– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: ఆసక్తి ఉన్న రిటైర్డ్ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. జిల్లాలో ఎనిమిది మంది పోలీసు అధికారులు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంట ర్‌లో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో ‘మన కుటంబం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐలు పి.జాన్ (నందికొట్కూరు), పి.పుల్లయ్య (నంద్యాల ట్రాఫిక్), కె.విశ్వనాథ్ (ఆదోని ట్రాఫిక్), అబ్దుల్‌హక్ (నంద్యాల ట్రాఫిక్), ఏఎస్‌ఐలు డీఎల్ దస్తగిరి (ఉలిందకొండ పీఎస్), సి.ప్రసాదరావు (డీసీఆర్‌బీ), కేవీ సుబ్బయ్య (కర్నూలు పీసీఆర్), ఆర్‌ఎస్‌ఐ ఎస్ మహమూద్ (ఏఆర్ హెడ్ క్వాటర్స్) తదితరులు పదవీవిరమణ పొందారు.
వీరందరినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సూట్‌కేసులను బహుమతులుగా అందజేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ దంపతులు అల్పాహారం వడ్డించారు. ఎస్పీ రవికృష్ణతో పాటు తల్లి ఆకె రత్నమాల, సతీమణి ఆకె పార్వతి, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు ములకన్న, నాగరాజు యాదవ్, డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, ఆదిలక్ష్మీ, ఆర్‌ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.
రిటైర్డ్ పోలీసులకు బోధకులుగా అవకాశం
Published Thu, Jun 1 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement