సాక్షి, విజయవాడ : జీవో 35ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు తమ ఆందోళనను ముమ్మరం చేశారు. జీవో 35 రద్దు చేయాలని, తమకు కనీసం వేతనం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పాలిక్లీనిక్ రోడ్ సమీపంలో రహదారి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ.. అధ్యాపకులతో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా వారిని అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పార్ట్‌టైం అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం
పార్ట్‌టైం పేరుతో పూర్తి సమయం పనిచేయించుకుంటూ తమ శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మపోరాటం కార్యక్రమం రెండోరోజుకు చేరుకుంది. రెండోరోజు ధర్నాకు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment