సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతాయని సాగునీటి శాఖ గుర్తించిన 205 గ్రామాల (134 రెవెన్యూ గ్రామాలు)తో పాటు మరో మూడు గ్రామాలు కలిపి మొత్తం 208 గ్రామాలను తెలంగాణ నుంచి మినహాయిస్తున్నట్లు మంగళవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లులో పేర్కొన్నారు.
పోలవరం కడితే మునిగిపోతాయని సాగునీటి శాఖ 2005 జూన్ 27న విడుదల చేసిన జీవోనెం.111లో గుర్తించిన 205 గ్రామాలతో పాటు బూర్గంపాడు మండల పరిధిలోకి వచ్చే సీతారాంనగరం, బూర్గం పాడు, కొండ్రెక గ్రామాలను సీమాంధ్రలో కలుపుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఇన్నాళ్లూ ముంపు ప్రాంతాలు కూడా తెలంగాణలోనే ఉంటాయనే జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లినట్లయింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆదివాసీ సంఘాలు, తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని కనుమరుగు చేయడంతో పాటు లక్షలాది ఎకరాల అటవీ భూములను గోదావరిలో ముంచొద్దని తాము చేస్తున్న పోరాటాలను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తాము ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మరో 18 గ్రామాల పరిస్థితేంటి?
అయితే, పోలవరం రికార్డుల్లో 205 గ్రామాలనే పేర్కొన్నా వాటితో పాటు మరో 18 గ్రామాలు ఖచ్చితంగా ముంపునకు గురవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం లేకపోయినా... కూనవరం మండలంలోని ముల్లూరు,భీమవరం, లేళ్లవాయి, లక్ష్మిపురం, కొండ్రాజ్‌పేట,కొత్తూరు ,శ్రీరాంపురం,చినార్కూరు, కరకగూడెం,పొట్లవాయిగూడెం,పైదిగూడెం,రేపాకకాలని,నర్సింగపేట, చింతూరు మండలంలోని నర్శింగపేట, వీఆర్‌పురం మండలంలోని చిరుగువాడ,భొవనగిరి,జల్లివారిగూడెం ,శబరిరాయిగూడెం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మరి, ఈ గ్రామాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న సర్వత్రా వస్తోంది.
మండలాల్లో మార్పులేదు
తొలుత పేర్కొన్న విధంగా జిల్లాలోని నాలుగు మండలాలు పూర్తిగా మునిగిపోతాయని, ఆ నాలుగు మండలాలు జిల్లా చిత్ర పటం నుంచి వెళ్లిపోతాయని అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాకు చెందిన ఏ ఒక్క మండలం కూడా పూర్తిగా ముంపునకు గురికావడం లేదు. అయితే, గ్రామం ఉంటే పొలాలు, పొలాలుంటే గ్రామా లు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలు యథాతథంగా ఉంటాయని, ముంపునకు పోను మిగిలిన గ్రామాలతో మండలాలు కొనసాగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నా... తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, జిల్లాలోని పంచాయతీలలో 208పంచాయతీలు తగ్గుతాయని భావిస్తున్నారు.
జీవోనెం.111 ప్రకారం పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలివే.....
భద్రాచలం మండలం...13 గ్రామాలు
రాచగొంపల్లి, గౌరిదేవిపేట, నందిగామ, నందిగామపాడు, మురుమూరు, గొమ్ముమురుమురు, కాపవరం, టిపివీడు, గోగుబాక, గొమ్ముకొత్తగూడెం, గొమ్ముకోయగూడెం, గొల్లగూడెం, సీతాపురం
కూనవరం మండలం.....48 గ్రామాలు
చినపోలిపాక ,పెదపోలిపాక, గుండువారిగూడెం,పోచవరం,పోచవరం కాలనీ, కాచవరం,దూగుట్ట, కూళ్ళపాడు, టేకుబాక, వెంకటాయిపాలెం, కోట్లవాయి, గొమ్ముయ్యవారిగూడెం, పెదనర్సింగపేట,చిననర్సింగ పేట, కరకగూడెం, అయ్యవారిగూడెం,కొండాయిగూడెం,గొమ్ముగూడెం,కుమారస్వామిగూడెం,మర్రిగూడెం, పల్లూరు, జగ్గవరం, జగ్గవరం కాలని, చూచిరేవులగూడెం, చూచిరేవుల,కూనవరం, టేకులబోరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, జిన్నెలగూడెం,బండారుగూడెం,పెదార్కూరు,రేపాక,ముసురగూడెం, భగవాన్ పురం, ముల్లూరు, కూటూరు,అభిచర్ల,లింగాపురం,కొడేరు,తాళ్ళగూడెం,బొజ్జరాజుగూడెం, రేగులపాడు, రావిగూడెం, వెంకన్నగూడెం,పండ్రాజ్‌పల్లి, శబరికొత్తగూడెం,వాల్ఫర్డ్‌పేట.
చింతూరు... 17 గ్రామాలు
చింతూరు, చిడుమూరు, వీరాపురం, చట్టి, కుమ్మూరు, బండారుగూడెం, గొర్రెల గూడెం, మామిళ్లగూడెం, కల్లేరు, కుయిగూరు, చూటూ రు, ముకునూరు, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, జల్లివారిగూడెం, ఉలుమూరు, మల్లెతోట.
వీఆర్‌పురం...45 గ్రామాలు
చొప్పలి, రామవరం, రామవరంపాడు,సోములగూడెం,కొప్పల్లి, రావిగూడెం, బోరిగూడెం, అడవి వెంకన్నగూడెం,ప్రత్తిపాక,తుష్టివారిగూడెం, గుండుగూడెం,చింతవేవుపల్లి, కన్నాయగూడెం, సున్నంవారిగూడెం,నూతిగూడెం,మిట్టిగూడెం,ఉమ్మిడివరం,గుర్రంపేట,అన్నవరం, రేఖపల్లి, వడ్డిగూడెం,ధర్మతాళ్ళగూడెం, వీఆర్‌పురం,తోటపల్లి,రాజుపేట,రాజుపేటకాలని,సీతంపేట,శ్రీరామగిరి, చొక్కనపల్లి, కొత్తూరు,కల్తునూరు,జీడిగుప్ప,ఇసునూరు, రావిగూడెం, ములకపల్లి,ముత్యాలమ్మగండి, భీమవరం, ఇప్పూరు,కొత్తూరుగొమ్ము,పోచవరం, తుమ్మిలేరు,కొండేపూడి, కొల్లూరు,గొందూరు,నర్సింగపేట.
బూర్గంపాడు మండలం: 9 గ్రామాలు
శ్రీధర, వెలేరు, రాయిగూడెం, వెంకటాపురం, అల్లిగూడెం, బోనగిరి, గుంపెనపల్లి, ఇబ్రహీం పేట, గణపవరం, (ప్రస్తుతం లోక్‌సభ ఆమో దం పొందిన బిల్లు ప్రకారం ఇదే మండలంలోని సీతారాంనగరం, కొండెరక, బూర్గంపా డు గ్రామాలు కూడా ఈ జాబితాలో చేరతాయి.)
కుక్కునూరు మండలం.. 34 గ్రామాలు
తొండిపాక,మెట్టగుడెం,బంజరగుడెం,అమరవరం,కోమట్లగుడెం, ఉప్పేరు, కొయ్యగుడెం, రెడ్డిగుడెం, దామరచర్ల,ఎల్లప్పగుడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాధవరం, కౌడిన్యముక్తి, వింజరం, ముత్యాలమ్మపాడు, కొండపల్లి, కోయగుడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగుడెం, కుక్కునూరు, రామసింగారం, కిష్టారం, కుర్లపాడు, లంకాలపల్లి,ఇసుకపాడు, దాచవరం, బెస్తగుడెం, ఉప్పరమద్దిగట్ల, సీతారామచంద్రపురం, కొత్తూరు, గొమ్ముగుడెం.
వేలేరుపాడు మండలం: 39 గ్రామాలు
రుద్రమకోట, పాతపూచిరాల, పూచిరాలకాలనీ, లచ్చిగుడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగుడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపురం, జగన్నాధపురం, చాగరపల్లి, కొర్రాజులగుడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరంకాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, కట్కూరు, టేకూరు, కాచారం, కొయిదా, తాళ్ళగొంది, పూసుగొంది, టేకుపల్లి,పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, సిద్దారం, చింతలపాడు, పడమటిమెట్ట, బుర్రతోగు, తూర్పుమెట్ట, కాకిస్‌నూరు.
తెగిన బంధం...
Published Wed, Feb 19 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement