Save andhra pradesh Meeting
-
రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందేమో.. అశోక్‌బాబు
స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటున్న బీజేపీ.. సమైక్యరాష్ట్రంపై వైఖరేమిటి అసెంబ్లీ తీర్మానం లేకుంటే మిలియన్ మార్చ్ చేస్తాం: అశోక్‌బాబు సాక్షి, గుడివాడ, విజయవాడ: జీతాల కోసం కాదు.. మా బిడ్డల జీవితాల కోసం ఉద్యమిస్తున్నామన్న సంగతిని తాము రుజువు చేయడంతో అనేక ప్రాంతాల్లోని ప్రజలు తనను రాజకీయాల్లోకి రావాలని కోరారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సిన ఎంపీలు, రాజకీయ పార్టీల చేతకానితనం వలనే రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. విభజన ప్రక్రియను తాము 2014 వరకు ఆపగలమని, ఎన్నికల్లో ఓటేసేటప్పుడు మీరు తప్పుచేస్తే వందమంది అశోక్‌బాబులు వచ్చినా రాష్ట్ర విభజన అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈసారి జరిగే పీపుల్స్ రివల్యూషన్ (ప్రజల తిరుగుబాటు) ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని, రాజకీయ పార్టీల చరిత్రనే మార్చేస్తుందని అన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు సై అనకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం తేకపోతే కోటిమందితో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించి ఢిల్లీ పెద్దలనే ఇక్కడికి రప్పిస్తామని సవాల్ చేశారు. హైదరాబాద్ తెలంగాణకిస్తే.. ఢిల్లీని యు.పి.కి ఇస్తారా.. రాష్ట్ర విభజనను తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారని, అంతమాత్రాన రాజధాని హైదరాబాద్ అక్కడుందని ఆ ప్రాంతానికి ఇస్తారా.. అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీని ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చేస్తారా అని నిలదీశారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటూ బీజేపీ నినదిస్తోందని, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయడమేనా మీ యూనిటీ నినాదం అని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీని ప్రశ్నించారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే రాజకీయ పార్టీలు సమైక్య రాష్ట్రం ఉంచాలన్న ఏకవాక్య తీర్మానాన్ని ఇవ్వాలని కోరారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఉద్యోగ సంఘాల జె.ఎ.సి. నేతలంతా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ పార్టీల నాయకులను కలిసి విభజన వలన కలిగే నష్టాన్ని మరోమారు వివరిస్తామని చెప్పారు. విభజన అంశాన్ని రోడ్డుపై తేలుస్తారా?:‘అఖిలపక్షం మంచి సంప్రదాయం కాదు. పార్టీల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకునేటట్లయితే పార్లమెంట్, అసెంబ్లీలు ఎందుకు, వాటిని రద్దు చేస్తే సరిపోతుంది’ అని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ అశోక్‌బాబు పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలను కాదని సమస్యను రోడ్డుపై సెటిల్ చేస్తారా అని ప్రశ్నించారు. -
సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరు
ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. సభావేదికకు బూరుగుల రామకృష్ణారావు పేరు పెట్టారు. ఎల్బీ స్టేడియం ప్రధాన ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి, కృష్ణదేవరాయ, సురవరం ప్రతాప్‌రెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. సాంసృతిక వేదికకు గురజాడ అప్పారావు పేరు పెట్టారు. మరోవైపు ఏపీ ఎన్జీవోల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ హైకోర్టు అనుమతి
-
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. మరో వైపు ' సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చూడాలన్న తెలంగాణ న్యాయవాదుల విజ్ఞప్తిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఎల్బీ స్టేడియంలోని ఏర్పాట్లను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ సభకు ఎంతమంది వస్తారన్న దానిపై అంచనా లేదన్నారు. అయితే ఎవరూ గుంపులు, గుంపులుగా రావద్దని ఆయన సూచించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని అశోక్ అన్నారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు నాలుగంచెల భద్రత
తెలంగాణవాదులు అడ్డుకోకుండా పటిష్ట చర్యలు తెలంగాణ జిల్లాల నుంచి రాకుండా నగరం చుట్టూ చెక్‌పోస్టులు హైవేలపై సీమాంధ్ర వాహనాలను అడ్డుకోకుండా పెట్రోలింగ్ ఎల్బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ డీజీపీ, సీఎస్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసుశాఖ పటిష్ట భద్రతాచర్యలు తీసుకుంటోంది. పోలీసులు, పారా మిలటరీ బలగాలతో నాలుగంచెల భద్రత ద్వారా ఏపీఎన్జీవోల సభ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎల్బీ స్టేడియాన్ని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు గురువారం అదీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బ్యారికేడ్లను ఏర్పాటుచేయనున్నారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియం లోపలికి గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసుశాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే.. తెలంగాణ జిల్లాల నుంచి భారీసంఖ్యలో నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఏపీఎన్జీవో సభ కోసం సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చే వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటుచేస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే రైల్వేస్టేషన్ల వద్ద కూడా భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ఇదిలావుంటే.. ఏపీఎన్జీవో సభకు భద్రతాచర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎస్ ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మలతో సమీక్షించారు. సభ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.