pinelli Ramakrishna Reddy
-
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధనరెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజు నియమితులయ్యారు.నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయ్యారు.కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్సీపీ -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ఒకే రోజున దాడి జరగడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీజీపీతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయంపై డీజీపీకి ఫోన్ చేసిన ఆయన ప్రజా జీవనానికి భంగం కలిగించే ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు కాగా, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ మీడియాకు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలిందన్నారు. నిరసన పేరుతో దాడులకు దిగితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు..!
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యగా ఆయన వర్ణించారు. పిన్నెల్లిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని టీడీపీ భావిస్తోందని విమర్శించారు. ప్రణాళికా ప్రకారమే టీడీపీ గుండాలు ఈ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) చంద్రబాబుకు చెందిన రౌడీలే పిన్నెల్లి పై దాడి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్టాడుతూ.. ‘రాజధానిలో ఎమ్మెల్యేలు పర్యటిస్తే దాడులు చేస్తారా?. విధ్వంసం సృష్టించి అల్లర్లు చేయించాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది అని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేలను పర్యటించనివ్వరా..? చంద్రబాబు గుండాలు రైతుల ముసుగులో దాడులు చేశారు. రైతులు ఎవ్వరైనా రాళ్లు విసిరి, గన్మ్యాన్లను కొడతారా. ఇలాంటి దాడులను ప్రభుత్వం ఉపేక్షించదు. చంద్రబాబు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాయలసీమ ప్రజలు నీళ్లు, ఉపాధి కోరుతున్నారు. ముందు చూపుతో సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'
గుంటూరు:తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు. కొంతమంది టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులో మాట్లాడానని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని ఆయన సూచించారు. -
'టీడీపీ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు'
గుంటూరు: సరస్వతి సిమెంట్ భూములను టీడీపీ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ భూములు పూర్తిగా కొనుగొలు చేసిన రిజిస్టర్ భూములని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ రేటుకు నాలుగురెట్లు అధికంగా డబ్బులిచ్చి భూములు కొనుగోలు చేశామన్నారు. ఆ భూముల్లో టీడీపీ కార్యకర్తలతు సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ వాళ్లపై దాడి చేశారని చెప్పారు. ఇప్పుడు బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమేత్తారు. -
పీఆర్కే హ్యాట్రిక్ విజయం
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్ :మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించారు. నియోజకవర్గ చరిత్రలో పీఆర్కే మినహా ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. దానిని అధిగమిస్తూ 2012లో జరిగిన ఉపఎన్నికల్లో పీఆర్కే రెండోసారి గెలిచి నియోజకవర్గంలో ఎవరికైనా ఒకేచాన్స్ అన్న సెంటిమెంట్‌ను అధిగమించారు. మూడోసారి ముచ్చటగా ఈ ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికై పీఆర్కే చరిత్రను తిరగరాశారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పీఆర్కే 2006లో వెల్దుర్తి మండలం నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అప్పటినుంచి ఈ పుష్కరకాలంలో ఆయన అపజయమనేది లేకుండా దూసుకుపోతున్నారు. మొదట 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోటీచేసి 9,700 ఓట్లతో విజయం సాధించారు. 2012లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అధికార పార్టీ నిర్ణయానికి భిన్నంగా వైఎస్ జగన్‌కు మద్దతు పలికి అనర్హతవేటుకు గురయ్యారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పీఆర్కే పోటీచేసి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధుబాబుపై 16వేల ఓట్లపైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. మూడోసారి ముచ్చటగా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసిన పీఆర్కే సమీప టీడీపీ ప్రత్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3,378 ఓట్లతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు తన వైపే ఉన్నాయని ఈ ఎన్నిక ద్వారా పీఆర్కే నిరూపించారు. -
పిన్నెల్లి వాహనంపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి
-
పిన్నెల్లి వాహనంపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి
గుంటూరు: ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. ఓటమి తప్పదన్న నిస్పృహతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగులకుంటలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాచర్ల అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, చిలకలూరిపేట రజక కాలనీలో పోలీసులపై దాడి చేసిన నలుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.