శ్రీహరికోటలో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉద్యోగులకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు ఉద్యోగులు పని చేస్తున్న కంటైనర్‌లో ఆక్సిజన్ ఖాళీ కావడంతో వారందరూ శ్వాస అందక ఇబ్బంది పడ్డారు. సరైన సమయంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ముగ్గురు ఉద్యోగులను ప్రాణాపాయ స్ధితి నుంచి కాపాడారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.