వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : పోలీసుల బలిదానాలు ప్రజలు మరువొద్దని వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్‌రావు అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో 5కే రన్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ అర్బ న్, రూరల్ ఎస్పీలు పాల్గొన్న ఈ 5కే రన్‌ను రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించా రు.
హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలైన ఈ పరుగు నక్కలగుట్ట, కలెక్టర్ హౌస్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ మీదుగా పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ పోటీల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో శ్రవన్‌కుమార్, నాగరాజు, మధుసూదన్ మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. 35 సంవత్సరాలు పైబడిన వారి విభాగంలో మైసయ్య, రా మారావు, సత్యనారాయణ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థి నిఖి ల్ వర్మకు ప్రత్యేక నగదు బహుమతి అందజేశారు.
విజేతలకు ఎస్పీలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల కు ఉన్న అభిమానంతో పలువురు ఈ పరుగులో పాల్గొన్నారన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసులకు మధ్య చక్కటి స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. పోలీ సు బలిదానాలతోనే జిల్లా శాంతి కుసుమాలు విరభూసాయని అర్బన్ ఎస్పీ అన్నారు. అర్బన్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్, కమాండెంట్ ప్రభాకర్, డీఎస్పీ రమే శ్, ఆర్‌ఐ ప్రతాప్, సుబేదారి, హన్మకొండ, కేయూసీ సీఐలు మధుసూదన్, దేవేందర్‌రెడ్డి, సత్యనారాయణ, సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పోలీసుల బలిదానాలు మరువొద్దు
Published Mon, Oct 21 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement