ఏలూరు: మంత్రి పితాని సత్యనారాయణ కాన్వాయ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఏలూరు హైవేపై వెళుతున్న పితాని కాన్వాయ్ ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సెక్యురిటీ సిబ్బందికి గాయాలైయ్యాయి.మంత్రి పితాని సత్యనారాయణ గన్నవరం విమానశ్రయంలో దిగి కొమ్ముచిక్కాల గ్రామానికి వెళుతుండగా కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఒకటి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు సెక్యురిటీ గాయాలైయ్యాయి. వారిని ఆశ్రమ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.