ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. సభావేదికకు బూరుగుల రామకృష్ణారావు పేరు పెట్టారు. ఎల్బీ స్టేడియం ప్రధాన ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి, కృష్ణదేవరాయ, సురవరం ప్రతాప్‌రెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. సాంసృతిక వేదికకు గురజాడ అప్పారావు పేరు పెట్టారు.
మరోవైపు ఏపీ ఎన్జీవోల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్‌లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు.
సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరు
Published Fri, Sep 6 2013 6:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement