‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి | pcc chief raghuveera reddy demand to Agri Gold victims 10 lakh loans | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

Published Fri, Feb 24 2017 2:04 AM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM

‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - Sakshi

‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి బృందం  

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కుంభకోణం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షు డు ఎన్‌.రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృం దం గురువారం గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా అనంత పురం జిల్లా దుద్దేబండలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, నాయకులు మాదాసు గంగాధరం, ఎన్‌.తులసిరెడ్డి, సుందరరామ శర్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement