తిరుమల : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన తిరుమల నమూనా ఆలయంలో శ్రీవారిని 4.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందజేసింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.35 లక్షల ఆదాయం లభించింది.
తిరుమల తరహాలోనే రాజమండ్రిలో కూడా శ్రీవారికి పూజలు నిర్వహించారు. నమూనా ఆలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకూ ప్రతి రోజు నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపునకు విశేష స్పందన లభించినట్టు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
పుష్కర తీరంలో 4 లక్షల మందికి శ్రీవారి దర్శనం
Published Sun, Jul 26 2015 9:11 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM
Advertisement
Advertisement