హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలే ధ్యేయంగా గవర్నర్ ప్రసంగం ఉందని అనంతపురం టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ...చంద్రబాబు నేతృత్వంలో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేశారన్నారు. చిత్తశుద్దితో, ఓ విజన్తో వెళ్లే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తుందని ప్రభాకర్ చౌదరి అన్నారు.