
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'
గుంటూరు:తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు. కొంతమంది టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులో మాట్లాడానని తెలిపారు.
తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని ఆయన సూచించారు.