semandhra
-
కాంగ్రెస్ వద్దు.. స్వతంత్రమే ముద్దు
నిడదవోలు రూరల్, న్యూస్‌లైన్: అదో జాతీయ పార్టీ. 120 ఏళ్ల ఘన చరిత్ర దాని సొంతం. దేశంలో ఎన్నో కష్టాలను ఒంటి చేత్తో అధిగమించిన ఆ పార్టీకి ఇప్పుడు కనీసం అభ్యర్థులు కూడా లేని దీనస్థితి. ఇదంతా కాంగ్రెస్ గురించే. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తెలుగోడి దెబ్బ పూర్తిగా దెబ్బతినకుండానే చేతులెత్తేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని దుస్థితికి చేరింది. నిడదవోలు మండలంలో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు. ‘పార్టీ పరువు పోతోంది.. బాబ్బాబు.. పోటీ చేయండి’ అంటూ నియోజకవర్గ నేతలు గ్రామాల్లోని నాయకులను అభ్యర్థించినా లాభం లేకపోయింది. రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గం, గ్రామాల్లో చక్రం తిప్పిన నేతల్లో మెజారిటీ శాతం వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. మిగిలిన వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పరిషత్ పోరులో బరిలోకి దిగాలని భావించిన నాయకులు ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. కాంగ్రెస్ తరఫున అయితే ఓడిపోవడం ఖాయమని ముందే గ్రహించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.నిడదవోలు మండలంలో గురువారం సాయంత్రానికి ఎంపీటీసీలకు 80 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ తరఫున ఒక్కటి కూడా లేకపోవడం ఆ పార్టీ అంటే ప్రజల ఏహ్యభావానికి నిదర్శనంగా చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలకు చేసిన అన్యాయానికి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సీమాంధ్రలో కాంగ్రెస్ బస్సుయాత్రలు
ఈ నెల 21 నుంచి 27 వరకు కాంగ్రెస్ ప్రచారం.. సీమాంధ్రలో ఈ నెల 21 నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 27న కర్నూలులో ముగియనుంది. రాష్ట్ర విభజన కు కారణాలు, కాంగ్రెస్ పాత్ర ఎంత తదితర అంశాలను కార్యకర్తలకు వివరించి వచ్చే ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు సి.రామచంద్రయ్య తదితరులు సోమవారం మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నివాసంలో భేటీ అయ్యారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, ఆపై సాధారణ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడంపై చర్చించారు. -
బంద్ ప్రశాంతం
మిన్నంటిన నిరసనలు ఎన్జీవోల బంద్ విజయవంతం వైఎస్సార్సీపీ పూర్తి సహకారం మూతపడిన ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు పార్లమెంట్లో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి కేంద్ర హోం మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని నియోజక వర్గాల్లో ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు నిరసనలతో హోరెత్తించారు. సాక్షి, విశాఖపట్నం : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్ర బంద్ గురువారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. లోక్ సభలో ‘టి’ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక కేంద్ర మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఅన్ని నియోజకవర్గాల్లోనూ మద్దతు తెలిపాయి. భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ర్యాలీలు నిర్వహించి, ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అనకాపల్లి పట్టణ బంద్ విజయవంతమయింది. కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యాన నియోజకవర్గంలో గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. యలమంచిలి మెయిన్‌రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. దిమిలి రోడ్డు జంక్షన్లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహశీల్దార్ కార్యాలయం మొయిన్‌రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అరకులోయలో నియోజకవర్గ సమన్వయకర్తలు కుంభా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధించి రాస్తారోకో చేశారు మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో కె.కోటపాడులో, మరో సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లిలో బంద్ నిర్వహించారు. చోడవరంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎన్జీవోల సమ్మెకు మద్దతు తెలిపారు. పాయకరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. -
బిల్లును అడ్డుకోండి
సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఏపీఎన్జీవోల అల్టిమేటం లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఈనెల 10-15 వరకు కీలకమైన రోజులు కేంద్రమంత్రులు సవరణలు కోరడం సరికాదు సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవడానికి కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఇదే చివరి అవకాశం. విభజన ప్రక్రియకు సంబంధించి ఈ నెల 10నుంచి 15వరకు ఎంతో కీలకమైన రోజులు. అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లునే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నందున , బిల్లు రాష్ట్రపతి నుంచి రాజ్యసభకు రాకుండా అడ్డుకోవాలి’’ అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండువారాలు ఉండే పదవుల కోసం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని కేంద్రమంత్రులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. విభజన బిల్లుపై కేంద్రమంత్రులు చేసిన సవరణలను కేబినెట్ తోసిపుచ్చిందన్నారు. అసెంబ్లీలో బిల్లును ఎమ్మెల్యేలు అడ్డుకున్న విధంగానే, పార్లమెంట్లో కూడా విభజన బిల్లు ఆమోదం పొందకుండా ఎంపీలు, మంత్రులు అడ్డుకోవాలని సూచించారు. అడ్డుకోకుంటే వారిని ప్రజలు క్షమించరని, వాళ్ల ఇళ్లముందు ప్రజలు ఎటువంటి ఆందోళనలు చేసినా ఏపీఎన్జీవోల మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో సంఘం కోశాధికారి వీరేంద్రబాబు, నగర కార్యదర్శి సీవీరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి రాజకీయ పక్షాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. తమ పార్టీల కార్యకర్తలందరూ ఉద్యమంలో పాల్గొంటారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. త్వరలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని క లిసి మద్దతు కోరతాం. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన పక్షంలో.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆమోదం లేకుండా విభజన బిల్లుపై కేంద్ర మంత్రులు సవరణలు కోరడం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. మంత్రుల మాటలను కేబినెట్ పెడచెవిన పెట్టినందున, ఇప్పటికైనా కేంద్ర మంత్రులు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలుగు జాతి ఐక్యంగా కలసుండాలన్న ఎన్టీఆర్ ఆకాంక్షలను కాపాడాలని పురందేశ్వరికి డాక్టర్ల జేఏసీ కన్వీనర్ రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. బిల్లును అడ్డుకోకపోతే చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను ఆడనివ్వబోమని స్పష్టం చేశారు. -
మంత్రి ఆనం సీమాంధ్ర ద్రోహి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరచి రాష్ట్రవిభజనకు కారకుడైన మంత్రి ఆనం సీమాంధ్ర ద్రోహిగా మిగిలిపోతాడని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు విరుచుకుపడ్డారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి వేదిక ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. సంతపేటలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటి ముట్టడికి బయల్దేరారు. సెయింట్‌జాన్స్ స్కూల్ వద్దకు ప్రదర్శన చేరుకోగానే డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేసి ఉద్యమకారులను నిలువరించారు. సమైక్యవాదులు రో డ్డుపై బైఠాయించి మంత్రి ఆనం, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ అవకాశవాదానికి రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో కాలం పాలన సాగించలేరన్నారు. మంత్రికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పలుచన చేస్తూ కేంద్రానికి నివేదించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న మంత్రి ఆనంను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. ఉద్యమకారులను పోలీ సులు అరెస్ట్‌చేసి నగరంలోని పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. ప్రదర్శన సందర్భంగా హిజ్రాలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు రమణారెడ్డి, వెంకమరాజు, సుధాకరరావు, ఆంజనేయవర్మ, శేఖర్‌రావు, సతీష్, మంజు, శైలజ, రమణరాజు తది తరులు పాల్గొన్నారు. -
పాలమూరుకు అడుగడుగునా అన్యాయం
అచ్చంపేట, న్యూస్‌లైన్: సీమాంధ్రుల పాలనలో వెనకబడిన పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీశ్వర్‌రావు అన్నారు. ఆర్డీఎస్ కింద జిల్లాలో 82 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 30వేలకు మించి అందడం లేదన్నారు. 2012లో కరువు ఏర్పడితే ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని 64 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రూ.640 కోట్లు ఇచ్చి, పాలమూరు జిల్లాలో కేవం ఐదు మండలాలను మాత్రమే గుర్తించి రూ.40 కోట్లు ఇచ్చిందని వివరించారు. సోమవారం సాయంత్రం అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్వర్‌రావు మాట్లాడు తూ.. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు ఆకలిచావులు, వలసలు, ఆత్మహత్యలు, దోపిడీయే మిగిలిందన్నారు. ఈ ప్రాంతభూములు, ప్రాజెక్టులను కబ్జాచేశారని ఆరోపించారు. సీమాం ధ్రులు తెలంగాణను దొరికినకాడికి దోచుకున్నారని, ఇంకా ఉన్న వనరులను దోచుకునేందుకు సమైక్యపాట పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన అన్ని రాజ కీయ పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో వారి నిజస్వరూపం బయటపడిందన్నారు. అ మరులు కలలు గన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుం దని, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీ రు, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, ఇల్లు నిర్మించుకునే వారికి రూ.2లక్షలు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్లు, ఆకలి, ఆత్మహత్యలు లేని పచ్చని తెలగాణ లక్ష్యంగా నిర్మాణం జరుగుతుందన్నారు. తెలంగాణలో గులాబీ జెండాకు తప్ప మరే జెండాలకు స్థానం లేదన్నారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలను కోరారు. నాలుగు నెలల తర్వాత ఏర్పడేది మన ప్రభుత్వమేనని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని కోరారు. తెలంగాణ కోసం జైకొట్టిన శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు యాదవ్‌లపై సీమాంధ్రులు దాడులుచేసి దాదాగిరీ చేశారని, తామెక్కడైనా చేశామా? అని హరీశ్వర్‌రావు ప్రశ్నించారు. ఏం చేశారని సంబరాలు: ఎంపీ మందా జగన్నాథం జిల్లా మంత్రి డీకే అరుణ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నారా? అని నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం ప్రశ్నించారు. ఉద్యమం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు సంబరాలు జరుపుకోవాలి తప్ప మీలాంటి వారు కాదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాఉద్యమంలోకి వచ్చి సంబరాలు జరుపుకోవాలని హితవుపలికారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమ పరిస్థితులను గమనించి సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేశారని తెలిపారు. తెలంగాణలో ఉన్న వనరులను దోచుకునేందుకే సమైక్యపాట పాడుతున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి తెలుగుగంగా, పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించకపోయారు తప్ప పక్కనే ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఎంజీఎల్‌ఐ ద్వారా కనీసం ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజు, జి.సుదర్శన్, అర్జున్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, బాలయ్య చంద్రమోహన్, చీమర్ల మధుసూదన్‌రెడ్డి, పల్కపల్లి, మర్రిపల్లి, పెనిమళ్ల సర్పంచ్‌లు నర్సింహ్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హోంశాఖ అధికారులతో సీమాంధ్ర కాంగ్ నేతలు భేటీ
-
విభజనకు సహకరించాలి: తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సాహెబ్రావు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సాహెబ్రావు పవార్ కోరారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని యూటీఎఫ్ సంఘం భవనంలో జిల్లా సమావేశం నిర్వహించారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన తరువాత సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం మొదలైందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపైనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే వరకు కలిసికట్టుగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుతూ తె లంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చాలన్నారు. జాగృతి అనుబంధ విభాగాల కన్వీనర్లను ఎన్నుకున్నారు. సమావేశంలో జాగృతి నాయకులు విలాస్‌గౌడ్, జగన్మోహన్రెడ్డి, టీయూటీఎఫ్ నాయకులు లచ్చిరాం, దేవన్న, జలపతి పాల్గొన్నారు. అనుబంధ సంఘాల కమిటీ.. తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాల కమిటీని జిల్లా కన్వీనర్ సాహెబ్రావు పవార్ ప్రకటించారు. ముథోల్ నియోజకవర్గ కన్వీనర్‌గా బాజిరెడ్డి, జిల్లా కోకన్వీనర్లుగా రవీందర్, పరమేశ్వర్‌రెడ్డి, గణే శ్ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్లు సంజీవ్, యువజన కన్వీనర్లు శ్రీకాంత్, మహిళా కన్వీనర్‌గా లలిత, హెల్త్ కన్వీనర్‌గా అనిల్, బుక్‌క్లబ్ కన్వీనర్‌గా ఉదారి నారాయణను నియమించారు. -
సీమాంద్ర కాంగ్రెస్‌లో ఆందోళన