విజయనగరం అర్బన్: సార్వత్రిక విద్యాపీఠ్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పదోతరగతిలో 47.54 శాతం, ఇంటర్మీడియెట్‌లో 59.9 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి విద్యార్థులు 2,516 మంది పరీక్షకు హాజరుకాగా, 1,196 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియెట్‌లో 2,109 మందికి గాను 1,264 మంది ఉత్తీర్ణులయ్యారు. పది పరీక్షా పత్రాల రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకి రూ.
100, రీ వాల్యూయేషన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాల రీకౌంటింగ్ కోసం రూ.1000, రీవాల్యూయేషన్ కోసం రూ.600 ఫీజును ఈ నెల 11 నుంచి 23వ తేదీ మధ్య ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. పరీక్ష ఫలితాలను ‘ఏపీఓపెన్‌స్కూల్.ఆర్గ్’ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Published Thu, Jun 11 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement