apwjf
-
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ సంఘం నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రామాంజినేయులు, కార్యదర్శి ఎ.షఫివుల్లా, బ్రాడ్ కాస్టింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.రామాంజినేయులు, ఇతర నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారని, అయితే జిల్లాలో కమిటీలు ఏర్పాటు కాలేదన్నారు. ఆరోగ్య బీమా పథకం అమలులో లోపాలుయన్నాయని, సరైన వైద్యం సకాలంలో అందని పరిస్థితి ఉందన్నారు. బీమా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు, గ్రామీణ విలేకరులకు పక్కా గృహాలు మంజూరు, తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
‘జీ 24 గంటలు’పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి మతగురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడానికి సంబంధించి ప్రసారం చేసిన కథనాల విషయంలో ‘జీ 24 గంటలు’ చానల్‌పై ఆదివారం నాంపల్లి ఠాణాలో మరో కేసు నమోదైంది. ఆ చానల్ కథనాలు హైద్రూస్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండటమేగాక ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఏసీగార్డ్స్ నివాసి సమీఉద్దీన్ అహ్మద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జీ 24 గంటలు చానల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై అరెస్ట్ చేసిన చానల్ విలేకర్లు రవికుమార్, అక్తర్లను హుస్సేనీఆలం పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరినీ నాంపల్లి సీఎంఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 13 రోజుల రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. జర్నలిస్టులను విడుదల చే యాలి: ఏపీడబ్ల్యూజేఏఫ్ డీజీపీకి సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేశారనే సాకుతో పోలీసులు జీ-24గంటలు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడ బ్ల్యూజేఎఫ్) ఖండించింది. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య ఆదివారం ఒక ప్రకటనలో డీజీపీని కోరారు.