గవర్నర్ కు తపాలా బిళ్లలను అందజేస్తున్న ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటున్న ‘మై స్టాంప్’ కింద తపాలాశాఖ ఏపీ సర్కిల్ గవర్నర్ నరసింహన్ ఫొటోలతో తపాలా బిళ్లలను రూపొందించింది. దీనికి సంబంధించి ఓ ఆల్బమ్‌ను శుక్రవారం సాయంత్రం తపాలాశాఖ ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు.
ఆ తపాలాబిళ్లలు చెల్లుబాటవుతాయని, వాటిని సాధారణ పోస్టల్ స్టాంప్స్ తరహాలో వినియోగించొచ్చని గవర్నర్‌కు వివరించారు. తన చిత్రాలతో ఉన్న స్టాంపులు చూసి గవర్నర్ అబ్బురపడ్డారు.