‘జీ 24 గంటలు’పై మరో కేసు | Police Case Registered against Zee 24 Hrs News Channel | Sakshi
Sakshi News home page

‘జీ 24 గంటలు’పై మరో కేసు

Published Mon, Sep 16 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Police Case Registered against Zee 24 Hrs News Channel

సాక్షి, హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి మతగురువు హజ్రత్ హబీబ్ ముజ్‌తబా అల్ హైద్రూస్‌ను కలవడానికి సంబంధించి ప్రసారం చేసిన కథనాల విషయంలో ‘జీ 24 గంటలు’ చానల్‌పై ఆదివారం నాంపల్లి ఠాణాలో మరో కేసు నమోదైంది. ఆ చానల్ కథనాలు హైద్రూస్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండటమేగాక ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఏసీగార్డ్స్ నివాసి సమీఉద్దీన్ అహ్మద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జీ 24 గంటలు చానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై అరెస్ట్ చేసిన చానల్ విలేకర్లు రవికుమార్, అక్తర్‌లను హుస్సేనీఆలం పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరినీ నాంపల్లి సీఎంఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 13 రోజుల రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు.
 
 జర్నలిస్టులను విడుదల చే యాలి: ఏపీడబ్ల్యూజేఏఫ్
  డీజీపీకి సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేశారనే సాకుతో పోలీసులు జీ-24గంటలు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడ బ్ల్యూజేఎఫ్) ఖండించింది. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య ఆదివారం ఒక ప్రకటనలో డీజీపీని కోరారు. 

Advertisement
Advertisement