అచ్చంపేట, న్యూస్‌లైన్:
సీమాంధ్రుల పాలనలో వెనకబడిన పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీశ్వర్‌రావు అన్నారు. ఆర్డీఎస్ కింద జిల్లాలో 82 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 30వేలకు మించి అందడం లేదన్నారు. 2012లో కరువు ఏర్పడితే ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని 64 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రూ.640 కోట్లు ఇచ్చి, పాలమూరు జిల్లాలో కేవం ఐదు మండలాలను మాత్రమే గుర్తించి రూ.40 కోట్లు ఇచ్చిందని వివరించారు. సోమవారం సాయంత్రం అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్వర్‌రావు మాట్లాడు తూ.. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు ఆకలిచావులు, వలసలు, ఆత్మహత్యలు, దోపిడీయే మిగిలిందన్నారు. ఈ ప్రాంతభూములు, ప్రాజెక్టులను కబ్జాచేశారని ఆరోపించారు. సీమాం ధ్రులు తెలంగాణను దొరికినకాడికి దోచుకున్నారని, ఇంకా ఉన్న వనరులను దోచుకునేందుకు సమైక్యపాట పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన అన్ని రాజ కీయ పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో వారి నిజస్వరూపం బయటపడిందన్నారు. అ మరులు కలలు గన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుం దని, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీ రు, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, ఇల్లు నిర్మించుకునే వారికి రూ.2లక్షలు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్లు, ఆకలి, ఆత్మహత్యలు లేని పచ్చని తెలగాణ లక్ష్యంగా నిర్మాణం జరుగుతుందన్నారు.
తెలంగాణలో గులాబీ జెండాకు తప్ప మరే జెండాలకు స్థానం లేదన్నారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలను కోరారు. నాలుగు నెలల తర్వాత ఏర్పడేది మన ప్రభుత్వమేనని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని కోరారు. తెలంగాణ కోసం జైకొట్టిన శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు యాదవ్‌లపై సీమాంధ్రులు దాడులుచేసి దాదాగిరీ చేశారని, తామెక్కడైనా చేశామా? అని హరీశ్వర్‌రావు ప్రశ్నించారు.
ఏం చేశారని సంబరాలు: ఎంపీ మందా జగన్నాథం
జిల్లా మంత్రి డీకే అరుణ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నారా? అని నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం ప్రశ్నించారు. ఉద్యమం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు సంబరాలు జరుపుకోవాలి తప్ప మీలాంటి వారు కాదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాఉద్యమంలోకి వచ్చి సంబరాలు జరుపుకోవాలని హితవుపలికారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమ పరిస్థితులను గమనించి సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేశారని తెలిపారు.
తెలంగాణలో ఉన్న వనరులను దోచుకునేందుకే సమైక్యపాట పాడుతున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి తెలుగుగంగా, పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించకపోయారు తప్ప పక్కనే ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఎంజీఎల్‌ఐ ద్వారా కనీసం ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గువ్వల బాలరాజు, జి.సుదర్శన్, అర్జున్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, బాలయ్య చంద్రమోహన్, చీమర్ల మధుసూదన్‌రెడ్డి, పల్కపల్లి, మర్రిపల్లి, పెనిమళ్ల సర్పంచ్‌లు నర్సింహ్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరుకు అడుగడుగునా అన్యాయం
Published Tue, Sep 17 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement