సీఎం జగన్‌ను కలిసిన ‘పోస్కో’ సీఈవో | Posco To Set Up Steel Plant in AP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ‘పోస్కో’ సీఈవో

Published Thu, Jun 20 2019 8:53 PM | Last Updated on Thu, Jun 20 2019 8:59 PM

Posco To Set Up Steel Plant in AP - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు కొరియన్‌ స్టీల్ కంపెనీ పోస్కో ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో బాంగ్‌ గిల్‌ హో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయి తమ అభిప్రాయాన్ని తెలిపారు. పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు.

ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో త్వరలోనే పోస్కో సాంకేతిక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కంపెనీ ఏర్పాటుకై స్థలాన్ని అన్వేషించనుంది. కాగా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం‌ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement