ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సాహెబ్‌రావు పవార్ కోరారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని యూటీఎఫ్ సంఘం భవనంలో జిల్లా సమావేశం నిర్వహించారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన తరువాత సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం మొదలైందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపైనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే వరకు కలిసికట్టుగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుతూ తె లంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చాలన్నారు. జాగృతి అనుబంధ విభాగాల కన్వీనర్లను ఎన్నుకున్నారు. సమావేశంలో జాగృతి నాయకులు విలాస్‌గౌడ్, జగన్‌మోహన్‌రెడ్డి, టీయూటీఎఫ్ నాయకులు లచ్చిరాం, దేవన్న, జలపతి పాల్గొన్నారు.
అనుబంధ సంఘాల కమిటీ..
తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాల కమిటీని జిల్లా కన్వీనర్ సాహెబ్‌రావు పవార్ ప్రకటించారు. ముథోల్ నియోజకవర్గ కన్వీనర్‌గా బాజిరెడ్డి, జిల్లా కోకన్వీనర్లుగా రవీందర్, పరమేశ్వర్‌రెడ్డి, గణే శ్ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్లు సంజీవ్, యువజన కన్వీనర్లు శ్రీకాంత్, మహిళా కన్వీనర్‌గా లలిత, హెల్త్ కన్వీనర్‌గా అనిల్, బుక్‌క్లబ్ కన్వీనర్‌గా ఉదారి నారాయణను నియమించారు.
విభజనకు సహకరించాలి: తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ సాహెబ్‌రావు
Published Mon, Aug 26 2013 5:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement