పెండింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ పడేనా
Published Wed, Feb 12 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
సాక్షి, గుంటూరు :ఆదాయంలో గణనీయ ప్రగతి సాధించిన గుంటూరు రైల్వే డివిజన్ ప్రజాకర్షక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనుకబడింది. 2003లో ఏర్పాటైన గుంటూరు డివిజన్‌కు అడపాదడపా ఒకటో, రెండో కొత్త రైళ్లు వస్తున్నప్పటికీ ప్రధాన రైల్వే మార్గాల డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించడం లేదు. రైల్వేస్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సదుపాయాల కల్పన వంటి పనులన్నీ మంద గిస్తున్నాయి.
= గుంటూరు- తెనాలి మధ్య 24.7 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే మార్గానికి డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. పనులను త్వరితగతిన పూర్తి చేయించే విషయంలో అధికారులు అలసత్వాన్ని కనబరుస్తున్నారు. ఈ పనులు త్వరగా పూర్తయితే చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, ముంబయి వంటి సుదూర పట్టణాలకు నేరుగా వెళ్లే వీలుంటుంది.
= గుంటూరు స్టేషన్‌లో రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రెండో పిట్‌లైన్ పనులు నెలల తరబడి సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే మరికొన్ని రైళ్లు గుంటూరు మీదుగా వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
= గుంటూరు రైల్వే డివిజన్‌లో ప్రధాన రైల్వే మార్గమైన గుంటూరు-సికింద్రాబాద్ రూట్‌ను అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్పుచేయడం, విద్యుదీకరణ మార్గంగా మార్చడం కోసం ఆరేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పనులు పూర్తయితే సికింద్రాబాద్ వయా ఖాజీపేట మీదుగా విజయవాడ వెళ్లే కొన్ని రైళ్లను నడికుడి లైనులోకి మళ్లించే వీలుంటుంది.
= నడికుడి -శ్రీకాళహస్తి మధ్య (282 కి.మీ) కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించాలన్న దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనలు సర్వే దశలోనే ఆగిపోయాయి. దీని కోసం కిందటి బడ్జెట్‌లో రూ.4 కోట్ల వరకు కేటాయింపులు జరిపినా
= ఆయా నిధులు సర్వేలు, భూసేకరణలకు సరిపోయాయి. అదేవిధంగా మాచర్ల-నల్లగొండ, జాన్‌పహాడ్-మేళ్లచెర్వుల మధ్య కొత్త మార్గాల నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులే జరగడం లేదు.
= గుంటూరు-తెనాలి, గుంటూరు-గుంతకల్లు, గుంటూరు-బీబీనగర్ మార్గాలన్నీ సింగిల్ లైన్లుగానే ఉన్నాయి. డబ్లింగ్ పను లు పూర్తయితేనే విద్యుదీకరణ పనులు కూ డా జరుగుతాయి. ప్రధాన మార్గాల్లో ఈ పనులేమీ జరగకపోవడంతో గుంటూరు-నడికుడి, గుంటూరు-గుంతకల్లు మార్గా ల్లో అరకొరగా రైళ్లు తిరుగుతున్నాయి.
Advertisement
Advertisement