Laksmamma
-
లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం!
సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత బాలాంత్రపు రజనీకాంతరావు గారు అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ పరిజ్ఞానం ఉన్న అరుదైన ప్రతిభావంతులు. చక్కటి స్వరకర్తే కాక, మంచి కవి, గాయకుడు కూడా! నేను సినిమాల్లో నటిస్తూ, మీర్జాపురం రాజా వారు శోభనాచల పతాకంపై సినిమాలు తీస్తూ ఉన్న సమయంలోనే ఆయన సినిమాల్లో గీత రచన, సంగీతం ప్రారంభించారు. అప్పటికే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారనుకుంటా. అందుకే, టైటిల్స్‌లో వేరే పేరు వేసేవారు. రజని రాసి, వరుస కట్టగా ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట అందరికీ తెలిసిందే. ఇక ఎల్వీ ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహప్రవేశం’ చిత్రానికైతే పాటలు, సంగీతం పూర్తిగా ఆయనవే. నా చిత్రాల్లో రజనీ గారి సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన చిత్రాలు ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’. లక్ష్మమ్మ’ చిత్ర నిర్మాణం ఒక పెద్ద కథ. రజనీకాంతరావు, రచయిత-దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ చాలా సన్నిహితులు. గోపీచంద్ గారు ‘లక్ష్మమ్మ’ స్క్రిప్టు మాత్రమే కాకుండా, పాటలు-వాటి వరుసలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, మద్రాసులో మా బంగళాకు వచ్చారు. స్క్రిప్టు, పాటలు వినిపించారు. పాటలు, వరుసలు - రజనీకాంతరావు గారివి. ఆ లక్ష్మమ్మ పాత్రకు నేను బాగుంటాననీ, నన్ను చేయమనీ గోపీచంద్ అడిగారు. అలాగే అనుకున్నాం. తరువాత చాలా కథ జరిగి, పలువురి చేతులు మారినా, చివరకు ప్రాజెక్ట్ నా దగ్గరకే వచ్చింది. చిత్ర నిర్మాణమూ మేమే చేపట్టాం. తీరా అదే సమయంలో జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథ అయిన లక్ష్మమ్మ కథతోనే, అక్కినేని, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నిర్మించ తలపెట్టారు. మా ‘లక్ష్మమ్మ’, వాళ్ళ ‘లక్ష్మమ్మ కథ’ ఒకే రోజు షూటింగ్ మొదలై, అనేక సంచలనాల మధ్య ఒకే రోజు విడుదలయ్యాయి. మాది హిట్టయ్యింది. ‘లక్ష్మమ్మ’ పాటలు రజనీ రాసి, వరసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్లుగా రికార్డింగ్ చేసింది ఘంటసాల. అందుకే, టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరే ఉంటుంది. రజనీ గారి సాహిత్యం ఎంత సులభంగా, సహజంగా ఉంటుందంటే... ‘లక్ష్మమ్మ’లో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా, లక్ష్మమ్మ పాత్ర అత్తవారింటికి పల్లకీలో వెళ్ళే సందర్భంలో వచ్చే ‘చిన్ననాటి స్వప్నసీమ... కన్న ఊరు విడువలేము...’ పాట నాకు మరీ మరీ ఇష్టం. ఆయన వరుసల్లో నా పాటలన్నీ నేనే పాడుకున్నా. అలాగే, ఆ తరువాత విజయలక్ష్మీ బ్యానర్‌పై మేమే నిర్మించిన ‘పేరంటాలు’కు కూడా గోపీచంద్ దర్శకుడు. రజనీ పాటలు రాశారు. అందులోనూ పాటలు పాడాను. ఇప్పుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, కాలం వెనక్కి వెళ్ళినట్లుంది. -
పింఛన్ పోయింది.. ఊపిరి ఆగింది
ఎమ్మిగనూరు: వృద్ధాప్య పింఛన్ తొలగింపు నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఏనుగుబాలకు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ(70) మనస్తాపంతో బుధవారం రాత్రి తనువు చాలిం చింది. మృతురాలి కుమార్తెలు లలి తమ్మ, రాఘమ్మలు తెలిపిన మేరకు.. రూ. 30 పింఛన్ ఉన్నప్పటి నుంచి లక్ష్మమ్మ లబ్ధిదారుగా ఉంది. అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఏరివేతలో ఈమెను అనర్హురాలుగా ప్రకటించారు. గత సోమవారం నిర్వహించిన జన్మభూమి సభలోనూ పింఛన్ పునరుద్ధరించాలని అధికారుల ఎదుట తన గోడు వినిపించింది. రీసర్వే చేయిస్తామని సర్దిచెప్పడంతో వెనుదిరిగింది. గత మూడు రోజులుగా ఇదే విషయమై మనస్తాపం చెందుతున్న లక్ష్మమ్మ బుధవారం రాత్రి నిద్రలోనే మరణించింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. ప్రస్తుతం లలితమ్మ వద్ద ఉంటోంది. -
నాకు నువ్వు..నీకు నేను!
కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన వారిరువురినీ ఒంటరి జీవితం వేధించింది. భార్య దూరమై ఒకరు.. భర్తను కోల్పోయి మరొకరు మానసికంగా కుంగిపోయారు. ఇరువురికీ కూతుళ్లే సంతానం కావడంతో వారి పెళ్లిళ్లతో వీరి బాగోగులు చూసుకునే తోడు లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువుల అంగీకారంతో వారి బంధానికి మూడుముళ్లు పడ్డాయి.శనివారం కోదండరాముడు సాక్షిగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సుబ్బరంగయ్య(65), సుబ్బలక్ష్మమ్మ(55)లు ఒక్కటయ్యారు. స్థానిక అమ్మవారిశాల వీధికి చెందిన రంగయ్యకు ఇద్దరు కూతుళ్లు . ఇరువురికీ వివాహాలు చేసి అత్తగారిళ్లకు పంపేశాడు. ముప్పై ఏళ్ల కిందట భార్య మృతి చెందడంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కంబగిరి వీధికి చెందిన లక్ష్మమ్మ భర్త 20 ఏళ్ల క్రితం మరణించాడు. ఈమెకు ఒక కూతురు సంతానం కాగా.. పదేళ్ల క్రితం వివాహం చేసేసింది. ప్రస్తుతం ఈమె కూడా ఒంటరే. రంగయ్య శనగలను కొనుగోలు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తుండగా.. వాటిని పప్పులుగా మార్చే మిల్లులో సుబ్బలక్ష్మమ్మ కూలీగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం వీరికి పరిచయం ఏర్పడింది. అభిప్రాయాలూ కలిసాయి. ఇందుకు రంగయ్య కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కానప్పటికీ.. లక్ష్మమ్మ అల్లుడు ససేమిరా అన్నాడు. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు బలంగా నిర్ణయించుకోవడంతో పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులందరినీ సమావేశపర్చి అంగీకరింపజేశారు. ఈ మేరకు శనివారం వీరిద్దరూ లేటు వయస్సులో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున దేవాలయం వద్దకు చేరుకుని వెటరన్ వధూవరులను ఆశీర్వదించారు. -
భర్తను చంపిన భార్య
వె ల్దుర్తి, న్యూస్‌లైన్:భర్తను భార్యే చంపిన ఘటన మండలంలో సంచలనమైంది. కలుగొట్ల గ్రామంలో బోయ కేశన్న(45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్.బండ గ్రామానికి చెందిన కేశన్నతో కలుగొట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వ్యవసాయంపై జీవిస్తూ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. అన్యోనంగా ఉన్న వీరి దాంపత్యంలో కొంత కాలంగా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. తరచూ ఇద్దరూ ఘర్షణ పడేవారు. వారం రోజుల క్రితం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో లక్ష్మమ్మ పుట్టింటికి వెళ్లింది. భార్యను పిలుచుకొచ్చేందుకు కేశన్న మంగళవారం కలుగొట్ల గ్రామానికి చేరుకున్నాడు. కాపురానికి రానని ఆమె తేల్చి చెప్పడంతో తిరిగి వెళ్తున్న ఆయనను భార్యతో పాటు మరదలు రాములక్క ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం తెల్లారేసరికి కేశన్న హత్యకు గురయ్యాడు. అయితే భోజనం చేసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో అక్కాచెల్లెలు ఇద్దరూ కలిసి రోకలిబండతో అతని తలపై బలంగా దాడి చేసి గుండెపై పలుమార్లు కొట్టడంతో అక్కడి అక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ ధనుంజయ గ్రామానికి చేరుకుని హత్య ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే గ్రామస్తులను, కుటుంబసభ్యులను విచారించారు. హత్య చేసిన లక్ష్మమ్మ, రాములక్కను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపడుతామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.