సాక్షి, కాకినాడ : లక్షలాది సామా న్యులకు ఆధార్ గుబులు మళ్లీ మొదలైంది. అన్ని సంక్షేమ పథకాల్నీ ఆధార్‌తో అనుసంధానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో చెప్పులరిగేలా తిరుగుతున్నా ఆధార్ నంబర్లు జనరేట్ కాని వారిని ప్రభుత్వం ఇచ్చే లబ్ధికి ఎక్కడ దూరమై పోతామోనన్న గుబులు వెన్నాడుతోంది.
సంక్షేమ పథకాలకు ఆధార్‌తో లంకె పెట్టవద్దన్న సుప్రీం కోర్టు తీర్పు తమకు వర్తించదన్న రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలకూ ఆధార్‌ను వర్తింప చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచే పథకాల్ని ఆధార్‌తో అనుసంధానించాలని ప్రయత్నిస్తోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 51,51,549 మంది ఉండగా, ఇప్పటికే 56,77,024 మంది ఆధార్ నమోదు చేసుకున్నారని, వీరిలో 50,09,356 మందికి ఆధార్ నంబర్లు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు లెక్కలేస్తున్నారు. జనాభా లెక్కన చూస్తే ఇంకా 1,42,195 మందికి, ఆధార్ నమోదు లెక్కన 6,67,668 మందికి ఆధార్ నంబర్ జనరేట్ కాలేదు. పొంతనలేని ఈ లెక్కల మాటెలా ఉన్నా జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల వారీ ఆధార్ సీడింగ్ పరిస్థితి ఈ విధంగా ఉంది.
ఉపాధి కూలీలు...
జిల్లాలో7.10 లక్షల జాబ్‌కార్డుల పరిధిలో 14.29 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. 25,987 శ్రమశక్తి సంఘాలుండగా, వాటిలో 5.12లక్షల మంది కూలీలున్నారు. 14.29 లక్షల కూలీల్లో క్రమం తప్పకుండా ఉపాధి పొందే వారు 7.46 లక్షలమంది కాగా, వీరిలో ఇప్పటి వరకు యూఐడీ నంబర్లు జనరేట్ అయిన 6.52 లక్షల మందికి మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఉపాధి పొందుతున్న కూలీల లెక్కన చూస్తే 87 శాతం మాత్రమే ఇప్పటి వరకు సీడింగ్ పూర్తి కాగా, మొత్తం కూలీల సంఖ్యను బట్టి ఇంకా 50 శాతం కూడా కాలేదు.
గ్యాస్ కనెక్షన్లు..
జిల్లాలోని 9,14,840 గ్యాస్ కనెక్షన్లలో ఇప్పటి వరకు 8,80,894 ఆధార్‌తో అనుసంధానం కాగా, అకౌంట్ సీడింగ్ మాత్రం 8,19,839 కనెక్షన్లకు మాత్రమే పూర్తయింది. 6,53,438 హెచ్‌పీసీఎల్ కనెక్షన్లలో 6,27,065 కనెక్షన్లకు ఆధార్, 5,81,534 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తయింది. ఐఓసీఎల్‌లో 1,34,451 కనెక్షన్లకు 1,29,371 కనెక్షన్లకు ఆధార్, 1,18,753 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ జరిగింది. బీపీసీఎల్‌లో 1,26,951 కనెక్షన్లకు 1,24,458 కనెక్షన్లకు ఆధార్, 1,19,552 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తయింది. అంటే సగటు 89 శాతం మాత్రమే అకౌంట్ సీడింగ్ పూర్తయింది.
సామాజిక పింఛన్లు..
జిల్లాలో 4,62,816 పింఛనుదారులుండగా ఇప్పటి వరకు 4,11,730 మందికి మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. మరో 51,086 మందికి సీడింగ్ జరగక గత నాలుగు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపివేశారు.
రేషన్‌కార్డులు..
జిల్లాలో తెలుపు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలకు సంబంధించి 15,20,021 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 44,59,716 యూనిట్లు (కుటుంబసభ్యుల సంఖ్య) ఉంటే ఇంకా 2,23,501 యూనిట్లకు సంబంధించి సీడింగ్ కాలేదు.
విద్యుత్ కనెక్షన్లు..
జిల్లాలోని 14,18,318 విద్యుత్ కనెక్షన్లలో 12,26,926 గృహ వినియోగ, 1,15,375 కమర్షియల్, 9,037 పారిశ్రామిక కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం ఉ న్న కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ ఇంకా చేపట్టలేదు. ఇవే కాకా సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్సుమెంట్ పొందే విద్యార్థులకు సంబంధించి 85 శాతానికి మించి సీడింగ్ జరగలేదు.
మనశ్శాంతికి మళ్లీ ఎసరు..
Published Sat, Aug 23 2014 1:17 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement