ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. ఓటమి తప్పదన్న నిస్పృహతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగులకుంటలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాచర్ల అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, చిలకలూరిపేట రజక కాలనీలో పోలీసులపై దాడి చేసిన నలుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.