AP Constituency Review
-
చింతమనేనికి షాక్ తప్పదంటున్న ఓటర్లు
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు తీస్తున్నాయంటూ రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రచార యావను చూస్తే నవ్వు వస్తోందంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్వించిన పోలవరం కాలువలో గోదావరి నీటిని ఎత్తిపోసి.. పట్టిసీమ ప్రాజెక్ట్ అంటూరూ.వందల కోట్లు దోచుకున్నారని.. పోలవరం పేరుతో హడావుడి చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి రూ.వేల కోట్లు దండుకుంటున్నారని చంద్రబాబుఅసలు గుట్టు విప్పారు. 2018 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నీళ్లిస్తామని చంద్రబాబు చెప్పారని.. నేటికీ పునాదుల దశ దాటకపోయినా రాష్ట్రంనలుమూలల నుంచి కార్యకర్తల్ని బస్సుల్లో తీసుకొచ్చి కొండల్ని, బండల్ని, భారీ యంత్రాలను చూపించి.. అవే పోలవరంపనులంటూ భ్రమింప చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎన్నికల వేళ పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం రోడ్ షో నిర్వహించగా.. చంద్రబాబు ఆడుతున్న నాటకాలను బట్టబయలు చేశారు.ఆయన పాలనలో అవినీతి, అరాచకాలు పెచ్చుమీరాయని.. తిమ్మిని బమ్మిని చేస్తూ ఓటర్లను ఏమారుస్తున్న వైనాలను వివరించారు. ఐదేళ్లపాటు టీడీపీ సర్కార్ సాగించిన వంచన.. ఆ పార్టీ ప్రజాప్రతినిధుల దోపిడీ.. ఎమ్మెల్యే ముసుగేసుకున్న రౌడీమూకల దాష్టీకాలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. బలమైన రాజకీయ మార్పునకు నాంది పలుకుతామంటున్నారు. జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు.. 15 శాసనసభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి.. 600కుపైగా హామీలు ఇవ్వడం ద్వారా జిల్లాలో స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దీంతో ఆ పార్టీపై పెద్దఎత్తున ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోంది. అప్పట్లో టీడీపీకి ప్రతక్ష్యంగా మద్దతు పలికి.. ఆపార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన యాక్టర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు డైరెక్టర్ చంద్రబాబు చెప్పినట్టు నటిస్తూ టీడీపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తుండటంపై జనం మండిపడుతున్నారు. డైరెక్టర్, యాక్టర్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి.. ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలబడటానికి ‘పశ్చిమ’ ఓటర్లు సిద్ధమవుతున్న తీరు ‘సాక్షి’ రోడ్ షోలో స్పష్టంగా కన్పించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో సీన్ రివర్స్ కావడం ఖాయమని అధిక శాతం ఓటర్లు స్పష్టం చేయడం గమనార్హం. ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాష్టీకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందని షేక నవాబ్ అనే వ్యాపారి వాపోయారు. నగర పాలక సంస్థ పరిధిలో చిన్నపాటి పనికైనా ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తున్నారని టీడీపీకే చెందిన కార్పొరేటర్ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. భూకబ్జాలు పెట్రేగిపోయాయని, ఐదేళ్లుగా దాష్టీకాలను భరిస్తూ వచ్చామని, పోలింగ్ రోజున ఓటు అనే ఆయుధంతో ప్రతీకారం తీర్చుకుంటామని పలువురు ఓటర్లు స్పష్టీకరించారు. టీడీపీపై అన్నివర్గాల ప్రజలల్లోనూ అసహనం వ్యక్తమవుతుండటం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సానుకూలత వ్యక్తమవుతుండటంతో ఏలూరు నియోజకవర్గంలో వార్ వన్‌సైడ్‌గా కనిపిస్తోంది. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మమ్మల్ని తూలనాడిన చింతమనేనికి.. తమ వర్గాల దెబ్బేంటో చూపిస్తామని ఆ వర్గాలకు చెందిన ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇసుక దోపిడీకి అడ్డుపడిన తహసీల్దార్ వనజాక్షినే కాదు, అనేక మంది మహిళలపై చింతమనేని దాడులకు తెగబడ్డారని.. అలాంటి దుశ్సాసనుడికి బుద్ధి చెబుతామని మహిళలు అంటున్నారు. ‘పోలవరం కుడి కాలువలో 1.45 ఎకరాల భూమిని సర్కార్ సేకరించింది. ఎకరానికి రూ.22 లక్షలే వస్తుందని.. తాను రూ.44.90 లక్షలు ఇప్పించానని.. ఇందుకు ప్రతిఫలంగా రూ.22 లక్షలు లంచంగా ఇవ్వాలంటూ చింతమనేని లాక్కున్నారు. నా పొలంలో పోలవరం కుడి కాలువ తవ్వకంలో తీసిన మట్టిని చింతమనేని దొంగలించి.. ఒక లారీ మట్టిని రూ.3 వేల చొప్పున నాకే అమ్మాడు. ఇలాంటి దోపిడీదారుడిని సాగనంపుతాం’ అని పెదవేగి మండలం ఏపూరుకు చెందిన ఒక రైతు చెప్పారు. వీటిని బట్టి చూస్తే దెందులూరులో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నది తేలిపోయింది. డైరెక్టర్ చంద్రబాబు చెప్పినట్టు నటిస్తున్న యాక్టర్ పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో ఎదురుగాలి వీస్తోంది. కొవ్వూరు, గోపాలపురం, ఉంగుటూరు, పోలవరం, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, చింతలపూడి నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. నరసాపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ, జనసేన లాలూచీ పడి అభ్యర్థులను బరిలోకి దించారు. ఈ క్రమంలోనే యాక్టర్ పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును జనసేన అభ్యర్థిగా పోటీకి నిలిపారు. టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యే శివరామరాజును టీడీపీ పోటీకి దించి.. డమ్మీని చేసింది. టీడీపీ, జనసేన మధ్య లాలూచీ బయటపడటం, నాగబాబు వ్యవహార శైలి జీర్ణించుకోలేని రీతిలో ఉండటం.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజుకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలు ఉండటంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచార సభలకు జన స్పందన భారీగా లభించటంతో నరసాపురం లోక్‌సభ స్థానం వైఎస్సార్ సీపీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో చోటుచేసుకున్న అరాచకాలను, అకృత్యాలను, మోసపూరిత విధానాలను ఏకరువు పెట్టిన ప్రజలు టీడీపీ సర్కారు పాలనకు చరమగీతం పాడతామని ముక్తకంఠంతో చెప్పారు. – రామ్‌గోపాల్‌రెడ్డి, సాక్షి, అమరావతి చంద్రబాబు ధృతరాష్ట్రుణ్ణి మించిపోయారు మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపిస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను దండించాల్సిన చంద్రబాబు అతగాడిని ప్రశంసించి ధృతరాష్ట్రుడిని మించిపోయారు. అకృత్యాలకు పాల్పడిన ధృతరాష్ట్రుడు, కౌరవులకు ఆనాడు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, చింతమనేనికి తగిన శాస్తి చేస్తాం. రాజన్న రాజ్యం తెచ్చే జగనన్నకే అండగా నిలుస్తాం.– ప్రమీల, చల్ల చింతలపూడి, దెందులూరు నియోజకవర్గం ఇసుక కావాలంటే సొమ్ములివ్వాలి పక్కనే గోదావరి. ఇళ్లు కట్టుకోవాలంటే గోదాట్లోకి ట్రాక్టర్ వేసుకెళ్లి ఇసుక తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నుంచి ట్రాక్టర్ ఇసుకను రూ.1,500కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా దోచుకున్న సొమ్ములో 50 శాతం వాటాను చంద్రబాబుకు ఇస్తారని శేషారావు అనుచరులే చెబుతున్నారు. అటు గోదారిని తవ్వేసి.. ఇటు మమ్మల్ని దోచేసిన టీడీపీకి ఎందుకు ఓటేయాలి.– తోట సుబ్బారావు, వేలివెన్ను, నిడదవోలు నియోజకవర్గం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 నాటికే పూర్తిచేసి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ల నుంచి సీఎం చంద్రబాబు భారీగా కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడొచ్చి.. మళ్లీ అధికారమిస్తే పోలవరం పూర్తి చేస్తానంటున్న చంద్రబాబును ఎలా నమ్ముతాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరంను పూర్తిచేసే సత్తా జగన్‌కే ఉంది. నా ఓటు జగన్‌కే. – అడపా వెంకటరత్నం, భీమడోలు, ఉంగుటూరు నియోజకవర్గం వడ్డీల ఊబిలో ముంచేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటే నమ్మాం. మా గ్రూపు తరఫున బ్యాంకులో తీసుకున్న రూ.5 లక్షలు కట్టకుండా మానేశాం. చంద్రబాబు చేసిన మోసానికి మాపై రూ.1.50 లక్షల వడ్డీ భారం పడింది. మా గ్రూపులో ఒక్కొక్కరిపై రూ.15 వేల భారం వడ్డీ రూపంలో పడింది. రుణం రూపంలో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.65 వేలు చంద్రబాబు నాకు బాకీ పడ్డారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ కింద రూ.10 వేలు ఇస్తానంటే ఎలా నమ్ముతాం. ముంచేసిన వాడు అన్న ఎలా అవుతాడు?– మద్దినేని సరస్వతి, సజ్జాపురం, తణుకు నియోజకవర్గం రైతులను నిలువునా ముంచారు 2014 ఎన్నికల్లో పంట రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాకు బ్యాంకులో రూ.1.65 లక్షల అప్పు ఉంది. ఇప్పటిదాకా రూ.16 వేలు రుణ మాఫీ కింద ఇచ్చారు. వడ్డీ రూ.85 వేలు అయ్యింది. రుణమాఫీ పేరుతో రైతులందరికీ టోపీ పెట్టిన చంద్రబాబును నమ్మం. మహానేత రాజశేఖరరెడ్డిలా రైతులకు అండగా నిలబడేది జగన్ ఒక్కరే.– సూర్యప్రకాశరావు, తెలికిచర్ల, గోపాలపురం నియోజకవర్గం ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు నేను బీటెక్ (మెకానికల్) సెకండ్ ఇయర్ చదవుతున్నా. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతుంటే.. మాకున్న అర ఎకరం పొలం అమ్మి నాన్న ఫీజు కట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సక్రమంగా విడుదల చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అని చెబుతున్న చంద్రబాబును ఎలా నమ్ముతాం? ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇచ్చే జగన్‌కే నా ఓటు.– బి.నరేంద్ర యాదవ్, శనివారపుపేట, ఏలూరు -
టీడీపీ నేత ఇంట్లోని ఓట్లూ వైఎస్సార్ సీపీకే..
సెంటిమెంట్‌కు పెట్టింది పేరైన తూర్పు గోదావరి ఈ ఎన్నికల్లో సమూల మార్పు కోరుతోంది. ‘తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశాం. చంద్రబాబు పాలన చూశాం. వారి అవినీతి, అరాచకాలు, అకృత్యాలనూ చవిచూశాం. ఇక చాలు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈసారి అవకాశమిద్దాం. మన జీవితాల్లో మార్పు తెచ్చుకుందాం. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకుందాం’ అని నినదిస్తోంది. పోలింగ్‌కు అంతా సిద్ధమైన తరుణాన ‘సాక్షి’ నిర్వహించిన రోడ్ షోలో ఎక్కడికెళ్లినా ఇవే మాటలు వినిపించాయి.– సి. శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి ‘చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించారు. పోలవరం సహా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో తన పాలన గురించి చెప్పకుండా సంబంధం లేని వ్యవహారాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రలోభ పెట్టేలా పసుపు–కుంకుమ, నిరుద్యోగ భృతి అంటున్నారు. వీటిని ప్రజలెవరూ విశ్వసించడం లేదు. కేవలం ఎన్నికల కోసమే వీటిని ప్రకటించారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’ అని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు చెప్పారు. ఐదేళ్ల పాలనా తీరుపై వారేమన్నారంటే.. నిలువునా ముంచి..ఇప్పుడు పసుపు–కుంకుమా డ్వాక్రా రుణాల మాఫీ పేరిట చంద్రబాబు చేసిన మోసాన్ని మహిళలు మరువడం లేదు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పొడగట్లపల్లి, కొమ్మిరెడ్డివారి పాలెంలో ఈ అంశం స్పష్టంగా కనిపించింది. కొమ్మిరెడ్డి పాలెంకు చెందిన జి.సత్యవతి మాట్లాడుతూ.. ‘మా కాలనీలో 6 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అప్పు ఉంది. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు పసుపు–కుంకుమ అంటున్నా మాకు అదీ అందటం లేదు. అప్పు తీర్చాకే ఆ సొమ్ము ఇస్తామని బ్యాంకుల వాళ్లు చెబుతున్నారు. మేం అప్పు చెల్లించినా ఆ సొమ్ములు ఇవ్వడం లేదు’ అని వాపోయింది. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలే మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాయి. ఈసారి ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు అవకాశం ఇవ్వాలని మా డ్వాక్రా గ్రూపుల మహిళలు నిర్ణయించుకున్నారు. పసుపు–కుంకుమ డబ్బులు ఇస్తున్నాం కనుక మాకే ఓటేయండని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ల జేబుల్లోని సొమ్ములిస్తున్నారా?’ అని నిలదీసింది. దాతలిచ్చిన స్థలాలనూ అమ్మేసుకున్నారు ‘ప్రతిపక్షానికి చెందిన వారన్న అక్కసుతో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని పక్కనపెట్టిన ప్రభుత్వం టీడీపీ ఇన్చార్జి బండారు సత్యానందరావు చెప్పినట్టు చేస్తూ పోయింది. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోకుండా టీడీపీ నేతలు స్వలాభం చూసుకున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం దాతలు ఇచ్చిన స్థలాన్ని కూడా తప్పుడు పత్రాలతో అమ్మేసుకున్నారు. ఇలాంటి వారికి మేమెందుకు ఓటు వేయాలి’ అని కొత్తపేటకు చెందిన పలువురు పేదలు ప్రశ్నించారు. నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యశాస్తి మాట్లాడుతూ.. ‘ఖజానాలో డబ్బు లేదంటూనే విచ్చలవిడిగా దుబారా చేస్తున్నారు. జీతాలు, ఫీజులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు డబ్బులు లేవన్నారు. ఓట్ల కోసం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అంటున్నారు. వృథా ఖర్చు తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. ఇందులో చిత్తశుద్ధి లేదు’ అని విమర్శించారు. వెంకట్రామరాజు అనే పెద్దాయన మాట్లాడుతూ.. ‘చదువుకునేందుకో, ప్రగతి సాధించేందుకో ఎవరికైనా డబ్బు ఇచ్చినా మంచిదే. కానీ.. ఓట్ల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం దుర్మార్గం. ఓట్ల కోసం మీరు సంపాదించిన సొమ్ము ఇవ్వొచ్చుగా’ అని టీడీపీ నేతలను నిలదీశారు. టీడీపీ నేత ఇంట్లోని ఓట్లూవైఎస్సార్ సీపీకే.. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో ‘సాక్షి’ రోడ్ షో సందర్భంగా విచిత్రమైన ఘటన ఎదురైంది. నాలుగురోడ్ల కూడలిలో సైకిల్‌పై ఉన్న రామయ్య అనే ఒక వృద్ధుడిని ఎన్నికలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించగా.. తాను పక్కా తెలుగుదేశం కార్యకర్తనంటూ గుర్తింపు కార్డు చూపించాడు. ‘మా ఇంట్లో ఎవరూ టీడీపీకి ఓటు వేయం అంటున్నారు. వాళ్లంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ నాకు ప్రాణం. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కనుక టీడీపీకి ఓటు వేస్తాను. మా ఇంట్లో మిగిలిన ఓట్లన్నీ వైఎస్సార్ సీపీకే’ అని చెప్పాడు. అంబాజీపేటలోనే ఎస్సీ కాలనీకి చెందిన సత్యవాణి, సుభద్రమ్మ అనే మహిళలు మాట్లాడుతూ.. ‘పసుపు–కుంకుమ సొమ్ము రెండు విడతలు అందింది. అది ప్రభుత్వ సొమ్మేగానీ చంద్రబాబు జేబునుంచి ఇచ్చింది కాదు. మేమంతా వైఎస్ జగన్‌కే ఓటు వేస్తాం. వైఎస్సా కొడుకు జగన్‌ను మేమెందుకు మరిచిపోతాం’ అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసు ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు రోజుకో రకంగా చెబుతున్న అంశాలను ప్రజలు విశ్వసించడం లేదు. ఐదేళ్లపాటు తానేం చేశారో చెప్పకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్న చంద్రబాబు తీరునూ దుయ్యబడుతున్నారు. అమలాపురంలోని విష్ణుశ్రీ హొటల్కు భోజనం చేయడానికి వచ్చిన వీవీ ప్రసాద్, సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఏమీ గుర్తుండదని, తానేం చెప్పినా నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తారు. ఓటుతో సరైన సమాధానం చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, టీడీపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. జనసేన, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు కావడాన్ని రెండు పార్టీల్లోని శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. దీంతో పలువురు జనసేన కార్యకర్తలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా మారారు. బాబుకు బుద్ధి చెబుతాం ముమ్మిడివరం నియోజకవర్గంలోనూ టీడీపీకి షాక్ తగలనుంది. ‘మొన్నటి ఎన్నికల్లో మా ఓట్లతోనే చంద్రబాబు గట్టెక్కారు. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు’ అని ముమ్మిడివరంలో పండ్ల దుకాణం నిర్వహిస్తున్న వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఓట్ల కోసం వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధాతో చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. రంగాను మేం దేవుడిలా కొలు స్తాం. ఆయన్ను చంపించిన చంద్రబాబుతో రాధా చేతులు కలుపుతాడా? మారక్తం ఉడికిపోతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతాం’ అని ఆంజనేయులు ఆవేదన చెందారు. అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే.. మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీల పేరిట సాగిన అకృత్యాలు గుర్తు చేసుకుంటున్న ఇక్కడి ప్రజల గుండెలు భగ్గున మండిపడుతున్నాయి. పెద్దాపురానికి చెందిన పెదబాబు అనే ఓ దుకాణదారు మాట్లాడుతూ.. ‘కొత్త రాష్ట్రం కదా అనుభవజ్ఞుడు ఉంటే మంచిదని చంద్రబాబుకు ఓటేశారు. ఆయన్ని నమ్మిన పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని వాపోయారు. సూర్యనారాయణ అనే పెద్దాయన మాట్లాడుతూ.. ‘ఇన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తిని ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ హోమ్ మంత్రి చినరాజప్ప పోలీసుల అండతో కొండను మొత్తం తవ్వేసి రూ.వందల కోట్లు లూటీ చేశార’ని ఆయన మండిపడ్డారు. వడ్రంగి పనిచేసే నాగార్జున మాట్లాడుతూ.. బీసీలకు పనికిరాని పరికరాలు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారన్నారు. ఎన్నికలయ్యాక మొండి చూపారు ఎన్నికల ముందు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి అని చెప్పినా అది ఎవరికీ రావడం లేదు.– వడ్డి ప్రకాశరావు, తాళ్లరేవు తండ్రి బాటలో నడుస్తారు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చూశాం. అన్నివర్గాల వారికీ అన్ని పథకాలు అమలై స్వర్ణయుగంగా నడిచింది. మరో అడుగు ముందుకు వేసి మంచి పనులు చేయడానికి జగన్ ముందుకు వస్తున్నారు. ఈసారి జగన్‌కే అవకాశం ఇద్దాం. తండ్రి మాదిరిగా పాలన సాగిస్తే మళ్లీ మళ్లీ ఆయనే గెలుస్తారు.– జక్కా కృష్ణమూర్తి, వడిశలేరు జగన్‌పైనే నమ్మకం వైఎస్ జగన్ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మా గ్రామానికి వచ్చి మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. అందుకే ఈసారి ఆయనకే ఓటు వేస్తాం. – విశ్వేశ్వరరావు, ముమ్మిడివరం జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. డబ్బులు ముట్టచెప్పిన పథకాలు అందాయి. వాళ్ల అరాచకాలతో విసిగిపోయాం. మేమైతే వైఎస్జగన్కే ఓటు వేస్తాం– నారాయణ, కుమారపురం టీడీపీ వాళ్లకే ఇళ్లిచ్చారు తెలుగుదేశం వాళ్లకే ఇళ్లు, ఇతర పథకాలు ఇచ్చారు. పేదలకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. మాకు ఇళ్లు లేవు. దరఖాస్తు పెట్టుకున్నా ఇవ్వకపోవడంతో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం.– వేలాల నాగేశ్వరరావు, కుమారపురం పెన్షన్ ఇవ్వలేదు ‘నేను పోలియోతో నడవలేని స్థితిలో ఉన్నాను. పెన్షన్ కోసం నాలుగుసార్లు రాజమండ్రి, కాకినాడ నగరాలకు తిరిగా. అయినా.. పింఛను ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మాలాంటి వాళ్లకు ఏమీ చేయలేదు.– గోవిందరాజులు, మార్కండేయపురం -
ఆమదాలవలస.. మారుతోంది దిశ!
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): జిల్లాకు అతి కీలక నేతలను అందించిన ప్రాంతం. బొడ్డేపల్లి రాజగోపాలరావు, తమ్మినేని పాపారావు కాలం నుంచి తమ్మినేని సీతారాం, బొడ్డేపల్లి సత్యవతి కాలం వరకు ఎందరో రాజకీయ ఉద్ధండులను అందించిన గడ్డ. ఇక్కడ ప్రతి ఎన్నికా ప్రత్యేకమే. ప్రస్తుతం టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ బాగా తగ్గింది. వరుసగా బయటపడుతున్న దోపిడీ ఆనవాళ్లు, మచ్చుకైనా కనిపించని ప్రగతి గుర్తులు కూనకు ప్రతికూలంగా మారుతున్నాయి. అదే సమయంలో నిత్యం ప్రజాపోరాటాలు చేసిన తమ్మినేని సీతారాం మళ్లీ చక్రం తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికులు అంటున్నారు. 1952 నుంచి నేటి వరకు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952లో నగరికటకంగా ఈ నియోజకవర్గం ఉండేది. సరుబుజ్జలి, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస మండలాలు అప్పట్లో కలిసి ఉండేవి. మొదటి ఎన్నికల్లో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు, కొత్తకోట గ్రామానికి చెందిన డోల జగన్నాథం, ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని పాపారావు మధ్య త్రిముఖ పోటీ జరిగింది. అప్పలనాయుడు విజయం సాధించి మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని పాపారావు విజయకేతనం ఎగురవేశారు. 67లో నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసి తమ్మినేని పాపారావు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో స్థిరస్థానం సంపాదించారు. 1972లో ఆమదాలవలస నియోజకవర్గంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ కాస్త ఇక్కడ ప్రభావం చూపగలిగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయం కాస్త మారింది. తమ్మినేని సీ తారాం బలమైన నేతగా ఎదగడం అంతా చూశారు. 32 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావుపై 1991లో సీతారాం గెలిచి నవశకానికి నాంది పలికి, తన రాజకీయ చతురత నిరూపించుకున్నారు. తర్వా త అనేక క్యాబినెట్లలో అగ్రస్థాయి నేతగా సీతారాం పనిచేశారు. గత ఎన్నికల్లో కూన రవికుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి తమ్మినేనిపై గెలుపొందారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ్మినేని అడుగులు మరింత వేగంగా అధికారం వైపు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమ రవాణాకు చిరునామాగా నిలుస్తున్నారు. వంశధార, నాగావళి ప్రాంతాల్లోగల గ్రామాలు దూసి, సింగూరు, పురుషోత్తపురం, మూల సవలాపురం, ముద్దాడపేట, బొడ్డేపల్లి తదితర గ్రామాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు కూడా ఇసుక ర్యాంపులు కేటాయించి ఇసుక మాఫియాకు ఆజ్యం పోశారు. ఇక భూకబ్జాల్లో రారాజుగా పేరొందారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో లీజు పేరుతో 99ఎకరాలు ప్రభుత్వ స్థలం కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఆ భూముల్లో కూన వారి పూలతోట వేసేందుకు దరఖాస్తులు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడంతో అది నిలిచిపోయింది. పంచాయతీ రాజ్ కార్యాలయం ఆవరణలోగల కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 30 సెంట్లు ప్రభుత్వ భూమిపై కూన కన్ను పడింది. దీంతో దాన్ని టీడీపీ కార్యాలయం నిర్మాణం పేరుతో కబ్జా చేయాలని చూసిన విప్‌కు పరివర్తన్ ట్రస్ట్ సబ్యుడు చింతాడ రవికుమార్ అడ్డు తగిలడంతో చుక్కెదురైంది. ఇక నీరు చెట్టుతో దోచుకున్న నిధులకే లెక్కే లేదు. కార్యకర్తలకు బెదిరింపులు చేయడంలో విప్ రౌడీ షీటర్ పాత్ర కూడా పోషించారు. ఇటీవల పొందూరు మండలానికి చెందిన గంగిరెడ్ల శివను వైఎస్సార్ సీపీ లోకి వెళ్తే చంపేస్తానని బెదిరించి రౌడీ రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్ సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. గత మూడు విడతలుగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ పథకాలను విరి విగా జనంలోకి తీసుకెళ్లడమే కాకుండా, తన రాజకీయ అనుభవంతో ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెడుతున్నారు. సమస్యలు.. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని అందరూ చెబుతున్నారు. గానీ తెరవడం లేదు. వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో జనాల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ఇక విప్ చెరబట్టిన తీరాలే ఇక్కడి ప్రధాన సమస్య. నిరంతర ఇసుక రవాణా వల్ల ఆయా గ్రామాలు అభివృద్ధి కావడం లేదు. రైల్వే స్టేషన్ ఉన్నా ఆమదాలవలస పారిశ్రామికంగా అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదు. మున్సిపాలిటీలోనూ ప్రగతి అనుకున్నంత మేర కానరావడం లేదు. ఎమ్మెల్యేలు వీరే.. ఆమదాలవలస నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సంవత్సరం ఎమ్మెల్యే 1952 మొదట ఎమ్మెల్యే పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు 1957 తమ్మినేని పాపారావు 1962 తమ్మినేని పాపారావు 1967 తమ్మినేని పాపారావు 1972 పైడి శ్రీరామమూర్తి 1977 పైడి శ్రీరామమూర్తి 1983 తమ్మినేని సీతారాం 1985 తమ్మినేని సీతారాం 1989 పైడి శ్రీరామమూర్తి 1991 తమ్మినేని సీతారాం 1994 తమ్మినేని సీతారాం 1999 తమ్మినేని సీతారాం 2004 బొడ్డేపల్లి సత్యవతి 2009 బొడ్డేపల్లి సత్యవతి 2014 కూన రవికుమార్ -
భావపురి..చైతన్యఝరి
సాక్షి, బాపట్ల : బాపట్లగా పిలువబడే భావపురి కోన ప్రభాకరరావు వంటి ఉద్దండులను అందించింది. కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే ఈ ప్రాంతం.. ధాన్యపు సిరులు కురిపిస్తుంది. ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సూర్యలంక తీరం.. పర్యాటకులను ఆనంద తరంగంలో ముంచెత్తుతుంది. అగ్రికల్చర్ వంటి కళాశాలలతో విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. మత్స్య సందప ఎగుమతితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యం చూపించే నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు కోన కుటుంబానికి పట్టం కట్టారు. రాజకీయ చైతన్యం కలిగిన బాపట్ల స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ దేశ భక్తిని చాటింది. 1936లో ఆంధ్రప్రదేశ్ అవతరణలో తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశం బాపట్లలోనే జరిగింది. 1950మే 5న బాపట్ల పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అవతరించింది. కమ్యూనిస్టు ఉద్యమాలకు 1950 నుంచి కంచుకోటగా భాసిల్లిన బాపట్ల నియోజకవర్గానికి 1955లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. 1967 తరువాత కాంగ్రెస్ పార్టీ వశమైంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేములపల్లి శ్రీకృష్ణ ఎన్నికయ్యారు. 1967లో నియోజకర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 1983లో తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, 1989లో కాంగ్రెస్‌పార్టీ మళ్లీ పాగా వేసింది. 1994,1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చరిత్ర కలిగిన బాపట్లలో కోన కుటుంబం నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా చరిత్ర సృష్టించారు. ఇక్కడ కోన కుటుంబానిదే అరుదైన రికార్డు. ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా బాపట్ల నుంచి గెలుపొందారు.1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి వసరుగా 14సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం 175 రెవెన్యూ గ్రామాలు ఉండగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలతోపాటు బాపట్ల మున్సిపాల్టీ ఉన్నాయి. రాజకీయ పాఠశాలను ప్రారంభించిన బాపూజీ బాపట్ల పట్టణంలోని టౌన్‌హాలులో జరిగిన సమావేశానికి 1923లో హాజరైన బాపూజీ మంతెనవారిపాలెంలో రాజకీయ పాఠశాలను ప్రారంభించారు.1950లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ బాపట్లను సందర్శించి రైల్వే స్టేషన్ సమీపంలో కూడలి ప్రదేశంలో ప్రసంగించారు. 1985లో వాజ్‌పేయి కర్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు దీనదయాళ్ అదే సంవత్సరం ఎన్జీవోహోమ్‌లో జరిగిన సభకు హాజరయ్యారు. సూర్యలంక తీరం.. పర్యాటక కేంద్రం బాపట్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది సూర్యలంక తీరం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ తీరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. బాపట్ల పాడి పంటలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం నుంచి ధాన్యం రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి అవుతుంది. బాపట్లలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. ఇలా విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుపల్లి జనార్దన్ రెడ్డి కూడా బాపట్ల ఎంపీగా గెలుపొందారు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇక్కడ పంటలుగా వరి ఎక్కువగా పండుతుంది. వేరుశనగ, ఆక్వా సాగు, చేపల పెంపకం, మొక్కజొన్న సాగు అధికంగా ఉంటుంది. సూర్యలంక తీరం ఉండడంతో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు 1962లో కొమ్మినేని వెంకటేశ్వరరావు ప్రత్యర్థి మంతెన సత్యవతిపై 1,213 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 1967లో మూడో సారి కూడా కోన ప్రభాకరరావు కేవీ రావుపై 15,227 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1972లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 2,289 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1978లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో సీవీ రామరాజు ప్రత్యర్థి కోన ప్రభాకరరావుపై 29,432 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1985లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యర్థి మంతెన వెంకట సూర్యనారాయణపై 18,027 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో చీరాల గోవర్దన్‌రెడ్డి ప్రత్యర్థి అచ్యుతరామారావుపై 15,583 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1994లో ముప్పలనేని శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి కత్తి పద్మారావుపై 41494 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1999లో అనంతవర్మరాజు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 13,845 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి అనంతవర్మరాజుపై 15,569 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2009లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి చీరాల గోవర్దన్‌రెడ్డిపై 1,363 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014సంవత్సరంలో కోన రఘుపతి ప్రత్యర్థిపై 5,813 ఓట్లతో ఆధిక్యంతో గెలుపొందారు. బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు ఇలా మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం బాపట్ల 27,093 27,850 1 54,943 బాపట్ల టౌన్ 24,704 26,465 2 51,171 కర్లపాలెం 19,218 19,405 1 38,624 పిట్టలవానిపాలెం 14,321 14,919 2 29,242 మొత్తం 85,336 88,639 6 1,73,981 -
ఒంగోలు పార్లమెంటులో వార్ వన్‌సైడ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లోనే విజయభేరి మోగించింది. ఈసారి కూడా ఆ పార్టీనే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ మూడుసార్లు గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ బలంగా ఉండటం, మాగుంట కుటుంబానికి ఉన్న సేవాభావం, ప్రజల్లో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో ఆయన విజయం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నుంచి బరిలో ఉన్న శిద్దా రాఘవరావు గడిచిన ఐదేళ్లుగా మంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లాకు చేసేందేమీ లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించి గెలిచిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్ల అవకతవకలు, అరాచకాలకు అండగా ఉన్నారు. దొనకొండలో పరిశ్రమల పేరుతో ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా దోచుకోవడం, కనీసం రైతులకు సాగర్‌నీరు కూడా ఇవ్వలేకపోవడంతో ప్రజల్లో ఆయన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 15,49,979 - నియోజకవర్గంలోని ఓటర్లు 7,74,908 - పురుషులు 7,74,918 - స్త్రీలు 153 - థర్డ్ జెండర్ 1,931 - నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లు ఎక్కువసార్లు కాంగ్రెస్‌దే విజయం... ఒంగోలు పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే ఒంగోలు పార్లమెంట్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. పశ్చిమ ప్రకాశంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 1952లో ద్విసభ్య పార్లమెంట్‌గా ఏర్పాటు... ఒంగోలు ద్విసభ్య పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 ఎన్నికల్లో ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. మొదటి ఎంపీలుగా మంగళగిరి నానాదాస్, పీసుపాటి వెంకటరాఘవయ్యలు ఎన్నికయ్యారు. తొలి ఏకసభ్య ఎంపీగా రొండా నారపరెడ్డి ఎన్నికయ్యారు. 2009 పునర్విభజన సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని దర్శి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని గిద్దలూరు అసెంబ్లీలను ఒంగోలు పార్లమెంట్లో కలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీతో పాటు యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపితో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. వీటిలో కొండపి, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాల వివరాలు... ఎన్నికలు జరిగిన సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి, పార్టీ పోలైన ఓట్లు మెజార్టీ 2014 వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ 5,89,960 మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ 5,74,302 15,658 2009 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 4,50,442 ఎంఎం కొండయ్య యాదవ్, టీడీపీ 3,71,919 78,523 2004 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 4,46,584 బత్తుల విజయకుమారి, టీడీపీ 3,40,563 1,06,021 1999 కరణం బలరామకృష్ణమూర్తి, టీడీపీ 3,92,840 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 3,70,892 21,948 1998 మాగుంట శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ 3,51,390 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ 3,30,524 20,866 1996 మాగుంట పార్వతమ్మ, కాంగ్రెస్ 3,81,475 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ 3,31,415 50,060 1991 మాగుంట సుబ్బరామిరెడ్డి, కాంగ్రెస్ 3,29,913 డేగా నరసింహారెడ్డి, టీడీపీ 2,90,583 39,330 1989 మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ 3,96,282 కాటూరి నారాయణస్వామి, టీడీపీ 2,98,912 97,370 1984 బెజవాడ పాపిరెడ్డి, టీడీపీ 2,87,662 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,69,519 18,143 1980 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,66,831 ఎ.భక్తవత్సలరెడ్డి, జనతా 1,15,656 1,51,175 1977 పులి వెంకటరెడ్డి, కాంగ్రెస్ 2,52,206 ముప్పవరపు వెంకయ్యనాయుడు, బీఎల్డీ 1,62,881 89,325 1971 పి.అంకినీడు ప్రసాదరావు, కాంగ్రెస్ 2,84,597 గోగినేని భారతీదేవి, ఇండిపెండెంట్ 1,04,703 1,79,894 1967 కొంగర జగ్గయ్య, కాంగ్రెస్ 2,12,071 మాదాల నారాయణస్వామి, సీపీఎం 1,31,613 80,458 1962 మాదాల నారాయణస్వామి, సీపీఐ 1,27,120 టీఎస్ పాలస్, కాంగ్రెస్ 1,24,777 2,343 1957 రొండా నారపరెడ్డి, కాంగ్రెస్ 1,36,582 మాదాల నారాయణస్వామి, సీపీఐ 1,11,963 24,619 1952 (ద్విసభ్య) పీసుపాటి వెంకట రాఘవయ్య మంగళగిరి నానాదాస్, ఇండిపెండెంట్లు – – – – – – 24,949 76,747 -
సేవకుడే అక్కడ లీడర్
సాక్షి, కడప: కమలాపురం నియోజకవర్గంలో 1952 నుంచి 2014 వరకూ 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ, మూడు పర్యాయాలు టీడీపీ, రెండు దఫాలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. వైఎస్సార్సీపీ, సీపీఐ అభ్యర్థులు చెరోసారి విజయం సాధిం చారు. ఈమారు ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. అయినా ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. ఇరుపక్షాలు ముమ్మర ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నిత్యం ప్రజలతో మమేకమై ఉండటం ప్రచారంలో కలిసివచ్చింది. మొత్తం నియోజకవర్గంలో గడప గడపా చుట్టేశారు. టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ప్రచారం ఆలస్యంగా ప్రారంభించారు. ఎన్నికల గడువు ముగిసేలోపు ఇంటింటికీ తిరగడం కష్టసాధ్యమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉద్దండులను ఎన్నుకున్న ప్రజలు.... గత ఎన్నికలు విశ్లేషిస్తే కమలాపురం ఎప్పుడూ ఉద్దండులకు పట్టం కడుతోంది. నర్రెడ్డి శివరామి రెడ్డి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరా టం చేసి, నిర్బంధ జీవితం గడిపారు. సొంత కుటుంబాన్ని ఎదిరించి పోరాటం చేశారు. మహోన్నతుడుగా కీర్తిగడించిన శివరామిరెడ్డి సీపీఐ తరుపున పోటీచేయగా 1952లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన ఎన్ పుల్లారెడ్డి, పేర్ల శివారెడ్డిలను కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. రాయలసీమ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ఎంవీ మైసూరారెడ్డిని 1985లో శాసనసభకు పంపించారు. 1989లో కూడా రెండో పర్యాయం ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తర్వాత కమలాపురం తెరపైకి వచ్చిన వీరశివారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డిని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పుత్తా ప్రతికూలతలు.. నియంతృత్వాన్ని కమలాపురం ప్రజలు కట్టడి చేస్తూ వస్తున్నారు. గత చరిత్ర అదే విషయాన్ని రుజువు చేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎంవీ మైసూరారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాలో 1994 ఎన్నికల్లో పోటీచేయగా కమలాపురం ఓటర్లు తిరస్కరించారు. కమలాపురం మండలాధ్యక్షుడు హోదాలో నియోజకవర్గంలో పరిచయం ఉన్న వీరశివారెడ్డికి పట్టం కట్టారు. అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన దౌర్జన్యకర ఘటనలు మైసూరారెడ్డి ఎన్నికను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మంచితనానికి ఓటర్లు పట్టం కడుతున్నారని. దౌర్జన్యాన్ని సహించని పరిస్థితి ఇక్కడ ఓటర్లలో కనిపిస్తుంది. అదే విషయం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి పట్ల కూడా తేటతెల్లమైంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా ఓటమి చవిచూశారు. పార్టీలు మారినా విజయం దరి చేరలేదు. పుత్తా ఫ్యాక్షన్ చరిత్ర, ఇప్పటికీ కొనసాగుతున్న దౌర్జన్యకర ఘటనలేనని ఇందుకు కారణమని పలువురు వివరిస్తున్నారు. పదేళ్లుగా టీడీపీలో ఉన్నా, ఇప్పటికీ కార్యకర్తలు తమ అభిప్రాయాలు కూడా వెల్లడించలేని పరిస్థితి నెలకొంది. సాహసం చేసి ఎవరైనా అభిప్రాయం వెల్లడిస్తే దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెద్దా చిన్నా చూడకుండా వ్యవహరిస్తారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. పుత్తా పట్ల కమలాపురం ప్రాంత ప్రజల్లో మరో అభద్రతాభావం కూడా లేకపోలేదు. భూములపై కన్ను పడితే వదిలేసుకోవాల్సిందేనని పెద్దచెప్పలి, దేవరాజుపల్లె, సముద్రంపల్లె, పెద్దపుత్త ప్రాంతాలల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు’గా పుత్తా అనుచరులుగా కొంతమంది గ్యాంగ్‌లు నిర్వహిస్తూ ప్రధాన నగరాలల్లో భూ సెటిల్మెంట్లుకు పాల్పడుతోన్నారు. ఇదంతా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకుల అంచనా. అనుకూలించనున్న ఉద్యమ చరిత్ర: ఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి చేపట్టిన ఉద్యమ చరిత్ర ఆయనకు అనుకూలించనుందని పరిశీలకుల భావన. ప్రజాందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే, సర్వారాయసాగర్ను తక్షణమే నిర్మించాలని, 2013లో ఆమరణదీక్ష చేపట్టారు. ఆమేరకు ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించారు. గత ఏడాది గండికోట, వామికొండ ప్రాజెక్టుల నుంచి సర్వారా యసాగర్కు నీటి విడుదలకు విశేషంగా కృషి చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఒత్తిడి తేవడంతో అధికారులు అంగీకరించినా తెరవెనుక టీడీపీ నేతలు మోకా లొడ్డారు. ప్రజల కోసం సర్వారాయసాగర్ నుంచి కడప కలెక్టరేట్ వరకూ పాదయాత్ర చేపట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి సర్వారాయసాగర్‌కు నీరు తెప్పించారు. వీరపునాయునిపల్లె మండల ప్రజానీకం ఇదే విషయం మననం చేసుకుంటుం టారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా నిరంతర పోరాటాలు ఎంచుకున్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రజాఉద్యమాలు చేపట్టిన చరిత్ర ఎన్నికల్లో కలిసిరానున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నియంతృత్వ పోకడ నేపథ్యం ఓ వైపు, ప్ర జా ఉద్యమ చరిత్ర మరోవైపు ఇక్కడ బరిలో పోటీ పడతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పర్చూరులో యువత, మహిళా ఓటర్లే కీలకం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలకు మొత్తం 2,14,392 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 2,29,742 పెరిగింది. అంటే 15,350 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓట్లలో మహిళలు, యువతే కీలకం కానున్నారు. కొత్తగా నమోదైన ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమోదుకు ఉత్సాహం చూపిన యువత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఓట్ల నమోదు చేర్పులు, మార్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నాటికి పర్చూరు నియోజకవర్గ ఓటర్లు 2,19,427 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,547 మంది, స్త్రీలు 1,11,870 మంది ఉన్నారు. దీనిలో మహిళా ఓటర్లే 4,323 మంది అధికంగా ఉన్నారు. అయితే చేర్పులు, మార్పుల విషయంలో ఫాం 6, ఫాం 7కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు వివాదాస్పదమయ్యాయి. ఓటర్లు తమ ఓట్లు తామే తీసేయాలంటూ వచ్చిన అర్జీలపై పునర్విచారణ జరిగింది. దీంతోపాటు మళ్లీ నూతన ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి మార్చి 15వ తేదీ వరకూ చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నుంచి మార్చి 11 వరకు 7782 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు 3020 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10,802 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 10,315 మందికి ఓటు హక్కు లభించింది. దీనిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం 2019లో పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,29,742 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరిలో పురుషుల కన్నా 5,194 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇతరుల కింద మార్టూరు మండలంలో ఇద్దరు, ఇంకొల్లు మండలంలో నలుగురు, చినగంజాం మండలంలో నలుగురు చొప్పున మొత్తం 10 మంది ఇతర ఓటర్లు అంటే థర్డ్ జండర్లు కూడా ఉన్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రస్తుత ఓటర్ల వివరాలు... మండలం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు మార్టూరు 29,307 28,912 58,221 యద్దనపూడి 11,526 10,313 21,839 పర్చూరు 22,138 20,856 42,994 కారంచేడు 16,934 15,998 32,932 ఇంకొల్లు 21,133 19,987 41,124 చినగంజాం 16,425 16,203 32,632 మొత్తం ఓటర్లు 1,17,463 1,12,269 2,29,742 మండలాల వారీగా ఈ ఏడాది పెరిగిన ఓటర్లు మండలం పెరిగిన ఓటర్లు మార్టూరు 3751 యద్దనపూడి 788 పర్చూరు 1548 కారంచేడు 1145 ఇంకొల్లు 1604 చినగంజాం 1479 -
కొండెక్కిన ప్రాజెక్టులు!
పలమనేరు నియోజకవర్గంలోని ముఖ్యమైన రెండు ప్రాజెక్టులు కొండెక్కాయి. పాలకులు, పాలితుల నిర్లక్ష్యంతో ఏటా నదుల్లోని వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా సముద్రం పాలవుతున్న నీటికి అడ్డుకట్టవేయలేకపోతున్నారు. చిత్తూరు , పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరు కరువుకు నిలయం. పంటల సాగుకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి పల్లెల్లో తాగునీటికి ఇబ్బందులే. ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్, దుర్గమ్మ చెరువు నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదులు ప్రవహించినపుడు 200 నుంచి 250 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ పనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ ప్రాంతవాసులకు శాపంలా మారింది. ఆగిన గంగనశిరస్సు పనులు.. కౌండిన్యా నది పలమనేరు మీదుగా తమిళనాడులోకి పయనిస్తోంది. వైఎస్ హయాంలో దీనిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద రూ.55 కోట్లతో వైఎస్ఆర్ జలాశయం ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. దీనికి అనుసంధానంగా చేపట్టాల్సిన గంగన శిరస్సు ప్రాజెక్టు పనులు అటవీ శాఖ అభ్యంతరాలతో పెండింగ్ పడ్డాయి. గతేడాది ఇక్కడికి వచ్చిన ప్రజారోగ్య శాఖ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు రూ.25కోట్లతో పనులకు రివైజ్డ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులందక పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు సైతం ఇంకా నష్టపరిహారమందలేదు. కైగల్ ఎత్తిపోతలు ఉత్తికోతలే.. బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నది కర్ణాటకలోని ముళబాగల్ సమీపంలో గల కురుడుమళై ప్రాంతంలో పుట్టి బైరెడ్డిపల్లె మండలం మీదుగా తమిళనాడు సరిహద్దు నుంచి కౌండిన్యా నదిలో కలుస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ నది ప్రవహిస్తోంది. గతంలో ఈ నదిపై కైగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసింది. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టు వెంటనే ప్రారంభిస్తామన్న మంత్రి అమరనాథరెడ్డి మాటలు నీటి మూటలయ్యాయి. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామంటూ మళ్లీ అదే మాటలు చెప్పి వెళ్లారు. ఈ నదిపై ప్రాజెక్టును నిర్మించి ఆ నీటిని బైరెడ్డిపల్లి చెరువులకు అనుసంధానం చేసుంటే ఆ మండలం మొత్తం సస్యశ్యామలమయ్యేది. దుర్గమ్మ బాధ ఇదే.... వీకోట మండలంలోని దుర్గమ్మ చెరువు వద్ద పుట్టే దుర్గమ్మ చెరువు నది నీరు సైతం తమిళనాడుకు చేరుతోంది. ఈ మండలంలోని అటవీ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మిస్తామని గతంలో వీకోటకు విచ్చేసిన చంద్రబాబు మాటనిచ్చినా ఈ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఏటా ఇక్కడి నీళ్లు సముద్రంపాలు నియోజకవర్గంలోని కైగల్, దుర్గమ్మ చెరువు నదులు బత్తలపల్లి మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్యనదిలో మోర్ధనవద్ద కలుస్తుంది. అక్కడి నుంచి కౌండిన్య తమిళనాడులోని గుడియాత్తం, వేలూరు మీదుగా పొన్ని నదిలో కలసి బంగాళాఖాతంలోకి ఏటా వర్షాకాలంలో సుమారు 120 ఎంసీఎఫ్‌టీల నీరు ప్రవహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తాగునీటి కోసమని మోర్ధనవద్ద ప్రాజెక్టును కట్టింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి వెళ్లే నీరు మోర్ధనకు చేరి అక్కడి వారికి ఉపయోగంగా మారింది. ఇదే పని మన పాలకులు, పాలితులు స్థానికంగా ఎందుకు చేపట్టలేదని జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి అనుకుని ఉంటే ప్రాజెక్టు జరగదా.. మంత్రి అనుకుని ఉంటే గంగనశిస్సు ప్రాజెక్టు ఎప్పుడో జరిగేది. ఇది పూర్తయి ఉంటే పలమనేరులో తాగునీటికి సమస్య లేకుండా ఉండేది. మా గ్రామాలకు సాగునీటి బాధలు తప్పేవి. ఏమి చేద్దాం ఈ ప్రభుత్వాలు ఇలా ఉంటే రైతులు ఎలా బాగుపడేది. –బాలాజీనాయుడు, మండిపేటకోటూరు, పలమనేరు మండలం కైగల్ ఎత్తిపోతలు ఉట్టిమాటలే.. మంత్రి అమరనాథరెడ్డి ముడేళ్లుగా కైగల్నదిపై ప్రాజెక్టు కడతామని ఇప్పటికీ హామీలు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా కైగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉంటారు. అదిగో అంచనాలు ఇదిగో పనులు అని ఉట్టిమాటలు చెప్పారేగానే ఇక్కడ చేసిందేమీలేదు. – మొగసాల కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి భూమి తీసుకుని ఎక్కడా లేకుండా చేశారు... గంగనశిరస్సు ప్రాజెక్టు కోసమని నా భూమిని తీసుకున్నారు. దానికి ఇంతవరకు పరిహారం కూడా ఇవ్వలేదు. ఉన్న భూమిని పోగొట్టుకుని జీవనధారం లేకుండా పోయింది. పోనీ ప్రాజెక్టు అయినా నిర్మించారా అంటే అదీలేదు. ఇట్టా చేస్తే జనం ఎలా నమ్మేది.– వనజమ్మ, మండిపేటకోటూరు ప్రాజెక్టు కట్టుంటే బోర్లలో నీళ్లు వచ్చేవి.. గంగనశిరస్సు ప్రాజెక్టును కట్టుంటే పట్టణానికి మంచినీటి సమస్య తీరిండేది. మాకు ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి బోర్లవద్ద సేద్యాలు చేసుకునేవాళ్లం. ఇక్కడికి సమీపంలో తమిళనాడు వాళ్లు కట్టిన మోర్ధనలో నీళ్లున్నాయి. మన దౌర్భాగ్యం మనకు లేవే.–మురుగన్, చెత్తపెంట, పలమనేరు మండలం -
పర్చూరు పీఠం ఎవరిదో?
2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. ప్రధాన పోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే సాగుతోంది. సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ బరిలో ఈసారి 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అన్ని ప్రధానపార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. దీంతో 2019లో పర్చూరులో బహుముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్ని ఓట్లు చీలుస్తారు.. ఏ పార్టీకి వారి వల్ల నష్టం వాటిల్లుతుందనే విశ్లేషణ జోరుగా సాగుతోంది. జనసేనతో మేలు ఎవరికి? 2014 ఎన్నికల్లో కూడా అధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 రాజకీయపార్టీల అభ్యర్థులు, 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో తేలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోరు సాగింది. అయితే అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టిపాటి భరత్కన్నా, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 10775 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపులో జనసేన ప్రభావం అధికంగా కనిపించింది. అయితే ప్రస్తుత 2019 ఎన్నికల్లో జనసేన కూటమిగా ఏర్పడి పర్చూరు సీటును బీఎస్పీకి కేటాయించింది. గతానికి భిన్నంగా ఈ సారి పోటీ పర్చూరు అసెంబ్లీలో ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూటమి తరపున బీఎస్పీ పోటీ పడుతున్నాయి. పరాజయం ఎరుగుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈసారి వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో నిలిచారు. గతంలో టీడీపీ విజయానికి ఉతం ఇచ్చిన పవన్ కల్యాణ్ అభిమానుల ఓట్లు ఈసారి బీఎస్పీకి పడనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీకి గడ్డుపరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ అసమ్మతి నాయకులు, ప్రభుత్వ వ్యతిరేఖత, దళితుల భూములను నీరు–చెట్టు పేరుతో తవ్వి టీడీపీ నాయకులు కోట్ల రూపాయిలు దోచుకోవడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వంటి పథకాలు తమకు లాభం చేకూరుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు చెప్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల ప్రభావం స్వల్పంగానే ఉంది. టీడీపీ గెలుపును దెబ్బతీసిన ప్రజారాజ్యం 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన సందు పూర్ణాచంద్రరావు 19056 ఓట్లు పొంది, తేలుగుదేశం పార్టీ గెలుపుపై తీవ్రప్రభావం చూపారు. దాంతో అప్పుడు కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసయ్యపై 2960 ఓట్లమెజారిటీతో విజయం సాధించారు. ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ వరకు పర్వాలేదనిపించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆర్భాటాలకు పోకుండా ప్రతి గ్రామానికి వెళుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారని, పాత పరిచయాలతో బంధుత్వం కలిపి చొరవగా వారి వద్దకు వెళుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికలను ఏలూరి ఒంటరిగానే ఎదుర్కొక తప్పడం లేదు. చెప్పుకోదగ్గ ద్వితీయశ్రేణి నాయకుడు ఎవరూ ఆయనకు సాయపడలేకపోతున్నారని ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది. దగ్గుబాటికి మాత్రం గొట్టిపాటి భరత్, వెంకటేశ్వరరావు తనయుడు యువకుడైన హితేష్చెంచురామ్లు తోడుగా నిలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ ముగ్గురు మొనగాళ్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!
సాక్షి, శ్రీకాకుళం: పురాతన నగరం. రెండు నదుల మధ్యన ఒద్దికగా ఒదిగిన పట్టణం. రాజకీయంగా మహామహులను అందించిన నేల. అన్నింటికీ మించి జిల్లా కేంద్రం. వెరసి శ్రీకాకుళం. సిక్కోలు ఇప్పుడు మరో రసవత్తర పోరు చూడబోతోంది. ధర్మాన, గుండ కుటుంబాల మధ్య ఎన్నికల పోరు రసకందాయంలో ఉంది. అభ్యర్థులు బలమైన నేపథ్యాలు కలిగిన వారు కావడం. వారి జీవితాలు జనాలకు తెరిచిన పుస్తకాలు కావడంతో అందరి చూపు ఇటువైపే ఉంది. ఐదేళ్లుగా ధర్మాన జనం ఇబ్బంది పడిన ప్రతి సమస్యపై పోరాడారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపారు. అదే సమయంలో కొత్త అభివృద్ధి పనులేవీ చేయలేదనే అపవాదును గుండ లక్ష్మీదేవి మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జన తీర్మానం ఎలా ఉంటుందో చూడాలి. 1952 నుంచి.. స్వాతంత్య్రం తర్వాతి నుంచి శ్రీకాకుళం రాజకీయంగా కీలకంగానే ఉంది. మొదట్లో ఇక్కడ ద్విసభ్య శాసన సభ్యత్వం ఉండేది. కావాలి నారాయణ మొదటి ఎమ్మెల్యే కాగా ద్విసభ్య శాసన సభ కావడంతో కేఏ నాయుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ స్థానం మొదటిలో కాంగ్రెస్‌కు అస్సలు కలిసిరాలేదు. ఒక్క వైఎస్సార్‌పై మాత్రమే ఇక్కడి జనం ప్రేమ చూపించారు. 1952 నుంచి 1962 మినహా 2004 వరకు దాదాపు అన్నిసార్లు కాంగ్రెస్సేతర అభ్యర్థులే గెలవగా.. ధర్మాన ప్రసాదరావు ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి 2004లో విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. 2014లో మాత్రం ఓటమి చవి చూశారు. పదవిలో ఉన్నంత కాలం మాత్రం మర్చిపోలేని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని స్థానిక ప్రజలు చెబుతుంటారు. తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ ♦ శ్రీకాకుళం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ గెలుపొందారు. ♦ అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గం కావడంతో రెండో నియోజకవర్గం నుంచి కేఏ నాయుడు గెలుపొందారు. ♦ అప్పట్లో వీరిద్దరూ కేఎల్పీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. ♦ 1955లో పి.సూర్యనారాయణ, 1962లో ఎ.తవిటయ్య, 1967లో తంగి సత్యనారాయణ, 1972, 1978లలో చల్లా లక్ష్మీనారాయణ, 1983లో తంగి సత్యనారాయణ, 1985, 1989, 1994, 1999 లలో గుండ అప్పల సూర్యనారాయణ విజయం సాధించారు. ♦ 2004, 2009లలో ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ♦ 2014లో గుండ లక్ష్మీదేవి శాసనసభ్యురాలిగా ఎంపికై ప్రస్తుతం కొనసాగుతున్నారు. వైఎస్సార్ గుర్తులు.. వైఎస్సార్, ధర్మాన కాంబినేషన్ అంటేనే అభివృద్ధికి మారుపేరు. శ్రీకాకుళంలో జరిగిన పనులే అందుకు నిదర్శనం. జిల్లాకు వంశధార, రిమ్స్ వైద్య కళాశాల, నాగావళి నదికి కరకట్టలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మంజూరయ్యాయి. శ్రీకాకుళం నగరం విషయానికి వస్తే రక్షిత మంచినీటి పథకం, నాగావళిపై మూడు వంతెనలు, కలెక్టర్ కార్యాలయానికి నూతన భవనాలు, ప్రధాన రోడ్ల విస్తరణ, అరసవల్లి సమీపంలో అధునాతన ఆడిటోరియం, 80 అడుగుల రోడ్డు వారి హయాంలో జరిగినవే. శ్రీకాకుళం మునిసిపాలిటీ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందేందుకు అప్పట్లోనే బీజం పడింది. వేలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పేదలకు ఫించన్లు, రేషన్ కార్డులు, అడిగిందే తడవుగా మంజూరు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో పరిశ్రమల ఏర్పాటు కూడా అప్పట్లోనే జరిగాయి. మండలాల్లోని ప్రతి గ్రామానికి రోడ్లు, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. చేనేత కార్మికులకు చేయూత లభించింది. ఇలా నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేసి సువర్ణ యుగం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఓటర్ల వివరాలు.. మొత్తం ఓటర్లు : 2,32,456 పురుషులు : 1,15,959 స్త్రీలు: 1,16,453 ఇతరులు : 44 ప్రధాన సమస్యలు.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కట గుండ అప్పలసూర్యనారాయణ భార్య గుండ లక్ష్మీదేవి పోటీ చేశారు. ఐదేళ్లు గడిచాక తాము ఫలానా పనిచేశాం అని చెప్పుకోవడానికి కూడా ఆమె ఏమీ చేయలేదని స్థానికులు అంటున్నారు. ధర్మాన హయాంలో జరిగిన పనులను తమవిగా చెప్పుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గుండ కుటుంబం నుంచి అప్పలసూర్యనారాయణ నాలుగు పర్యాయాలు, లక్ష్మిదేవి ఒకసారి విజయం సాధించినా ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, రింగ్ రోడ్డు హామీలు అలాగే ఉండిపోయాయి. వీటికి కనీసం భూ సేకరణ కూడా చేయలేదు. ఇక స్మార్ట్‌సిటీ, అమృత్ పథకాలు ద్వారా జరుగుతున్న పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. వీటిని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ అభ్యర్థి ప్రయత్నం చేస్తున్నారు. టికెట్.. టికెట్ వజ్రపుకొత్తూరు: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు ఊర్లకు రావడానికి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి ఇదే విషయంపై పది మందితో కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. వలస ఓటర్లు అత్యధికంగా ఉన్న వజ్రపుకొత్తూరు, మందస గిరిజన ప్రాంతాలతో పాటు మత్స్యకార ప్రాంతంలోని ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బస్సు కూడా దూరమైతే ట్రైన్ రిజర్వేషన్ చేయించడానికి కూడా వెనుకాడడం లేదు. అసలు ఈ ప్రాంతాల్లో యువకులు వలస వెళ్లిపోయిందే స్థానికంగా ఉపాధి కల్పించకపోవడం వల్ల.. ఆ మాట మర్చిపోయి వలస వెళ్లిన వారిని ఓటు కోసం తిరిగి రప్పిస్తున్నారు. నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు, అక్కుపల్లి, మెట్టూరు, డోకులపాడు, కంబాలరాయుడుపేట, దేవునల్తాడ, కొత్తపేట, మందస గిరిజన ప్రాంతంలోని వందలాది కుటుంబాలు స్థానికంగా బతుకు లేక పొట్టకూటి కోసం వలస వెళ్లాయి. వారి కోసం ఏనాడూ ఆలోచించని నేతలు ఓట్లు అనగానే బస్సు టికెట్లు ఇచ్చి మరీ రప్పిస్తుండడంతో స్థానికులకు నవ్వు తెప్పిస్తోంది. కోడ్ కూసి 20 రోజులవుతున్నా.. కొత్తూరుమండలం మెట్టూరు బిట్2 పునరావాస కాలనీలో ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాల రెపరెపలు ఎల్.ఎన్.పేట: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 20 రోజులు దాటిపోతోంది. మరో పది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అయినా అధికారులు అధికార పార్టీ జెండాలను తీయించడంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. పాతపట్నం నియోజక వర్గం కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్2 పునరావాస కాలనీలో అన్ని వీధుల్లోను సీసీ రోడ్లకు పక్కన మొక్కలు నాటారు. మొక్కల సంవరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శిలాఫలకాలను సైతం కప్పలేదు. -
ఒం‘గోలు’ కొట్టేవారెవరో ?
సాక్షి, ఒంగోలు : ఇదరూ ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర తిరగ రాయడంతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి«గా బరిలో ఉండగా..గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోసారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అజాతశత్రువు, మంచి వ్యక్తిగా గుర్తింపుపొందిన బాలినేని విజయమే లక్ష్యంగా గడప గడపకు వెళ్తున్నారు. నవరత్నాలను వివరించి వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత ప్రయోజనాల కోసమే ఐదేళ్లు పాకులాడిన జనార్దన్‌కు ఇంటి పోరు తప్పడం లేదు. మురికి వాడలను పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బాలినేనికే విజయావకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలుత ద్విసభ్యుల నియామకం ఉండేది. ఈ నియోజకవర్గానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. 1952, 1955లో ద్విసభ్యుల నియామకం జరిగింది. 1957 నుంచి అసెంబ్లీకి ఒకే అభ్యర్థి ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో కొంతభాగం, నాగులుప్పలపాడు మండలంలోని కొంత భాగం ఉండేవి. 2009 పునర్విభజన సమయంలో ఒంగోలు నగరం, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలం మొత్తం కలిపి నియోజకవర్గంగా అవతరించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. తొలుత 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావ్పై తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2004 , 2009, 2012లలో వరుసగా విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌రావుపై ఏకంగా 27,403 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. భళా..బాలినేని సౌమ్యుడు, మంచి వ్యక్తిగా పేరుపొందారు. ఎవ్వరైనా సరే నేరుగా ఆయన వద్దకే వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. నమ్మినవారి కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేశారు. జిల్లాలోని పేదలకు వైద్యం అందించేందుకు రిమ్స్ వైద్యశాలను మంజూరు చేయించి నిర్మించారు. వేలాది మంది పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు నివాస గృహాలను నిర్మించి ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, మంత్రిగా పనిచేసినా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ప్రజల గుర్తింపు పొందారు. జనం వద్దకు వెళ్లని జనార్దన్ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల జనార్దన్‌రావు గెలిచిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయనే భావన ప్రజానీకంలో వ్యక్తం అవుతుంది. కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారన్న విమర్శలూ వచ్చాయి. కొందరు అనుచరులకే కాంట్రాక్టు పనులు కట్టబెట్టడంతో మిగిలిన టీడీపీ కేడర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారింది. నగరంలో కొన్ని ప్రధాన ప్రాంతాలకే రోడ్డు, డ్రైనేజీలాంటి పనులు మంజూరు చేయించి అధికంగా ఉన్న మురికి వాడలను పట్టించుకోదు. మురికి వాడల్లో వసతుల కల్పన గాలికొదిలేశారు. రోడ్లు, తాగునీరు అందని పరిస్థితి. కక్ష సాధింపుకు దిగే వ్యక్తిగా జనార్దన్‌కు పేరుంది. ఇటీవల కమ్మపాలెంలో జరిగిన ఘటనతో గొడవలు సృష్టించే సంస్కృతి ఉన్న నాయకుడుగా నిలిచారు. ఈ పరిస్థితులలో స్థానికేతరుడు అయిన జనార్దన్ ఓ వైపు, నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్న బాలినేని మరో వైపు పోటీలో ఉన్నారు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,29,317 పురుషులు : 1,11,183 మహిళలు : 1,18,101 ఇతరులు : 33 -
బరిలో బంధుగణం!
సాక్షి, శ్రీకాకుళం: ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఇవి ఓటర్లలో ఆసక్తిని రేపుతున్నాయి. సమీప బంధువులు, రక్త సంబంధీకులు వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆమదాలవలస నుంచి వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయనపై టీడీపీ అభ్యర్థిగా ఆయన బావమరిది (భార్య సోదరుడు) కూన రవికుమార్ తలపడుతున్నారు. టీడీపీ తరఫున శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఆయన బాబాయ్ (తండ్రికి సొంత సోదరుడు) కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు. అలాగే రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కంబాల జోగులు బరిలో ఉండగా ఆయన బాబాయ్ (తండ్రి సోదరుడి) కుమారుడు కంబాల రాజవర్థన్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. విశేషమేమిటంటే వీరిలో రాజాం నుంచి బరిలో ఉన్న కంబాల జోగులు, రాజవర్థన్ (ఈయన తొలిసారిగా పోటీలో ఉన్నారు)లు మినహా మిగిలిన వారంతా 2014 సార్వత్రిక ఎన్నికలోనూ అవే స్థానాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ చుట్టాలు, బంధువులను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయా అభ్యర్థుల బంధుత్వాల గురించి ఆయా నియోజకవర్గాల ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
తాడికొండలో పాగా ఎవరిదో..?
సాక్షి,గుంటూరు : ఎందరో ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ అధికారులు, వైద్యులు, విద్యావేత్తలను సమాజానికి అందించిన చదువుల కర్మాగారం తాడికొండ గురుకుల పాఠశాల.. ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన పుణ్యభూమి ఫిరంగిపురం.. చిరుధాన్యాల పరిశోధన కేంద్రంగా ఏర్పాటై ఎన్జీరంగా విశ్వవిద్యాలయంగా అవతరించిన లాంఫాం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నియోజకవర్గం తాడికొండ. ఇది తొలి నుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా జిల్లాలో పేరు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేది. రాష్ట్ర విభజనానంతరం కూడా ఈ సెంటిమెంటే కొనసాగింది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ప్రసిద్ధ ఆలయంగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ప్రధాన చర్చిగా కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు జరుపుకొనే ఎత్తయిన చర్చిగా ప్రత్యేకతను సంతరించు కొని ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన ఫిరంగిపురం తాడికొండ నియోజకవర్గంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. బాల ఏసు కొలువైన ఫిరంగిపురం కథెడ్రల్ దేవాలయానికి 125 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది. చదువులమ్మ నిలయం తాడికొండ గురుకులం 1970వ దశకంలో తాడికొండలో ప్రారంభమైన బేసిక్ ట్రైనింగ్ స్కూల్ కాలగమనంలో గురుకుల పాఠశాలగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఏడు జిల్లాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులు ఇక్కడ చదువుకునేవారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులకు నిలయంగా మారిన తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్న వారిలో ఐఏఎస్ అధికారులు కాంతీలాల్ దండే, ధర్మారావు, పార్వతీపురం ఎంపీగా సేవలు అందించిన డి.వి.జి.శంకరరావు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మండవ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. వ్యవసాయ క్షేత్రం లాంఫాం తాడికొండ మండలం లాం గ్రామంలో 1942లో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ప్రైవేటు గృహంలో కొనసాగింది. తదనంతర కాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెందింది. అపరాల పరిశోధనతో పాటు పత్తి, ఉద్యాన పరిశోధనా స్థానాలు ఇక్కడ రైతులకు ఎన్నో సేవలు అందించాయి. రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయ విశ్వ విద్యాలయంగా లాం పరిశోధనా స్థానాన్ని ప్రకటించడంతో రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ఇక్కడ ఏర్పాటు చేసిన పశు పరిశోధనా కేంద్రంలో బ్రీడ్ ఉత్పత్తి జరుగుతోంది. తొలినుంచి సెంటిమెంట్‌కే పట్టం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజధాని నియోజకవర్గమైన తాడికొండ ఉత్కంఠ రేపుతోంది. తొలినుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా పేరొందిన తాడికొండలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో అదేపార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రలో కూడా పునరావృతం అయింది. 1972 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న తాడికొండ 1978 ఎన్నికలకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. అమలుకాని ప్రభుత్వ హామీలు జ కొండవీటి వాగు ముంపు నుంచి పంటలను కాపాడేందుకు వాగు పూడికతీత పనులు చేపడ్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు. జ తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురంతో పాటు రాజధాని పూలింగ్‌లోకి తీసుకున్న గ్రామాల్లో సైతం ఎన్నికల్లో హామీ ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారానికి నోచలేదు. వేసవి కాలం వస్తే పలు గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వం విఫలమైంది ఇలా... నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరుచేయలేదు. పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు అధికారుల అండదండలతో స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులకు కూడా పింఛన్లు మంజూరవక వృద్ధులు వికలాంగులు, వితంతువులు ఇబ్బందిపడ్డారు. నీరు– చెట్టు పేరుతో టీడీపీ నాయకులు గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి, ఇసుక దోచేశారు. వాటాల పంపకంలో తేడాలు రావడంతో రోడ్డున పడి తిట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. వివిధ కార్పొరేషన్ల రుణాలు అనర్హులకు అందాయి. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అనుయాయులకే కట్టబెట్టి రైతులను విస్మరించారు. రాయితీ ఎరువులు, విత్తనాల సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు టీడీపీ అంటేనే మండిపడుతున్నారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలు మండలం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు తాడికొండ 53,241 27,253 25,985 తుళ్ళూరు 45,368 21,855 23,513 మేడికొండూరు 44,681 22,155 22,522 ఫిరంగిపురం 50,068 24,744 25,324 వైఎస్సార్ కాంగ్రెస్‌వైపే ఓటర్ల మొగ్గు రాజధాని అమరావతి పేరిట భూ సమీకరణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు ఐదేళ్లుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష పనితీరు, అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. తొలి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది. నేడు కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగరేయడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి స్థానికురాలు కావడం, ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావుకు స్థానికంగా గట్టి పట్టు ఉండటంతో ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హవా చాటిన స్థానికేతరులు తాడికొండ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పురుషులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా కత్తెర హెనీక్రిస్టినాకు అవకాశం ఇచ్చింది. అయితే ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ పార్టీ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని మరోసారి అభ్యర్థిగా బరిలో నిలిపింది. జనరల్ కేటగిరీలో ఉండగా గద్దె రత్తయ్య తుళ్లూరు మండలం మల్కాపురం నుంచి గెలుపొందగా తదనంతరం స్థానికేతరులే ఎక్కువసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో తాడికొండ గ్రామానికి చెందిన ఆడపడుచు ఉండవల్లి శ్రీదేవికి తాడికొండ ప్రజల ఆశీస్సులు మెండుగా లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. -
ఆదోని పై పట్టెవరిది !
సాక్షి, అమరావతి : పూర్వం దక్షిణాది ధాన్యం మార్కెట్‌గా వెలుగొంది.. ఇప్పుడు దుస్తులు, బంగారం మార్కెట్‌కు కేంద్రంగా విరాజిల్లుతున్న ఆదోనికి ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. రెండో ముంబైగా వినుతికెక్కిన ఈ ప్రాంతం 16వ శతాబ్దములో యాదవుల పాలనలో ఉండేది. అప్పుట్లో దీనిపేరు యాదవగిరి. ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో భాగంగా ఉండేది. 1952లో ఏర్పడిన ఆదోని నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఒకసారి వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ), కొంకా మీనాక్షినాయుడు (టీడీపీ) తలపడుతున్నారు. ఇక్కడి ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిస్తూ ప్రతి ఎన్నికలోనూ ఆసక్తి గొలుపుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. తమకు నచ్చిన, ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉండే అభ్యర్థికే ఓట్లు వేసి ఎమ్మెల్యే గిరీని కట్టబెడుతుంటారు. ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు కాలాలపాటు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పనీ చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో పలు శాశ్వత పథకాలు ఆవిష్కారమయ్యాయి. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారనే విశ్వాసం ఓటర్లలో ఉంది. దీంతో ఈసారి ఎన్నికలో సాయిప్రసాద్‌రెడ్డి విజయం నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సైకిల్‌కు ఎదురు గాలి.. టీడీపీ అభ్యర్థి మీనాక్షినాయుడుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదోనికి పూర్వ వైభవాన్ని తెస్తామని చెప్పారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మండగిరి నీటి పథకాల నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్రంలో అత్యంత పురాతనమైన మున్సిపాల్టీల్లో ఒకటైన ఆదోనిలో ఆక్రమణలతో రోడ్లు కుంచించుకుపోయాయి. రోజు, రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. రోడ్లు విస్తరణ చేపడతామని, వైఎస్ఆర్ హయాంలో మంజూరు అయి, మూడింట ఒకవంతు మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 8 గ్రామాలకు మాత్రం సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 32 గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాలువను విస్తరించి తమ గ్రామాలకు కూడా సాగునీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఆ దిశగా ప్రతిపాదనలు ఏవీ లేవు. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. ఎన్నో పథకాలు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి పలు శాశ్వత పథకాలు తెచ్చారు. ఆదోని పట్టణంలో రూ.32 కోట్లతో తాగునీటి పథకం మంజూరు చేయించారు. కుప్పగల్లు వద్ద రూ.8 కోట్లతో రెండు నీటి పథకాలు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పట్టణానికి బైపాస్ రోడ్డు, విక్టోరియా పేట, ఇస్వి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. మున్సిపాల్టీలో 23 మంది కౌన్సిలర్లు, రూరల్‌లో 28 మంది తాజా మాజీ సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలతో పాటు పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
పలాస ఎవరికి దక్కునో...?
దశాబ్దాలుగా వస్తున్న కుటుంబ రాజకీయ పాలన పలాస నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. 2009 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న గౌతు శ్యామ సుందర శివాజీ.. ఈ సారి తన వారసురాలిగా కుమార్తె శిరీషను ఎన్నికల బరిలో దింపారు. సామాన్య కుటుంబానికి చెందిన వైద్యుడిపై పోటీ పడుతున్న కుటుంబ పాలనకు మరోసారి చెక్ పడక తప్పదన్న అభిప్రాయాలు నియోజక వర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సాక్షి, కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో ఎప్పటినుంచో మార్పును కోరుకుంటున్న ప్రజలు 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తిరిగి ఇప్పుడు అధికార పార్టీని, గౌతు కుటుంబాన్ని ఎదిరించి ప్రజాసమస్యలపై నిలబడే నవయువకుడు, వైద్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పలాస నియోజకవర్గ తీరు తెన్నులపై సాక్షి ప్రత్యేక కథనం. నియోజకవర్గం పుట్టుక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009వ సంవత్సరంలో పలాస నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నప్పటికీ కాశీబుగ్గ పట్టణం, వజ్రపుకొత్తూరు మండలం, టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. పలాస పట్టణం, మందస మండలం సోంపేట నియోజకవర్గంలో ఉండేవి. జీడిపరిశ్రమలు, కార్మికులు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అభివృద్ధి చెందడంతో రెండు పట్టణాలు జిల్లా కేంద్రంతో పోటీ పడుతున్న సమయంలో పలాస నూతన నియోజకవర్గంగా మారింది. మొదటి ఎమ్మెల్యేగా జుత్తు జగన్నాయకులు 2009 ఎన్నికల్లో గౌతు శ్యాంసుందర శివాజీపై గెలుపొందారు. అనంతరం వజ్జ బాబూరావుపై 2014లో శివాజీ గెలుపొందారు. ప్రస్తుతం వజ్జబాబూరావు తన అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి శివాజీ పంచనే చేరారు. ఇప్పుడు శివాజీకి వయసు మీదపడడంతో తన తండ్రి నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవిని మనుమరాలు శిరీషకు అప్పగించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రత్యేకత ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పలాసకు టూరిస్టు శాఖ ‘వైట్ గోల్డ్’ సిటీగా నామకరణం పేరుపెట్టింది. పలాస నియోజకవర్గంలో సుమారు 45 కిలోమీటర్లుగల జాతీయ రహదారి, పలాస వంటి పెద్ద రైల్వేస్టేషన్‌తో పాటు పూండి, మందస, సున్నాదేవి వంటి స్టేషన్లతో రైలుమార్గం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం సముద్ర తీర ప్రాంతంలో టూరిజంతో పాటు, 32వేల మందికి పైగా మత్స్యకారులకు జీవనాధారమైన చేపలవేటకు అవకాశం ఉంది. మందస మండలంలో అతి ఎత్తైన మహేంద్రగిరి పర్వతాలు ఉన్నాయి. 26 వేల మందికి పైగా గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పలాసతో పాటు మూడు మండలాలను కలుపుకుని ఉద్దాన ప్రాంతం ఉంది. కొబ్బరి, జీడిమామిడి, మునగ, దుంపలు, మామిడి, ఇలా ఉద్యానపంటలు ఇక్కడ అనేకం. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20 వేలమంది పైగా వలస వచ్చి స్థిరపడిన జీడికార్మికులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 300కుపైగా జీడి పరిశ్రమలు నియోజకవర్గంలో విరాజిల్లుతున్నాయి. మామ పాలనలో అల్లుడి హవా నియోజకవర్గంలో గౌతు శ్యాంసుందర శివాజీ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాలన కొనసాగించినప్పటికీ ఆయన అల్లుడి హవా ఎక్కువైంది. మామ ఎమ్మెల్యే అయినా ఎవరి పనులనైనా అల్లుడు గారే చేసి పెడతారు. జీడి, రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు అల్లుడికి కమీషన్ లేనిదే పనులు పూర్తికావు. అనేక మంది వీరిద్దరి పరిస్థితిని గమనిస్తున్నారు. నేరస్తులను వెంట వేసుకుని మూడు మండలాల పరిధిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఆఫ్‌షోర్ నిర్మాణానికి ఎమ్మెల్యేకు ఉన్న పెట్రోల్ బంకు నుంచి డీజిల్ కొనుగోలు చేయాలని అల్లుడు ఒప్పందాలు చేయించుకున్నాడు. అల్లుడి పోరు ఇంతంత కాదయా అంటూ పరిసర ప్రాంతాల్లో కోడై కూస్తున్నారు. తిత్లీ పరిహారం దోపిడీ తిత్లీ తుఫాన్ అధికార జన్మభూమి కమిటీలకు అక్కరకు వచ్చింది. గత ఏడాది అక్టోబరు 11న సంభవించిన తుఫాన్లో నష్టపోయిన వారిలో.. జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన వారికి మాత్రమే పరిహారం అందింది. నిజమైన లబ్ధిదారులకు అందకపోవడంతో అవేదన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావతో ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలైన అనేక మందికి పరిహారం అందివ్వకపోవడంతో వారంతా అనాథలుగా మిగిలారు. పలాస నియోజకవర్గంలో 60 ఏళ్ల గౌతు కుటుంబ పాలన కంటే పదేళ్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే అభివృద్ధి చెందిందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. నియోజకవర్గంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసి రూ.127కోట్లతో 26వేల హెక్టార్లకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. అనంతరం వచ్చిన ప్రçభుత్వాలు చేయలేకపోయాయి. ముఖ్యంగా పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ, మున్సిపల్ కార్యాలయం నిర్మాణం, బెండిగేటు, నువ్వలరేవు, పొత్తంగా వంటి అతి పెద్ద బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యాయంటే దివంగత వైఎస్ చలవేనని నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు. మున్సిపాలిటీకి తాగునీరు, ఈ ప్రాంతంలో ఉన్న బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చడం, ఇతర కూలాల వర్గీకరణ వైఎస్ హయాంలోనే జరిగింది. అలాగే మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలలో మరదరాజపురం, బెండి వంతెనలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాలను వైఎస్ పాలనా కాలంలోనే అధికంగా చేశారు. పరిష్కారం కాని సమస్యలు ఉద్దానంలో ఉన్న 7మండలాల్లో కిడ్నీ మహమ్మరి బారిన పడిన మూడు మండలాలు పలాస నియోజకవర్గంలో ఉండడం దురదృష్టకరం. ప్రతి వారం కనీసం ఇద్దరు వ్యక్తులు కిడ్నీ సమస్యతో మరణిస్తున్నారు. వేలాది మంది కిడ్నీ రోగులు ఉండగా కేవలం 223మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి డయాలసిస్ కేంద్రం పెట్టి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పలాస ప్రభుత్వ ఆస్పత్రిని 200 పడకలకు విస్తరించలేక విడిచి పెట్టేశారు. ఆస్పత్రిలోని మేల్వార్డునే డయాలసిస్ సెంటర్‌గా మార్చివేశారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలను స్థానిక అధికార పార్టీ నేతలు చేతులారా వదులుకున్నారు. కాశీబుగ్గ వంతెన పూర్తి చేయలేక చేతులెత్తేశారు. హుద్‌హుద్ ఇళ్లు, ఏహెచ్‌పీ ఇళ్ల పంపిణీ చేయలేక విడిచిపెట్టేశారు. జంట పట్టణాలకు తాగునీరు, వజ్రపుకొత్తూరు మండలానికి వంశధార నీరు అందించలేకపోయారు. మొత్తం ఓటర్లు : 1,91,562 పురుషులు : 94827 ్రïస్తీలు : 96699 ఇతరులు : 36 మండలాలు: మందస, పలాస, వజ్రపుకొత్తూరు మున్సిపాలిటీ : పలాస–కాశీబుగ్గ పోలింగ్ కేంద్రాలు : 278 సమస్యాత్మక కేంద్రాలు : 37 -
అచ్చెన్నకు ముచ్చెమటలు
సాక్షి, టెక్కలి: రాజకీయాలకు కేంద్ర బిందువైన టెక్కలి నియోజకవర్గంలో ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుస్తారనేదానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. 1952లో 61,196 మంది ఓటర్లతో ప్రారంభమైన నియోజకవర్గం ప్రస్థానం నేడు 2,22,222 మంది ఓటర్లకు చేరుకుంది. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. టీడీపీ తరఫున మంత్రి హోదా అనుభవించిన కింజరాపు అచ్చెన్నాయుడు.. సామాన్య స్థాయి నుంచి ప్రజా పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. కొండలాంటి అచ్చెన్నాయుడిని ఢీకొట్టడమే కాకుండా వైఎస్సార్ సీపీ విజయాన్ని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామంటూ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్‌తో పాటు నాలుగు మండలాల నాయకులు అహర్నిశలు శ్రమిస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందజేస్తుందనే ధీమాతో అచ్చెన్నాయుడు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మార్పు తప్పదా..! టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా, మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు అండతో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలతో ప్రజలు విస్తుపోయారు. రేషన్ కార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలు ఒకటేమిటి ప్రతి పథకంలో వివక్ష చూపడంతో, అర్హులకు పథకాలు అందని ద్రాక్షగా మారాయి. రేషన్ డీలర్లపై, చిన్న స్థాయి ఉద్యోగులపై వేధింపులు, బెదిరింపులతో అంతా విస్తుపోయారు. ఏదైనా పని కోసం మంత్రి వద్దకు వెళితే ఆయన అనుసరించిన వైఖరిపై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్న కొంత మంది కేడర్‌లో సైతం వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో సీనియర్ నాయకులు సైతం వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల విజయాన్ని తేల్చి చెప్పే ప్రధానమైన నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో ఇప్పటికే టీడీపీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అన్నదాతలకు వరం ఆఫ్‌షోర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో నందిగాం మండలంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పటి టెక్కలి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర కృషి ఫలితంగా నిర్మాణం తలపెట్టిన ఆఫ్‌షోర్‌కు సుమారు రూ.127 కోట్లు కేటాయించారు. నందిగాం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి తదితర మండలాల్లో సుమారు 24,600 ఎకరాలకు సాగునీటిని అందజేయడంతో పాటు పలాస మండలంలో 6 పంచాయతీల పరిధిలో 24 గ్రామాలకు తాగునీటిని అందజేయడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మంజూరులో భాగంగా 2008 ఏప్రిల్‌లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పలాస మండలం రేగులపాడు వద్ద భారీ స్థాయిలో శంకుస్థాపన చేశారు. పనులు ఊపందుకున్న సమయంలో వైఎస్సార్ మరణంతో ఆఫ్‌షోర్ నిర్మాణం నిలిచిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు పలుమార్లు ఆఫ్‌షోర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి వైఫల్యం చెందారు. ప్రజా పోరాటాలతో సానుకూలత టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలకు ఎదురొడ్డి ప్రజా పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు ఈసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని పటిష్టం చేయడమే కాకుండా దిగువ స్థాయి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్న తిలక్ అందరి మన్నలను పొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రతో అన్ని వర్గాల ప్రజలు అభిమానులుగా మారారు. దీంతో ఈసారి టెక్కలి నియోజకవర్గంలో తిలక్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అనుచిత వైఖరిపై విమర్శలు జన్మభూమి కమిటీల ఆగడాలు, టీడీపీ కార్యకర్తల అక్రమాలతో పాటు ఏరా...పోరా అనే మాటలతో అచ్చెన్నాయుడు వైఖరిపై ప్రజలు విస్తుపోయారు. ఈసారి మంత్రికి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రామ స్థాయిలో కక్ష పూరితమైన చర్యలపై టీడీపీ కార్యకర్తలు చెప్పిందే తడవుగా ఎటువంటి ఆలోచన చేయకుండా అచ్చెన్న చేసిన దుందుడుకు చర్యలు విజయానికి అడ్డంకులుగా మారనున్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆఫ్‌షోర్‌ను పూర్తి చేయకపోవడం, టెక్కలిలో హుదూద్ ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం, నందిగాంలో భవనాలు లేకుండా జూనియర్ కళాశాల మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చూపారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గం చరిత్ర... టెక్కలి నియోజకవర్గం 1952లో 61వేల196 మంది ఓటర్లతో ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం 2,22,222 మందికి చేరుకుంది. కళింగ, వెలమ, యాదవ, కాపు, రెడ్డి, వైశ్య, ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగిలిన చేతివృత్తులకు చెందిన సామాజిక వర్గాలు ప్రధాన ఓటర్లగా ఉన్న ఈ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు లాంటి వ్యక్తులకు సైతం పట్టం కట్టారు. 1952లో బ్రాహ్మణతర్లా నియోజకవర్గం పేరుతో ఆరంభమై 1972 వరకు కొనసాగింది. అనంతరం టెక్కలి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. మొట్టమొదటిగా టెక్కలి, నందిగాం, పలాసలో సగభాగం, వజ్రపుకొత్తూరులో సగభాగం, సంతబొమ్మాళి మండలంలో 7 పంచాయతీలతో 2008 సంవత్సరం వరకు టెక్కలి నియోజకవర్గంగా కొనసాగింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలంతో పాటు అదే మండలంలో ప్రత్యేకంగా ఉన్న హరిశ్చంద్రాపురాన్ని ఈ నియోజకవర్గంలో విలీనం చేశారు. 2009 సంవత్సరం నుంచి నాలుగు మండలాలతో టెక్కలి నియోజకవర్గంగా కొనసాగుతూ వస్తోంది. గెలుపొందిన అభ్యర్థులు వీరే.. సంవత్సరం విజేత పార్టీ 1952 రొక్కం లక్ష్మీ నరసింహదొర ఇండిపెండెంట్ 1955 ఆర్ఎల్ఎమ్ దొర కాంగ్రెస్ 1962 రోణంకి సత్యనారాయణ ఇండిపెండెంట్ 1967 నెచ్చెర్ల రాములు ఇండిపెండెంట్ 1972 సత్తారు లోకనాథంనాయుడు కాంగ్రెస్ 1978 బమ్మిడి నారాయణస్వామి జనతాపార్టీ 1983 అట్డాడ జనార్దనరావు టీడీపీ 1985 వరదా సరోజా టీడీపీ 1989 దువ్వాడ నాగావళి టీడీపీ 1994 ఎన్.టి.రామారావు టీడీపీ 1995 హనుమంతు అప్పయ్యదొర టీడీపీ 1999 కొర్ల రేవతీపతి టీడీపీ 2004 హనుమంతు అప్పయ్యదొర కాంగ్రెస్ 2009 కొర్ల రేవతీపతి కాంగ్రెస్ 2009 కొర్ల భారతి కాంగ్రెస్ 2014 కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ మొత్తం ఓటర్లు: 2,22,222 పురుషులు: 1,12,093 స్తీలు: 1,10,110 ఇతరులు: 19 మండలాలు: 4(టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం) పంచాయతీలు: 136 పోలింగ్ కేంద్రాలు: 316 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 157 -
భూస్వాముల అడ్డా..ఉరవకొండ
ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఉరవకొండ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకూ 12 సార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా నిలుస్తూ వచ్చింది. సాగునీటి వనరులు అంతంత మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గంలో ఆది నుంచి అత్యధిక జనాభా చేనేతరంగంపైనే ఆధారపడి జీవిస్తూ వచ్చింది. అణగారిన, పీడిత వర్గాలే నియోజకవర్గంలో అత్యధికులు ఉన్నారు. మొత్తం ఓటర్లు :2,07,7 పురుషులు:1,04,1 మహిళలు:1,03,5 ఇతరులు :19 పెత్తందారీ ఆధిపత్యంలో హత్యా రాజకీయాలు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడుతున్నా.. నేటికీ ఉరవకొండ నియోజకవర్గంలో భూస్వామ్య వాసనలు పోలేదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం అన్న చందంగా నేటికీ వారి వంశీకులు శాసిస్తూ వస్తున్నారు. వారిని కాదని మనుగడ సాగించడం చాలా కష్టం. నియోజకవర్గంలోని కౌకుంట్లలో భూస్వాముల ఆధిపత్యంపై కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చారిత్రాత్మకం. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కౌకుంట్లలో భూస్వాముల అరాచక పాలన పేట్రెగిపోయింది. వందలాది ఎకరాల పేదల భూములను ప్రస్తుత ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ తండ్రి పయ్యావుల వెంకటనారాయణప్ప తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించేవారు. ఇది అన్యాయమంటూ ఎవరైనా గొంతెత్తితే భరించలేనంతగా దాడులు, దౌర్జన్యాలు చేసేవారు. అదే సమయంలో వెంకటనారాయణప్ప ఆధీనంలో ఉన్న పేదల భూములను వెంటనే పేదలకు స్వాధీనం చేయాలంటూ సీపీఐ నేత రాకెట్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతంగా ఎగిసిపడ్డాయి. నారాయణరెడ్డి పోరాటాలతో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగొచ్చింది. స్వయానా కౌకుంట్ల గ్రామానికి ఎన్టీఆర్ వచ్చి భూ సమారాధన పేరుతో పయ్యావుల కుటుంబీకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న పేదల భూములను ఆ పేదలకే పంచి పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని పెత్తందారులు రాకెట్ట నారాయణరెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రారెడ్డిని అతి దారుణంగా హతమార్చి నెత్తుటి రాజకీయాలకు బీజమేశారు. చతికిల బడ్డ చేనేత పరిశ్రమ చేనేతకు ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలో చేనేత పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు గతంలో హామీనిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో నేడు ఉరవకొండలో చేనేతలు ఉనికి కోల్పోయారు. గతంలో 15 వేలకు పైగా మగ్గాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఐదు వేలకు మించి లేవు. దాదాపు మూడు వేలకు పైగా చేనేత కార్మికులు మగ్గాలు వదిలి కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నారు. ఒక్క ఎకరాకూ అందని సాగునీరు హంద్రీ–నీవా మొదటి దశ కింద నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టును గుర్తించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. ఐదేళ్లుగా కంటి ముందే నీరు పారుతున్నా.. పొలాలకు పెట్టుకోలేక రైతులు పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేనిది. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించుకుపోయేందుకు ఈ ప్రాంత రైతులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. జీడిపల్లి నిర్వాసితులకు మొండి చెయ్యి బెళుగుప్ప మండలంలో జీడిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు మరో ప్రాంతంలో పక్కా గృహాలు నిర్మించి ఇస్తామంటూ సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు పక్కా హామీనిచ్చారు. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. అయితే ముంపు గ్రామాల బాధితులను ఆదుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఈ విషయంలో సీఎంతో చర్చించి నిర్వాసితులకు న్యాయం జరిగిలే చూడడంలో ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ పూర్తిగా విఫలమయ్యారు. ఐదేళ్లలో ‘విశ్వ’ పోరాటాలు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలైన పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి సీఎం చంద్రబాబు తన కులపిచ్చిని బహిర్గతం చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని తాను ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీకి నియోజకవర్గ పాలనపరమైన పగ్గాలు అప్పగించి దోపిడీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో హంద్రీ–నీవా పనుల అంచనాలను భారీగా పెంచి రూ. కోట్లలో కేశవ్ దోచుకున్నారు. గాలిమరల కంపెనీలకు భూములు కట్టబెట్టే విషయంలోనూ వ్యాపారం సాగించి రైతులను దగా చేస్తూ రూ. కోట్లు దోపిడీ చేశారు. కేశవ్ అక్రమాలపై విశ్వ సాగించిన పోరాటాలు ఒకానొక దశలో రాష్ట్రాన్ని కుదిపేశాయి. ప్రధానంగా పేదలకు ఇంటిపట్టాలు, పక్కా గృహ నిర్మాణాల కోసం వేలాది మందితో రోడ్డు పై బైఠాయించి ఎమ్మెల్యే విశ్వ అరెస్ట్ అయ్యారు. నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటూ రాగులపాడు పంప్‌హౌస్‌ను ముట్టడించారు. ఉరవకొండ, బెళుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో జలజాగరణలు చేసి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పోరాటాల ఫలితంగా ఉరవకొండ పట్టణంలో పేదలకు ఇంటిపట్టాలు దక్కాయి. -
కోడెల ఎదురీత
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ప్రధాన సామాజిక వర్గాలన్నీ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు ఇండిపెండెంట్‌గా, ఒకసారి సీపీఐ అభ్యర్థిగా ఎన్నిక కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో 1972 నుంచి 2004 వరకు ఏ ఒక్కరూ రెండోసారి గెలవలేదు. ఆ ఆనవాయితీకి యర్రం వెంకటేశ్వరరెడ్డి బ్రేక్ వేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు (2004, 2009) గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం శాసనసభ స్పీకర్‌గా ఎంపికయ్యారు. స్పీకర్‌గా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉండగా.. టీడీపీ తరఫున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వ్యవస్థలను భ్రష్టు పట్టించారనే అçపకీర్తిని మూటగట్టుకున్నారు. టీడీపీలో కోడెల శివప్రపాదరావు కీలక నేత కావడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అందరికీ సుపరిచితుడు కావడంతో రాష్ట్రంలో అందరి దృష్టి నియోజకవర్గంపై పడింది. అవినీతికి కేరాఫ్ కోడెల ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై.. అపార అనుభవం కలిగిన కోడెల శివప్రసాద్ అవినీతి దందాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భూ దందాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. స్పీకర్ కుమారుడు, కుమార్తె ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి పనికి కేఎస్టీ (కోడెల శివప్రసాద్ ట్యాక్స్) వసూలు చేశారని పార్టీ వర్గాలు సైతం బాహాటంగానే చెబుతున్నాయి. టీడీపీ నేతలను సైతం వదలకుండా ప్రతి పనికి డబ్బులు వసూలు చేశారు. ‘కోడెలకు సీటు ఇవ్వొద్దు.. క్విట్ కోడెల’ అంటూ టీడీపీ నేతలే పెద్దఎత్తున ఆందోళన చేశారు. కోడెల ప్రచారానికి జనాలు రాక సభలు వెలవెలబోతున్నాయి. డబ్బుతో జనాలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. కోడెల ఓటమి అంచున పయనిస్తున్నారు. ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న రాంబాబు అంబటి రాంబాబు గతంలో వైఎస్సార్‌కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ సీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అన్నివర్గాల ప్రజలను కలుపుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున నాయకులు, ప్రజలు చేరుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన రాంబాబుకు ప్రజల్లో సానుభూతి ఉంది. సౌమ్యుడిగా, మచ్చలేని నాయకుడిగా మంచిపేరు ఉంది. దీంతో రాంబాబు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండటం కలిసొచ్చే అంశం. హామీలు మరచిన బాబు చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు పశువుల హాస్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ హామీ ఇప్పటికీ కలగానే మిగిలింది. సత్తెనపల్లి–మాచర్ల రహదారి ప్రధానంగా లోలెవల్ బ్రిడ్జిలు ఉండటంతో.. వర్షాకాలంలో వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ బ్రిడ్జిలను హై లెవల్ బ్రిడ్జిలుగా మారుస్తున్నామని చెప్పారు. కేవలం శంకుస్థాపనకే పరిమితం అయ్యారు. కొండమోడు–పేరేచర్ల రహదారిని ఆరు లేన్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు. అది అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఉండటంతో బైపాస్ నిర్మాణం చేపడతామని చెప్పారు. కలగానే మిగిలింది. సాగర్ కుడి కాలువకు పరిధిలో వరి పండించే రైతులకు ఐదేళ్లుగా పంట పండటం లేదు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా గత ఏడాది ఎత్తిపోతల పథకాలకు నకరికల్లు వద్ద శంకుస్థాపన చేశారు.– ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి,సాక్షి, అమరావతి బ్యూరో ఓటర్ల వివరాలు మొత్తం 2,30,775 పురుషులు 1,13,592 మహిళలు 1,17,166 ఇతరులు: 17 -
పాతపట్నం.. కొత్తరూటు
సాక్షి, ఎల్ ఎన్ పేట, (శ్రీకాకుళం): పాతపట్నం.. జిల్లాలో అత్యంత చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతం. వరాహ వెంకట గిరిని జాతికి అందించిన గడ్డ ఇది. ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన లుకలాపు లక్ష్మ ణదాస్ రాజకీయ ఓనమాలు దిద్దిందీ ఇక్కడే. చంద్రబాబు తన అనుచర గణాన్ని అంతా దింపినా లక్ష్మీపార్వతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రాంతమిది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇతర పార్టీలూ ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే. గత ఎన్నికల్లో స్థానిక ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కడితే.. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కేస్తూ కలమట వెంకటరమణ టీడీపీకి ఫిరాయించారు. ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోతోందని స్థానికులంటున్నారు. అపురూప చరిత్ర.. పాతపట్నం నియోజకవర్గం 1952 నుంచి యాక్టివ్‌గా ఉంది. అప్పట్లో ద్విసభ్య శాసనసభగా ఉండేది. లుకలాపు లక్ష్మణదాస్, వీవీ గిరి నుంచి నేటి కలమట వెంకటరమణ వరకు దాదాపు పద్దెనిమిది మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొదట్లో కాంగ్రెస్‌పై అభిమానం చూపిన నియోజకవర్గ ప్రజలు అనంతరం ఎన్టీఆర్‌పై అపార ప్రేమ చూపించారు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఎన్టీఆర్‌వైపే నిలబడ్డారు. అందుకు నందమూరి లక్ష్మీపార్వతి గెలుపే నిదర్శనం. ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్‌పైనే ఇక్కడి వారు మళ్లీ అంతటి ప్రేమ చూపించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందగా, 2014లో కలమట వెంకటరమణ వైఎస్సార్ జెండా పట్టుకుని గెలుపొందారు. అయితే ఆయన ఆ జెండాను దింపేసి టీడీపీ జెండాను నెత్తినెత్తుకున్నారు. రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి జనాభిప్రాయాన్ని కించపరిచారు. మొత్తం ఓటర్లు: 2,16,221 పురుషులు: 1,08,606 మహిళలు: 1,07,594 ఇతరులు: 17 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 316 ప్రధాన సమస్యలు.. అభివృద్ధికి నోచుకోని వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ వంశధార నిర్వాసితులదే ఇక్కడి ప్రధాన సమస్య. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు సజావుగా జరిగి, ప్యాకేజీలు, పునరావాలు కూడా ఎలాం టి గొడవలు లేకుండా జరిగాయి. కానీ టీడీపీ అధికారం చేపట్టాక ఈ పనుల్లో గందరగోళం మొదలైంది. పునరావాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు లేదు. ఇళ్లు లేవు. వారికి రేషన్లు, పింఛన్లు, ఓట్లు చాలా సదుపాయాలు మృగ్యమైపోయాయి. వీటిపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికార పార్టీ పంచన చేరారు. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. విశిష్టతలు ♦ పాతపట్నం నుంచే రాజకీయ ఓనమాలు దిద్దిన వి.వి.గిరి (వరాహ వెంకట గిరి) కేంద్ర కార్మిక మంత్రి, భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. ♦ పాతపట్నం నుంచి గెలిచిన లుకలాపు లక్ష్మణదాస్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా వెలుగొందారు. ♦ 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్నందున టీడీపీ నుంచి గెలిచిన కలమట మోహనరావు ఎన్నికల చెల్లదంటూ అప్పటి ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు (కాంగ్రెస్) కోర్టుకు వెళ్లడంతో 1996లో కలమట ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ♦ 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కలమట మోహనరావు సతీమణి వేణమ్మపై ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసిన నందమూరి లక్ష్మీపార్వతి ఘన విజయం సాధించారు. లక్ష్మీపార్వతి విజయాన్ని అడ్డుకునేందుకు అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గాన్ని అంతా దించినా నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించి లక్ష్మీపార్వతి ఎన్నికయ్యారు. కలమట కోటకు బీటలు 1978 నుంచి కలమట కుటుంబానికి కంచుకోటగా మారిన పాతపట్నం నియోజకవర్గంలో కలమట మోహనరావు ఐదు సార్లు, ఆయన కొడుకు కలమట వెంకటరమణమూర్తి ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఆ కోటకు బీటలు పడనున్నట్లు తార్కాణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 2016లో అధికార టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను ఓడించాలనే ధ్యేయంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 2016 నుంచి రాత్రి పగలు, కొండలు, నదులు అనే తేడా లేకుండా పల్లెపల్లెకు, గడప గడపకూ తిరిగారు. అన్ని వర్గాల వారితో కష్టసుఖాలు పంచుకున్నారు. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాలో కలమట అక్రమాలు జనాలకు తెలిసిపోయాయి. ఇవే ప్రస్తుత ఎలక్షన్లను ప్రభావితం చేయనున్నాయి. -
మంత్రులుగా మనోళ్లు
సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి): జిల్లా నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రి పదవులు అలంకరించిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పలు కీలక శాఖల్లో మంత్రులుగా వీరు చక్రం తిప్పారు. ♦ నరసాపురం నియోజకవర్గం నుంచి 1960లో గ్రంధి రెడ్డినాయుడు తొలిసారిగా జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. పరకాల శేషావతారం 1976, 1978, 1981లో మంత్రిగా పనిచేశారు. చేగొండి హరిరామజోగయ్య 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో అనంతరం కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో బెర్తు దక్కించుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు 1994, 1999లో మంత్రిగా పనిచేశారు. ♦ పాలకొల్లు నుంచి దాసరి పెరుమాళ్లు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అల్లూరి సుభాష్‌చంద్రబోస్ 1990లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ♦ ఉండి నియోజకవర్గం నుంచి కలిదిండి రామచంద్రరాజు (అబ్బాయిరాజు) 1987, 1999లో మంత్రిగా పనిచేశారు. ♦ పెనుగొండ నియోజకవర్గం నుంచి ప్రత్తి మణెమ్మ 1986లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ♦ అత్తిలి నియోజకవర్గం నుంచి ఇందుకూరి రామకృష్ణంరాజు భవనం వెంకట్రావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. దండు శివరామరాజు 1999లో మంత్రిగా ఉన్నారు. ♦ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో ఈలి ఆంజనేయులు, 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా పనిచేశారు. ♦ ఉంగుటూరు నుంచి వైఎస్ మంత్రివర్గంలో వట్టి వసంత్‌కుమార్ మంత్రిగా ఉన్నారు. ♦ దెందులూరు నియోజకవర్గం నుంచి మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి మర్రి చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. మాగంటి వరలక్ష్మీదేవి నేదురుమిల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పనిచేశారు. ♦ ఏలూరు నుంచి మరడాని రంగారావు 1989లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ♦ గోపాలపురం నియోజకవర్గం నుంచి 1967లో టి.వీరరాఘవులు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. 1989లో కారుపాటి వివేకానంద మంత్రిగా పనిచేశారు. ♦ కొవ్వూరు నియోజకవర్గం నుంచి 1978లో ఎంఏ అజీజ్ టి.అంజయ్య, భవనం వెంకట్రావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో కేఎస్ జవహర్ చోటు దక్కించుకున్నారు. ♦ ఆచంట నుంచి పితాని సత్యనారాయణ వైఎస్సార్, చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ♦చింతలపూడి నుంచి పీతల సుజాత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. చింతలపాటి మూర్తిరాజు, కోటగిరి విద్యాధరరావు, మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) అమాత్యా అనిపించుకున్నారు. ఎమ్మెల్సీలుగా పనిచేసి.. శాసనమండలి సభ్యులుగా జలగం వెంగళరావు మంత్రివర్గంలో యర్రా నారాయణస్వామి మంత్రిగా పనిచేశారు. ఏలూరుకు చెందిన వీరమాచనేని వెంకటనారాయణ శాసనమండలి సభ్యునిగా 1978లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. శాసనమండలి సభ్యునిగా కంతేటి సత్యనారాయణరాజు 1981 టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. -
పన్నులతో ప్రజల నడ్డి విరగొట్టారు
అడ్డదిడ్డంగా జరిమానాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముకుతాడు వేయాల్సిందే. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానా వసూలు చేయాల్సిందే. మద్యం తాగి వాహనం నడిపితే మత్తు దించాల్సిందే...వీటిని ఎవరూ కాదనలేరు. కానీ మొదట అవగాహన కల్పించి తర్వాత ఫైన్లకు పనిచెప్పాల్సి ఉంటుంది. జరిమానాలే పరమావధి కాకూడదు. నెలలో ఇన్ని డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టాలి, ఇన్ని చలానాలు రాయాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో పోలీసులు ఆ లక్ష్యాలను అందుకోవడానికి వక్రమార్గాలు అన్వేషించారు. ఎలాగైనా కేసులు పెట్టాలన్న అత్యుత్సాహంతో వైన్‌షాపుల వద్ద కాపుకాసి, మద్యం తాగి వాహనం ఎక్కే వారిని పట్టుకొని డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి ఎక్సైజ్ శాఖకు టార్గెట్(లక్ష్యం) విధించి మద్యం ద్వారా ఆదాయం సంపాదించింది. ఇదే క్రమంలో ఆర్టీఏ, పోలీసు శాఖలకు కూడా నెలకు ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ చలానాలు వేయాలని టార్గెట్లు విధించారు. దీంతో పోలీసులు కనబడిన వారినల్లా ఆపి అవిలేవు, ఇవి లేవంటూ ఫైన్లు రాశారు. దళిత కాలనీలపై దండయాత్ర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న కాలనీలపై ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ సర్కార్ మాత్రం వారిపై దండయాత్ర ప్రకటించింది. విద్యుత్ శాఖ అధికారులను ఉసిగొల్పి ఎస్సీల ఇళ్లకు బలవంతంగా మీటర్లు అమర్చారు. మేము కట్టలేము మొర్రో అంటున్నా వినకుండా వేలకు వేలు గుంజారు. దొంగ కరెంటు వాడుతున్నారని కేసులు నమోదు చేశారు. ప్రతి ఇంటికీ బలవంతంగా మీటర్లు అమర్చారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరిలో అన్ని ఇళ్లకు బలవంతంగా విద్యుత్ మీటర్లు అమర్చారు. వాటికి పాత బకాయిలు కూడా కలిపి వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. మీటర్లు బిగించుకోకపోతే పోలీసులను తెచ్చి కేసులు పెడుతున్నారు. దీంతో ఎవరూ నోరు విప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. – చంద్ర, వెంకటాయపల్లె. పన్ను వసూళ్లు ఇలా.. సంవత్సరం పన్ను డిమాండ్ వసూలు చేసిన మొత్తం బ్యాలెన్స్ 2004–05 3,79,42,186 3,42,64,909 36,77,277 2012–13 6,13,92,493 4,95,75,250 1,18,17,243 2013–14 6,30,72,720 3,57,55,931 2,73,16,789 2017–18 17,18,32,438 8,21,45,292 8,96,87,146 జీఐఎస్ సర్వే ద్వారా పెరిగిన పన్ను వివరాలు.. మున్సిపాలిటీ మొత్తం భవనాలు పన్ను పెరిగిన భవనాలు పెరిగిన పన్ను కోట్లలో కడప 88423 27593 2,15,33,710 ప్రొద్దుటూరు 30441 19803 3,10,73,147 బద్వేల్ 22996 13454 68,93,791 పులివెందుల 19876 12725 53,62,498 రాయచోటి 25026 11062 87,98,742 మైదుకూరు 12784 8178 38,54,338 జమ్మలమడుగు 10872 4888 22,99,374 ఎర్రగుంట్ల 10315 4025 12,62,200 రాజంపేట 10741 758 8,43,310 మొత్తం 2,29,870 1,02,946 8,18,21,192 పల్లెల్లో పన్ను పోటు కడప ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్నుల చెల్లింపు భారంగా మారుతోంది. పన్నులను ఏడాదికి ఏడాదికి పెంచుతూ పేదలపై భారం మోపుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పన్ను చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోయినప్పటికీ డ్రైనేజీ మెయింటెనెన్స్ పేరుతో 10 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే పలు చోట్ల లైబ్రరీలు లేకున్నా వాటి నిర్వహణకు 8 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. పింఛన్ డబ్బుల్లో ఇంటిపన్ను పట్టుకుంటున్నారు మా గ్రామంలో వృద్ధులకు పింఛన్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులోనే ఇంటి పన్ను పట్టుకుని మిగతా డబ్బు ఇస్తున్నారు. ఆ డబ్బులను ట్రెజరీకి జమ చేస్తున్నారో లేదో తెలియడం లేదు. – ఆదినారాయణరెడ్డి, ఖాజీపేట ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి రెండు సార్లు ఇంటిపన్ను చెల్లిస్తున్నాము. ప్రతి ఆరు నెలలకు ఒక సారి చెల్లించాలి. అలా చెల్లించకపోతే వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్నును కూడా సంవత్సరానికి ఒక సారి కొంతశాతం పెంచుతూ పొతుంటారు. – రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె. మున్సిపాలిటీల్లో భారీ మోత కడప కార్పొరేషన్: ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ సర్కార్ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా వారిపై పన్నుల మోత మోగించింది. జీఐఎస్ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపింది. ఈ సర్వే వల్ల జిల్లాలోని కడప నగరపాలక సంస్థతోపాటు 8 మున్సిపాలిటీల్లోని 90 శాతం ఇళ్లకు పన్నులు అధికంగా పెరిగాయి. జిల్లాలో ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో 10 మాసాలపాటు జీఐఎస్ సర్వే నిర్వహించారు. జిల్లాలోని కడప కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో మొత్తం రూ.9 కోట్ల మేర పన్నులు పెంచేశారు. ఇంటి ప్లాన్ లేని భవనాలకు యూసీ చార్జీల రూపంలో 100 శాతం పెనాల్టీ వేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 2,29,900 గృహాలు ఉండగా, జీఐఎస్ సర్వే వల్ల 1.83లక్షల భవనాలకు పన్ను పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ మొత్తాన్ని కూడా మున్సిపాలిటీల నుంచే వసూలు చేసింది. భవనాల్లో ఎలాంటి మార్పు లేక పోయినా జీఐఎస్ సర్వేలో పన్ను రెండింతలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ సిబ్బందిపై పెరిగిన పనిభారం జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతి ఇంటికి సంబంధించిన కొలతలు తీసి మున్సిపల్ కమిషనర్లకు నివేదిక రూపంలో ఇచ్చింది. కొన్ని ఇళ్లకు ప్లాన్లు ఉన్నప్పటికీ లేనట్లుగా చూపి పన్నులు విపరీతంగా పెంచేశారు. దీంతో మున్సిపాలిటీల్లోని ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు మళ్లీ క్షేత్ర స్థాయి విచారణ చేయాల్సి వచ్చింది. దీనివల్ల మున్సిపాలిటీల్లో బిల్కలెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఓలపై పనిభారం పెరిగిపోయి ఇబ్బందులు పడ్డారు. పన్నులు తగ్గించాలని జనరల్ బాడీలో తీర్మానం చేసినా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం జీఐఎస్ సర్వే చేసి పన్నులు విపరీతంగా పెంచేసింది. దాదాపు అన్ని ఇళ్లకు పన్నులు పెరిగాయి. ప్లాన్లు ఉన్న వారికి కూడా లేనట్లు చూపి పన్నులు అధికంగా వేశారు. దీనిపై మేము అనేక జనరల్ బాడీ సమావేశాల్లో ప్రశ్నించి ఆ సర్వేను రద్దు చేయాలని తీర్మానం కూడా చేశాము. అయితే మా తీర్మానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.– సానపురెడ్డి శివకోటిరెడ్డి, 12వ డివిజన్ కార్పొరేటర్. రూ.500లు ఉన్న పన్ను రూ.1200 అయింది మేము వికలాంగుల కాలనీలో ఉంటున్నాము. గతంలో మాకు రూ.500 పన్ను వచ్చేది. ప్రస్తుతం రూ.1200 వస్తోంది. అంతకుముందు ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. కొత్తగా ఎలాంటి కట్టడాలు చేపట్టలేదు. అయినా పన్ను పెంచేశారు. పన్ను తగ్గించమంటే పెరిగిన పన్ను కట్టమంటున్నారు. – జాషువా, వికాలాంగుల కాలనీ. ప్రగతి రథం.. బాదుడు పథం కడప కోటిరెడ్డి సర్కిల్ : అతి సామాన్యుడు ప్రయాణించే ప్రజా ప్రగతి రథచక్రమైన ఆర్టీసీ చార్జీలు పెంచి నడ్డివిరిచారు. అంతేకాక ఐదు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆర్టీసీలో సెస్సులు వసూలు చేస్తూ అదనపు భారం మోపారు. టోల్‌గేటు టాక్స్, బస్టాండ్ మెయింటెనెన్స్, ప్రయాణికుల ఇన్సూరెన్స్ స్కీం సెస్సు పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 అక్టోబరు నెల 24వ తేదీన ఆర్టీసీ చార్జీలు పెంచారు. అప్పటి నుంచి చార్జీలు పెంచకపోయినా ప్రయాణికులకు తెలియకుండా పరోక్షంగా టికెట్లలో ఈ సెస్సు చార్జీలు పెంచిన విషయం స్పష్టంగా ఉంది. 2015లో చార్జీలు పెంచిన తీరు ఇలా.. జిల్లాలో ఆర్టీసీ డిపోలు 8 ఉన్నాయి. అన్ని డిపోలలో కలిపి 804 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు రోజు 3,027 కిలో మీటర్లు తిరుగుతూ ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తున్నాయి. ఈ బస్సుల్లో 4.05 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళుతున్నారు. 2015 అక్టోబరు నెల 24వ తేదీన కిలో మీటరుకు పల్లె వెలుగు బస్సులకు 5 శాతం, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు 10 శాతం, డీలక్స్‌లకు 11 శాతం, సూపర్ లగ్జరీ, ఇంద్ర సర్వీసులకు 10 శాతం చార్జీలు పెంచారు. టోల్ గేట్...ఇతర సెస్సుల బాదుడు.. జిల్లా నుంచి ప్రతి రోజు ప్రొద్దుటూరు, కర్నూలు, మైదుకూరు, హైదరాబాదుకు బస్సులు తిరుగుతున్నాయి. కడప నగర శివార్లలోని ఖాదర్‌ఖాన్ కొట్టాల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన టోల్‌గేటు మీదుగా బస్సులు ప్రయాణిస్తున్నాయి. రానుపోను, ఒక్కసారి పోవడానికి ప్రతి ప్రయాణికుడి నుంచి బస్సు కండక్టర్లు రూ.5లు వసూలు చేస్తున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులకైతే బస్టాండ్ మెయిన్టెనెన్స్ సెస్సు రూ.2లు, ప్రయాణికుల ఇన్సూరెన్స్ స్కీం సెస్సు కింద రూ.1, యాక్సిడెంటల్ సెస్సు రూ.1 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇతర సర్వీసులకైతే ఎక్కువగా ఉంటోంది. 2015లో చార్జీల భారం మోపారు.. 2015 అక్టోబరు నెలలో కిలో మీటరుకు 5 నుంచి 11 శాతం వరకు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో పెంచుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు ఏటా ఏదో ఒక సెస్సును ప్రయాణికులపై రుద్దుతూనే ఉన్నారు. –సుదర్శన్‌రెడ్డి, వ్యాపారి, కడప. బస్టాండ్ మెయింటెనెన్స్ సెస్సు ప్రయాణికుడికేం సంబంధం.. ముక్కు పిండి వసూలు చేస్తున్న బస్టాండ్ మెయింటెనెన్స్ సెస్సుకు ప్రయాణికుడికి ఏం సంబందం. ప్రయాణికులు బస్టాండ్‌కు వస్తారు, పోతారు. అక్కడ స్టాళ్ల వారు ఉంటారు. వారి నుంచి మెయింటెనెన్స్ సెస్సురాబడితేనే ఉపయోగం. –రమణ, ప్రయాణికుడు, లక్కిరెడ్డిపల్లె మండలం. యాక్సిడెంట్ సెస్సు రాబడుతున్నా ఎంతమందికిచ్చారో తెలియదు... బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బస్సు ప్రయాణికులను ఆదుకోవడంలో తప్పులేదు. కానీ ప్రయాణికుల నుంచి రాబడుతున్న ఈ సెస్సు ఎంతమందికి ఇచ్చారో ఎవ్వరికి తెలీదు. ప్రభుత్వం ఈ సెస్సుపై విధాన ప్రకటన చేయాలి. –రామకోటి, ప్రయాణికుడు, కడప. సెస్సులే అధికం.. ప్రయాణికులకు ఏ మాత్రం అనుమానం రాకుండా, ఎదురు ప్రశ్నించకుండా సెస్సుల పేరుతో ప్రభుత్వం మోత మోగిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా సెస్సులు వేయలేదు. ఎన్ని సెస్సులు వేసినా ఆర్టీసీ లాభాల్లో ఉందా? అంటే అదీ లేదు. కేవలం ప్రయాణికుల సొమ్ములు దోచుకోవడానికే ఇవన్నీ రాబడుతున్నారు. – కొప్పోలి స్వప్న, ప్రయాణికురాలు, కడప. -
‘విన్’డిపెండెంట్లు లేరక్కడ!
సాక్షి, కొత్తపేట (తూర్పు గోదావరి): జిల్లాలో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు ఎప్పుడూ పట్టం కట్టలేదు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో నువ్వా.. నేనా..? అనే రీతిలో తలపడి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఆది నుంచీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పలువురు ఎన్నికల బరిలో నిలిచినా ప్రధానంగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం), ఎంవీఎస్ సుబ్బరాజు, డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి ఓటమిపాలైనా తమ సత్తా చాటుకున్నారు. 1962, 1967 ఎన్నికల్లో వరుసగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం) కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీఎస్ సుబ్బరాజుకు గట్టి పోటీ ఇచ్చి కేవలం 1,542 ఓట్లు, 3,143 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1972లో ఎంవీఎస్ సుబ్బరాజు కాంగ్రెస్ అభ్యర్థి భానుతిలకంతో తలపడి 9,829 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డాక్టర్ ఐఎస్ రాజు, బండారు సత్యానందరావులతో తలపడి 1,397, 16,113 ఓట్ల తేడాతో ప్రత్యర్థిగా నిలిచి తన సత్తా చాటుకున్నారు. అలా ఈ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకే పట్టం కట్టారు.