
'టీడీపీ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు'
గుంటూరు: సరస్వతి సిమెంట్ భూములను టీడీపీ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ భూములు పూర్తిగా కొనుగొలు చేసిన రిజిస్టర్ భూములని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ రేటుకు నాలుగురెట్లు అధికంగా డబ్బులిచ్చి భూములు కొనుగోలు చేశామన్నారు. ఆ భూముల్లో టీడీపీ కార్యకర్తలతు సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ వాళ్లపై దాడి చేశారని చెప్పారు.
ఇప్పుడు బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమేత్తారు.