pcc chief raghuveera reddy
-
కళ్యాణదుర్గ్ భవనం.. రఘువీరాకు భయం
సాక్షి, కళ్యాణదుర్గం : ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు చాలా కామన్. నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం వరకూ ఒక్కొక్కరూ ఒక్కో సెంటిమెంట్‌ను నమ్మడం చూస్తుంటాం. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి మాత్రం వాస్తు సెంటిమెంట్ ఉంది. తాను మంత్రిగా ఉన్న సమయం లో కళ్యాణదుర్గంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించుకున్న సొంత భవనం (కళ్యాణదుర్గ్ భవనం) ఆయనకు అచ్చిరాలేదంట. అందుకే ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఆయన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. పార్వతి నగర్లో అద్దెకు తీసుకున్న భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆ ఇంటి వాస్తే కారణమట! 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘువీరారెడ్డి మంత్రి పదవులు కూడా చేపట్టారు. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెద్ద భవంతిని నిర్మించారు. మహా నేత వైఎస్సార్ అకాల మరణం అనంతరం.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడగా ఆ సమయంలో జరిగిన పోరాటాలతో మంత్రిగా ఉన్న రఘువీరా ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పెనుకొండకు మకాం మార్చారు. అక్కడ ఘోరంగా ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్న ఆయన.. రాష్ట్రంలో ము ఖ్యమైన నేతలనూ కాపాడుకోలేకపోయారు. కేవలం వాస్తు సరిగాలేని ఇంట్లో ఉండటం వల్లే ఇవన్నీ జరిగాయని ఆయన భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు చుట్టపు చూపుగా కళ్యాణదుర్గం వచ్చి వెళ్లిన ఆయన... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. కళ్యాణదుర్గం భవనానికి వాస్తు సరిగా లేదని పార్వతి నగర్లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. అక్కడినుంచే ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. -
ఇన్పుట్ సబ్సిడీ రైతుల హక్కు
అనంతపురం సెంట్రల్ : ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదని, రైతుల హక్కు అనే విషయం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అనంతరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల డబ్బు వారికిచ్చే విషయంలోనూ ప్రచారం చేసుకునేందుకే ముఖ్యమంత్రి ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ అర్హత పత్రాల పేరిట ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను ముద్రించి కార్డులు అందజేయడం హాస్యాస్పదమన్నారు. ఒక్కో కార్డుకు రూ.10 చొప్పున జిల్లాలో 6లక్షల మందికి కార్డులు ఇచ్చేందుకు రూ.60లక్షలు దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం 2016 ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032 కోట్లు ఇస్తున్నారని.. అయితే గత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన వారికి రూ.4,087కోట్లు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన రైతులకే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇంతవరకు అర్హుల జాబితా ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అర్హులకు న్యాయం జరక్కపోతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. -
‘అగ్రి’ బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బృందం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షు డు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృం దం గురువారం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా అనంత పురం జిల్లా దుద్దేబండలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, నాయకులు మాదాసు గంగాధరం, ఎన్.తులసిరెడ్డి, సుందరరామ శర్మ తదితరులు ఉన్నారు. -
రేపు రహదారుల దిగ్బంధం: రఘువీరా
సాక్షి, అమరావతి/మడకశిర : హోదా ఇవ్వకుండా వంచించిన బీజేపీ, టీడీపీ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం ఓ ప్రకటనలో ప్రకటించారు. ఆ రెండు పార్టీలు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 18 నుంచి అక్టోబర్ 7 వరకు రిలే దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ గురువారం ర ఘువీరా మడకశిరలోని రాజీవ్‌గాంధీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
గొంతెందుకు మూగపోయింది బాబు?
సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ రఘువీరా ప్రశ్న సాక్షి, హైదరాబాద్/మడకశిర: ‘ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఎందుకు అడగలేకపోయారు?. చంద్రబాబు గొంతెందుకు మూగబోయింది?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో గురువారం ఆయన పార్టీ నేతలు కాసు వెంకటకృష్ణారెడ్డి, సాకె శైలజానాథ్, జంగా గౌతమ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. అలాగే అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో కూడా మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లతో ఆర్భాటం చేసిన చంద్రబాబు.. ప్రధాని మోదీ ముందు ‘సార్.. సార్..’ అంటూ సాగిలపడ్డారు తప్ప హోదా గురించి అడగలేదని మండిపడ్డారు. హోదాపై ప్రధాని ప్రకటన చేయనందున దీనికి నిరసనగా మోదీ, చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులకు నారా లోకేష్ సూచనలివ్వడానికి ఎవరని రఘువీరా సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించినట్లు లోకేష్ కూడా చేస్తున్నారా అని నిలదీశారు. -
నేరం కాంగ్రెస్‌పై నెట్టేస్తున్నాయి
♦ కాంగ్రెస్ నేతలు రఘువీరా, చిరంజీవి ♦ ఏపీకి రూ. 24,350 కోట్లు నిధులు ఇవ్వాలి తిరుపతి గాంధీరోడ్డు : రాష్ట్రాన్ని విడదీసేందుకు నాడు అన్ని పార్టీలు సంతకాలు పెట్టి, తామేమీ చేయలేదని ఇప్పుడు నేరం కాంగ్రెస్‌పై నె ట్టేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. శనివారం తిరుపతిలో ఏర్పా టు చేసిన పోరుసభలో వారు మాట్లాడా రు. నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కా వాలని గొంతు చించుకున్న నేతల ఆవే శం ఈ రోజు ఎక్కడికి పోయిందని ప్ర శ్నిం చారు. అధికారంలోకి వచ్చాక ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒక లాగా మా ట్లాడడం మంచిదికాదన్నారు. చంద్రబా బు మోదీ చేతిలో కీలుబొమ్మ లా మారారని విమర్శించారు. మాట్లాడితే డబ్బు లు లేవు, లేవని బాబు బీద అరుపులు అరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉ న్నంతవరకు రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాదన్నారు. బీజేపీ, టీడీపీలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలన్నారు. మోదీ ఒక మౌన ముని అని, ఏపీ గురిం చి నోరు మెదపకుండా దాటేస్తున్నారన్నా రు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రూ.24,350 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో దేశం పరువును కాపాడాల్సిన మోదీ దేశప్రతిష్టకు భంగం కలిగేలా మా ట్లాడుతున్నారన్నారు. ఇండియా స్కా మ్ల దేశమని, విదేశాల్లో ప్రచారం చేస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఎవ రు ముందు కు వస్తారని ప్రశ్నించారు. స్వచ్ఛభారత్ అని నెత్తిన తెల్ల టోపీ పెట్టుకుని, చేతిలో చీపుర పట్టుకుని ఒకరోజు ఊడ్చితే సరి పోతుందని ప్రశ్నించారు. బలి దానానికి సిద్ధపడిన మునికోటి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుని, రూ.2 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారు. ఆయనకు కావాల్సిన అన్నిరకాల వైద్య సేవలను చేయిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి అశోక్ సామ్రాట్ యాదవ్, నగర అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నయవంచక పాలన
- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కడప అగ్రికల్చర్ : రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నయవంచక, రాక్షసపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్నా విభజన చట్టంలో రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాలు అమలు చేయడం లో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ప్రజల కు ఇచ్చిన హామీలలో కనీసం ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం, ఆ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. ఉత్తరకోస్తా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఈ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయని విభజన చట్టంలో పేర్కొన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు. అందుకు తాము ఏమాత్రం తీసిపోమంటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమన్నారు. 13 జిల్లాల్లోని ప్రజలు విభజన చట్టంలోని అంశాలను హక్కుగా పొందేలా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాయలసీమ జిల్లాలకు నీరు రావాలంటే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు పూర్తి అయి దాని కింద ఉన్న ఉప కాలువలు నిర్మిస్తేనే సాగునీరు, తాగునీరు సాధ్యమవుతుందన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన జరగడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయనే సంగతిని రాష్ట్ర ముఖ్యమం త్రి మరిచిపోయారని, సొంత నిర్ణయాలు తీసుకోవడం అంతా తానే అనే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. రాజధాని నిర్మాణం మీ సొంత పార్టీ కార్యాలయ నిర్మాణమా? లేక మీ సొంత ఇంటి నిర్మాణమా? అని ప్రశ్నించారు. మాజీమంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ముఖ్యమంత్రి సమ దృష్టితో చూడడం లేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం కొట్టిన కొబ్బరికాయ రాయలసీమ ప్రజల గుండెలమీద కొట్టినట్లు ఉందన్నారు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి రాయలసీమలోని ఏ జిల్లా పనికి రా దో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. తుళ్లూరులోకి రహదారి కాదుకదా సైకిల్ వెళ్లడానికి కూడా దారి లేదని, అలాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కార్పొరేట్ వ్యాపారుల కోసమే రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి తీసుకెళ్లి గుంటూరులో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మాజీమంత్రి అహ్మదుల్లా, కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మ ద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడారు. -
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ
-
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ
* ‘రణభేరి’లో పీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం * హామీలపై 8వ తేదీలోగా జవాబు చెప్పాలని డిమాండ్ రాజమండ్రి సిటీ: ఏడాది పాలనలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రప్రజలను మోసగించాయని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీల ఏడాది పాలనపై తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శనివారమిక్కడి సుబ్రహ్మణ్య మైదానంలో కాంగ్రెస్ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని రఘువీరారెడ్డి నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 2018 నాటికి పోలవరం పూర్తి వంటి 600 వాగ్దానాలను ఎప్పటిలోగా అమలు చేస్తారో ఈనెల 8లోగా చెప్పాలని రఘువీరా కోరారు. లేనిపక్షంలో 9 నుంచి గడపగడపకూ వెళ్లి పాలకుల నిజస్వరూపాన్ని ఎండగడతామన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చట్టం చేయాల్సిన పనిలేదని, ఏచట్టం చేయకుండానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ సర్కారు ప్రకటించిందని ఆయన అన్నారు. మోసం, దగాకోరు వాగ్దానాలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లిచ్చి.. గుజరాత్‌కు రూ.60 వేలకోట్లు మంజూరు చేయడమే మోదీ పాలనంటూ దుయ్యబట్టారు. రిలయన్స్ సంస్థకోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలంలతోపాటు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు. 8న టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేయండి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏడాది నయవంచక పాలనకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీలను దహనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో వైఫల్యాలతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించడంలో విఫలమైన తీరును ఎక్కడికక్కడ ప్రజలకు వివరించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 8న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ యువజన, ఎన్ఎస్యూఐ, వివిధ అనుబంధ విభాగాల వారితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
పూర్వ వైభవానికి కాంగ్రెస్ పాట్లు
రాజధాని కేంద్రంగా ఉద్యమాల్లో పాల్గొంటున్న పీసీసీ చీఫ్ టీడీపీ దూకుడును అడ్డుకునేందుకు నెహ్రూ వ్యూహాలు నగరంలో పార్టీని బతికించుకునేందుకు మల్లాది విష్ణు తాపత్రయం సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని సాధిం చేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన తరువాత రెండు నెలలపాటు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు పది నెలలుగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్యక్రమాలు చేశారు. విజయవాడలో జరిగే ప్రతి ఆందోళనలోనూ పీసీసీ చీఫ్ రఘువీరా ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా పాల్గొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మహిళలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ఇక ఏఐటీయూసీ, సీఐటీయూ నిర్వహించే ఆందోళనా కార్యక్రమాల్లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు పాల్గొని వారి పోరాటాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాపత్రయపడుతున్నారు. మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు పాలకమండలి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నమే చేసింది. ఇక జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రభుత్వ ధనం దుర్వినియోగం, ప్రభుత్వ ధనాన్ని దోచుకునేం దుకు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ పలుమార్లు ధ్వజమెత్తారు. నెహ్రూ ప్రెస్మీట్లలో చేసిన వ్యాఖ్యలపై కాని, సభల్లో చేసిన ఆరోపణలపై మంత్రి ఉమా మాట్లాడిన దాఖలు లేవు. నియోజకవర్గాలపై పట్టు విజయవాడలో దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌లు తూర్పు నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కింకుకునేందుకు కడియాల బుచ్చిబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బుచ్చిబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులు కాగా విష్ణు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. -
కాంగ్రెస్ ఓ మహాసముద్రం
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదని కేంద్ర మంత్రి చిరంజీవి అభివర్ణించారు. కుళ్లూ, చెత్తా ఒడ్డుకు చేరుకుంటాయని, సముద్రం మాత్రం పవిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేశాయనీ, నిజాలు అందరికీ తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. బస్సుయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు గుంటూరు జీటీ రోడ్డులోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతరానికి అవకాశం ఇస్తుందనీ, యువత వినియోగించుకోవాలని సూచించారు. నిఖార్సయిన వాడ్ని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. తాను నికార్సయిన వ్యక్తిని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చిరంజీవి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బీసీలు, దళితులను ముఖ్యమంత్రులనుచేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే అందరికీ సమానావకాశాలుంటాయని, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే విభజన సాకుతో పార్టీని ఎక్కువగా బలహీన పరచారని, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్టాలిన్ సినిమాలోని డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తప్పులేదని చెప్పండి.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన పనులను ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్సార్ సీపీలు ఇచ్చిన లేఖల ప్రతులను చూపించారు. వాటిని ఇంటింటికీ చూపించి విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదనే విషయాన్ని వివరించాలని కార్యకర్తలను కోరారు. గుంటూరు మిర్చి ఘాటు, పల్నాటి పౌరుషాన్ని చూపించి ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం బలహీనపడినట్లేనన్నారు. బడా వ్యాపారవేత్తలు పార్టీ ముసుగులు ధరించి వస్తున్నారని, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దని కోరారు. కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీతో చంద్రబాబు జతకట్టారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.వ్యాపారులను టీడీపీలోకి చేర్చుకోవడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ నడుతున్నారా వ్యాపార సంస్థ నడుపుతున్నారా అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సందిగ్ధంలో ఉన్న తాను తన కుమార్తె ఇచ్చిన నైతిక స్థైర్యంతో స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కొండ్రు ముర ళి, ఎమ్మెల్సీలు సింగం బసవపున్నయ్య, మహమ్మద్ జానీ, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'పీసీసీ చీఫ్ అన్నది పదవి కాదు...బాధ్యత'
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ అన్నది తాను పదవిగా భావించటంలేదని, బాధ్యతగా అనుకుంటానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు... ఎన్నికల సమయంలో పార్టీని వీడారన్నారు. పార్టీని వీడుతున్నవారు ఒకసారి పునరాలోచన చేయాల్సిందిగా రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనుక్షణం తన బాధ్యతను గుర్తెరిగి పని చేస్తానని ఆయన తెలిపారు. పార్టీలో ఇంకా మిగిలి ఉన్న నిజాయితీగల కార్యకర్తల సహకారంతో కలిసి పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తానని అధిష్టానంతో చెప్పానన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమైనదని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని బిల్లులో చేర్చడం జరిగిందన్నారు. కాగా ఆంధ్రపద్రేశ్‌కు తొలి పీసీసీ అధ్యక్షుడుగా నియమించినందుకు రఘువీరారారెడ్డి ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రెస్‌మీట్‌ను హోటల్లో నిర్వహించినట్లు ఆయన తెలిపారు.