగా అధికార పార్టీ నేతలు తలా కొంచెం రెవెన్యూ భూమిని ఆక్రమించే పనుల్లో ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారిన కేంద్రీయ విద్యాలయం మండలంలోని బబ్బేపల్లి గ్రామంలోని కొండ సమీపంలో సర్వే నంబరు 387/11తో 10 ఎకరాల భూమిని సేకరించి 2015వ సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయం స్థాపిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అప్పట్లో హడావిడి చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వగ్రామం బబ్బేపల్లి. కేంద్రీయ విద్యాలయం కార్యరూపం దాలిస్తే తమ పిల్లలకు నాణ్యమైన విద్య అభ్యసించే అవకాశం దొరుకుతుందని ప్రజలు భావించారు. విద్యాలయం కోసం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఆ భూమిని చదును చేస్తున్నట్లు చెప్పి గ్రావెల్ తవ్వి అమ్ముకోవడం గమనార్హం. సంవత్సరాలు గడుస్తున్నా నేతలు చెప్పినట్లు గ్రామంలో కేంద్రీయ విద్యాలయం రాకపోవటంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. అతీగతీ లేని వలపర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజి మార్టూరు తర్వాత మండలంలో పెద్ద గ్రామమైన వలపర్లకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేస్తానని 2017 అక్టోబర్‌లో ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్ వలపర్ల పర్యటనలో ప్రకటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు సమీపంలో కొండ దిగువన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని ఏలూరి ప్రకటించారు. ఈ రెండూ నేటికీ కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మళ్లీ మీరే రావాలి అంటూ ఫ్లెక్సీల ద్వారా ఆర్భాటం చేస్తున్న శాసనసభ్యుడిని తమకు ఇచ్చిన హామీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శిలాఫలకానికే పరిమితమైన పశువుల హాస్పిటల్ శిలాఫలకానికే పరిమితమైన బొల్లాపల్లి పశువుల హాస్పిటల్ నీరు, పశుగ్రాసం ఎద్దడి ఎదుర్కోవడంతో పాటు పశువుల సంరక్షణ కోసం మండలంలోని బొల్లాపల్లి కొండ సమీపంలో సర్వే నంబరు 525 లో 9.74 ఎకరాల భూమిలో పశువుల వసతి గృహం ప్రారంభిస్తున్నట్లు 22–3–2015 వ తేదిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. దీంతో వేసవిలో పశుగ్రాసం, నీటికొరత అధిగమించవచ్చని రైతులు, పశుపోషకులు భావించారు. నాటికీ నేటికీ శిలాఫలకం మాత్రమే దర్శనమివ్వటం మినహా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అభివృద్ధి శూన్యం కేంద్రీయ విద్యాలయం గ్రామానికి వస్తుందని సంతోషించాం. విద్యాలయం రాకపోగా కొండ కింద గ్రావెల్ స్థానిక నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్భాటపు పస్రంగాలతో, శిలాఫలకాల ప్రారంభాలతో ఐదేళ్లు సరిపుచ్చారు. అభివృద్ధిని మాత్రం మరిచారు. - దుడ్డు దానయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బబ్బేపల్లి పశువుల హాస్పిటల్ శిలాఫలకంతో సరి మా గ్రామంలో పశువుల వసతి గృహం నిర్మిస్తారంటే రైతులంతా సంతోషించారు. శిలాఫలకం వేశాక ఇంతవరకు పురోగతి లేదు. ఇక వస్తుందన్న నమ్మకం పోయింది. పశువులకు హాస్పిటిల్ లేకపోవడంతో మేము పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. - నార్నె సింగారావు, బొల్లాపల్లి -
అమాత్యుని..అభివృద్ధి చూతము రారండి!
దర్శి: జిల్లాకు చెందిన ఏకైక మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గం దర్శిలో అభివృద్ధి చేశామని శిలాఫలకాలు వేసుకోవడం తప్ప ఎక్కడా ఆ జాడ కనిపించడం లేదు. వీధికో శిలాఫలకం వేయడం లక్షలాది రూపాలయలు నిధులు కేటాయించడం.. తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకున్నారనేందుకు బసిరెడ్డిపల్లె గ్రామమే ఒక ఉదాహరణ. బసిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి చిన్నపాటి వర్షం కురిసింది. చిన్న వర్షానికి గతంలో వేసిన సిమెంట్ రోడ్లలో నీరు అలాగే నిలబడిపోయింది. మంత్రి శిద్దా రాఘవరావు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి కాలువలు నిర్మించారు. నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉండటంతో కాలువల్లో మురుగు బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఇదీ మంత్రి శిద్దా రాఘవరావు అభివృద్ధి పేరుతో ప్రజాధనం ఖర్చు చేసి.. చేస్తున్న అభివృద్ధి తీరు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమేగాక గతంలో వేసిన సిమెంట్ రోడ్లు కూడా బుదరమయం చేయడం టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో వీధి కాలువలు రోడ్డుకంటే ఎత్తులో నిర్మించారు. వీధి కాలువల్లో నీరు బయటకు వెళ్లే వీల్లేకుండా గ్రామంలోకి పల్లం..గ్రామం బయటకు మెరక పెట్టి నిర్మించారు. దీంతో రోడ్డుపై పడిన వాననీరు కూడా వీధి కాలువల్లోకి వెళ్లే అవకాశమే లేకుండాపోయింది. చిన్న వర్షం కురిసినా నీరు రోడ్డుపైనే చిన్నపాటి వర్షం కురినినా నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీనికి తోడు గ్రామంలో వీధి కాలువలు నిర్మాణాలు జరిగిన సమయంలో నివాసాల ముందు పెద్ద పెద్ద గుంతలు చేసి పూడ్చకుండా వెళ్లిపోయారని గ్రామస్తులు వాపోయారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసి మెరకలు పోసుకుని కాలువలపై బండలు వేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు చేస్తున్న సమయంలో రోడ్డు కంటే కాలువలు ఎత్తు పెడుతున్నారని, గ్రామంలోకి పల్లం..ఊరి చివర మెరక పెట్టి కాలువలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలువల్లో నీరు బయటకు వెళ్లక ఎక్కడి మురుగు అక్కడే ఆగిపోతోందని వాపోతున్నారు. దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అభివృద్ధి చేందుతున్నారేగానీ గ్రామానికి మాత్రం అభివృద్ధి చేయక పోగా సమస్యలు తెచ్చి పెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రామంలో అన్నీ వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. వీధి కాలువలు నిర్మించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కాలువుల నిర్మాణాలు చేపట్టి గ్రామంలో మురుగు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
రేపటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
ఒంగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్రవాహన చోదకులు ఈ నెల 12వ తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోటారు వాహనాల ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణ కోసం ఈ నెల 1 నుంచి తప్పరిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించామన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకోగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12 నుంచే హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు వివరించారు. అందువల్ల ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు..: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో మరమ్మతులకు గురైన తుపాను షెల్టర్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో బాగుచేస్తామన్నారు. వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదన్నారు.