పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు | poor women home electricity bill of Rs 30 thousand | Sakshi
Sakshi News home page

పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు

Published Fri, May 20 2016 5:43 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు - Sakshi

పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు

వాకాడు : రెక్కాడితేగాని డొక్కాడని ఓ పేదరాలి ఇంటికి రూ. 30 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మండలంలోని నెల్లిపూడి గ్రామం దళితవాడకు చెందిన కావలి గున్నమ్మ ఇంటి ఉన్న విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ 352. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి  రూ.29,943 తిరిగినట్లు బిల్లు రావడంతో ఆ పేదరాలు ఖంగుతింది. మార్చి రీడింగు 226 యూనిట్లు ఉండగా ఏప్రిల్‌కు 276 యూనిట్లుగా ఉంది. దీని ప్రకారం ఆమె ఖర్చుచేసిన కరెంటు 50 యూనిట్లు మాత్రమే. కాని బిల్లు మాత్రం రూ. వేలల్లో వచ్చిపడింది.

ఈ మొత్తాన్ని తప్పనిసరిగా కట్టాలని విద్యుత్‌శాఖ వారు చెప్పడంతో ఇంత డబ్బు తాను ఎలా కట్టలని ఆ పేదరాలు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇలా విద్యుత్‌శాఖ వారు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో దాదాపు 50 ఇళ్లకు పైగా అధిక విద్యుత్ బిల్లు వచ్చి ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement