సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పరకాల నియోజకవర్గంపై కన్నేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయం అదే సెగ్మెంట్‌లో వెచ్చిస్తున్నారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ కొత్త పరిణామాలు రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి రేపుతు న్నాయి. రానున్న ఎన్నికల్లో తాను... లేకుంటే తన సతీ మణి గండ్ర జ్యోతిని అక్కడి నుంచి పోటీకి దింపేందుకు గండ్ర వ్యూహాత్మకంగా అడు గులు వేస్తున్నారనే ప్రచా రం జరు గుతోంది. పక్కనే ఉన్న భూపాల పల్లి సిట్టింగ్ స్థానమైనప్పటికీ.. గండ్ర ఈ సెగ్మెంట్‌పై దృష్టి సారించడం వెనుక రకరకాల కారణాలున్నాయని విశ్లేషి స్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తు కూడుతుం దని... సీట్ల సర్దుబాటులో జిల్లాలో ముందుగా భూపా లపల్లి, నర్సంపేట సెగ్మెంట్లు త మకే ఇవ్వాలని టీఆర్ ఎస్ పట్టుబడుతుందనే వాదనలు న్నా యి. అందుకే తన సీటు చేజారితే ఏం చేయాలనే ముందు చూ పుతో... పక్కనే ఉన్న పరకాలలో గండ్ర దస్తీ వేసుకుంటు న్న ట్లు ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులేమీ లే కుండా కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళితే తన సీటుకు ఢో కా ఉండదని.. బోనస్‌గా తన భార్య జ్యోతిని పరకాల నుంచి పోటీకి దింపాలనే ఆలోచనతో ఉన్నట్లు గండ్ర అనుచరగ ణంలో గుప్పుమంటోంది.
పరకాల ఉప ఎన్నికల సమయంలో నే జ్యోతిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దింపేందుకు గండ్ర చి వరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించడం తెలిసిందే. మ రోవైపు కొండా దంపతులకు గట్టి పట్టు ఉన్న నియోజక వర్గం కావడంతో.. గండ్ర వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్ప ష్టమవుతోంది. వైఎస్సార్ సీపీని వీడిన తర్వాత మాజీ మంత్రి సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తమ రాజ కీయ భవిష్యత్‌ను నిర్దేశించుకునే సంధి కాలంలో ఉన్నారు. మొదట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, తెలం గాణ ఆకాంక్ష నెరవేర్చినందుకు పాత గూటిలో చేరేందుకు కొండా దంపతులు మొగ్గు చూపుతున్న వాదనలు వినిపిస్తు న్నాయి.
ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో ఇప్పటికే మాటామంతి కుదిరిందని.. త్వరలోనే ఆయన స మక్షంలోనే పార్టీలో చేరే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోం ది. మళ్లీ కొండా దంపతులు ఎంట్రీ ఇస్తున్నారనే సంకేతాలపై జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లోనూ భిన్నమైన వాదనలున్నా యి. ఇప్పటికే మంత్రులు పొన్నాల, సారయ్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, చీఫ్ విప్ గండ్ర కాంగ్రెస్‌లో పాతుకుపో యారు. బాహాటంగా ఎదురు చెప్పకపోయినా వీరిలో కొంద రు నేతలు కొండా రీ ఎంట్రీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొండా దంపతులు పార్టీలో చేరితే కొత్త పవర్ సెంటర్ ఏర్ప డుతుందని.. కానీ గతంతో పోలిస్తే అక్కడ ప్రాధాన్యం తగ్గి పోతుందనే వాదనలు కొండా వర్గీయులను సైతం కలవర పెడుతున్నాయి.
ఇదే అనువైన సమయంగా చీఫ్ విప్ గండ్ర ప రకాలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుం డడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వరుసగా పర కాల కేంద్రంగా పార్టీ సమావేశాలు నిర్వహించడం... తెలం గాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం... ఇదే సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తామంటూ గండ్ర జ్యోతి ప్రకటించడం... ఇవన్నీ సరికొత్త సంకేతాలు.
చదరంగం.........
Published Mon, Aug 26 2013 3:50 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement
Advertisement