SP RK Ravikrishna
-
రిటైర్డ్ పోలీసులకు బోధకులుగా అవకాశం
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: ఆసక్తి ఉన్న రిటైర్డ్ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. జిల్లాలో ఎనిమిది మంది పోలీసు అధికారులు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంట ర్లో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో ‘మన కుటంబం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐలు పి.జాన్ (నందికొట్కూరు), పి.పుల్లయ్య (నంద్యాల ట్రాఫిక్), కె.విశ్వనాథ్ (ఆదోని ట్రాఫిక్), అబ్దుల్‌హక్ (నంద్యాల ట్రాఫిక్), ఏఎస్ఐలు డీఎల్ దస్తగిరి (ఉలిందకొండ పీఎస్), సి.ప్రసాదరావు (డీసీఆర్బీ), కేవీ సుబ్బయ్య (కర్నూలు పీసీఆర్), ఆర్ఎస్ఐ ఎస్ మహమూద్ (ఏఆర్ హెడ్ క్వాటర్స్) తదితరులు పదవీవిరమణ పొందారు. వీరందరినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సూట్‌కేసులను బహుమతులుగా అందజేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ దంపతులు అల్పాహారం వడ్డించారు. ఎస్పీ రవికృష్ణతో పాటు తల్లి ఆకె రత్నమాల, సతీమణి ఆకె పార్వతి, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు ములకన్న, నాగరాజు యాదవ్, డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, ఆదిలక్ష్మీ, ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
సమాజశ్రేయస్సే పోలీస్ లక్ష్యం
► జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ► అడిషనల్ ఎస్పీ, ఎస్బీ డీఎస్పీ పదవీవిరమణ కర్నూలు: కుటుంబం కన్నా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పని చేసేది పోలీసులు మాత్రమేనని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శివరామప్రసాద్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఏజీ కృష్ణమూర్తి, నంద్యాల పీసీఆర్ ఎస్ఐ అబ్దుల్సలాం, నంద్యాల యూనిట్‌కు చెందిన హోంగార్డు దేవదాసు తదితరులు పదవీవిరమణ పొందారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో మన కుటుంబం పదవీవిరమణ కార్యక్రమం పేరుతో వేడుకలు నిర్వహించారు. పదవీవిరమణ పొందిన అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సతీమణి ఆకే పార్వతి, కూతురు, కుమారుడు దీక్షిత, హేమకేషు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబాలతో సంతోషంగా జీ వితం గడపాలని వారికి ఎస్పీ సూచించారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాం తీయ అధికారి శివకోటి బాబురావు, ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, జె.బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, హుసేన్‌పీరా, వెంకటాద్రి, సీఐలు ములకన్న, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఆర్ఐ రంగముని, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
అడుగడుగునా నిఘా
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామ గ్రామానా సోదాలు చేపట్టారు. ఎన్నికల ముందే మద్యం భారీగా డంప్ చేశారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపులు, సారా బట్టిలపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే ఆళ్లగడ్డలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మొబైల్ టీంలతో ఆకస్మిక తనిఖీలూ చేపడుతున్నారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. పల్లె నిద్రలో భాగంగా ఆయా స్టేషన్ల పరిధిలోని అధికారులందరూ గ్రామాల్లో పర్యటించి.. గ్రామ సభలు ఏర్పాటు చేసి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని, బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని వారికి సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారు, సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి బైండోవర్ చేస్తున్నారు. ఆయుధాలు సీజ్.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామాల్లో మారణాయుధాలు, తుపాకుల ఏరివేతపై పోలీసులు దృష్టి సారించారు. అహోబిలం ప్రాంతాల్లో చెంచులు అడవుల్లోకి వెళ్లేటప్పుడు నాటు తుపాకులు ఉపయోగిస్తున్నందున ఉప ఎన్నికల్లో భాగంగా వాటిని కూడా స్వాధీనం చేసుకునేటట్లు ప్రత్యేక బృందాలను నియమించారు. అలాగే లెసైన్స్ తుపాకులను కూడా పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసే విధంగా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 132 ఆయుధాలను పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండి ఎన్నికల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయని అన్ని రాజకీయ పక్షాల నాయకులకు ఎస్పీ హెచ్చరించారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు ఎవరైనా ఆళ్లగడ్డలో సంచరిస్తే డయల్ 100కు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.