పింఛన్ పోయింది.. ఊపిరి ఆగింది
ఎమ్మిగనూరు: వృద్ధాప్య పింఛన్ తొలగింపు నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఏనుగుబాలకు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ(70) మనస్తాపంతో బుధవారం రాత్రి తనువు చాలిం చింది. మృతురాలి కుమార్తెలు లలి తమ్మ, రాఘమ్మలు తెలిపిన మేరకు.. రూ. 30 పింఛన్ ఉన్నప్పటి నుంచి లక్ష్మమ్మ లబ్ధిదారుగా ఉంది.
అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఏరివేతలో ఈమెను అనర్హురాలుగా ప్రకటించారు. గత సోమవారం నిర్వహించిన జన్మభూమి సభలోనూ పింఛన్ పునరుద్ధరించాలని అధికారుల ఎదుట తన గోడు వినిపించింది. రీసర్వే చేయిస్తామని సర్దిచెప్పడంతో వెనుదిరిగింది. గత మూడు రోజులుగా ఇదే విషయమై మనస్తాపం చెందుతున్న లక్ష్మమ్మ బుధవారం రాత్రి నిద్రలోనే మరణించింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. ప్రస్తుతం లలితమ్మ వద్ద ఉంటోంది.